4, సెప్టెంబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 812 (దున్నకు దూడ బుట్టినది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
దున్నకు దూడ బుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్.
(మొన్నటి హుస్నాబాదు అవధానంలో దూడం నాంపల్లి గారు ఇచ్చిన సమస్య.

34 కామెంట్‌లు:

 1. శ్రీ గరికిపాటి నరసింహరావు గారి పూరణ
  (పృచ్ఛకుడు భారతార్థంలో చెప్పమన్నారు)

  కన్నది నిన్ను కుంతి, పొడగన్నది పెంచినతల్లి రాధ య
  న్న న్నవనీతచోరుని ఘనప్రతిపాదన సమ్మతించి తా
  నన్నగ పంచపాండవుల యండగఁ జేరెను - నమ్ముదే యిలన్
  దున్నకు దూడ బుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్.

  రిప్లయితొలగించండి
 2. మాస్టారూ, ఈ సమస్య ఇదివరకు చాలా చోట్ల ఇచ్చిన సమస్యే అనిపిచింది. అయితే భారతార్థంలో పూరించమని అడగటం క్రొత్తేమో అనిపిస్తోంది, అంతే!

  రిప్లయితొలగించండి
 3. గరికిపాటి వారి పూరణ అద్భుతం.
  నా ప్రయత్నం:

  అన్న కుమారు నొల్లరట నందరి రాజుగ నైదు గ్రామముల్
  పన్నుగ నీయ చాలునట పాలన చేయగ మాయ మాట లి-
  ట్లెన్నియొ చెప్పుచుండె నిట నీ పశుపాలుడు నమ్ము మల్లుడా
  దున్నకు దూడ బుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్

  రిప్లయితొలగించండి
 4. చంద్రశేఖర్ గారూ,
  పృచ్ఛకుడు ఆ సమస్యను వినిపించగానే నాకూ ఇదే ఆలోచన వచ్చింది. ‘ఎప్పుడో విన్నట్టుగా’కూడా కాదు ‘చాలాసార్లు విన్న సమస్యే’ అనిపించింది.

  రిప్లయితొలగించండి
 5. అన్నిటి కౌషధంబనిరి యావులొసంగినక్షీర మేమిటో
  మొన్ననెదూరదర్శనపు పోషణ-పెంపకమందుచూపిరో
  దున్నలు సర్వరోగహర దుగ్ధము నీడునటమ్మ వేగ రా
  దున్నకుదూడ బుట్టినది దుగ్ధముఁబిండగ దుత్తఁ దెమ్మిఁకన్

  రిప్లయితొలగించండి
 6. ఉన్నది యైదు వర్షముల యోగమె, పిమ్మట యెట్లు మారునో?
  చెన్నుగ దండుకొంచు దన చేతికి జిక్కిన వెల్ల నాయకుల్
  క్రన్నన నెవ్వరేని యడుగన్ దల దోకయు లేక బల్కుటల్
  దున్నకు దూడ బుట్టినది దుగ్ధము బిండగ దుత్త దెమ్మికన్

  రిప్లయితొలగించండి
 7. అన్నయె యానతిచ్చె నని యప్పుడె నాతిని భంగపఱ్చె, దా
  విన్నది ధర్మమౌనొకొ? వివేకము లేని ప్ర వర్తనమ్మిదే!
  యన్నను వింతలేదు మఱి, యాతని మూర్ఖత నిట్లు పోల్చెదన్.
  "దున్నకు దూడ బుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్."

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,
  గురువుగారి సవరణలకు ధన్యవాదములు

  మీ దీవెనలు నాకు శ్రీరామ రక్ష

  విత్త మంత్రి విదేశ పరిశ్రమల వల్ల చిల్లులున్న భోషాణము నిండునను మాటను
  ----

  పన్నుల పైన బన్నులను- పాలక వర్గము వేయ నిండు నా ?
  కన్నము లున్న దుత్తలు, మ -గాడిని జూడుము , విత్త మంత్రిగా
  నున్న చిదం బరం బలికె -నుత్తమ జాతికి జెంది నట్టి నా
  దున్నకు దూడ బుట్టినది- దుగ్ధము బిండగ, దుత్త దె మ్మికన్  రిప్లయితొలగించండి
 9. శ్రీ గురువులకు, పెద్దలకు
  ప్రణామములు!

  అన్నలు ఆవును ఎప్పటికైనా తనకు ఇస్తారన్న నమ్మకంతో కంటికి రెప్పలా కాపాడి మోసపోయిన తమ్ముని చూచి బాటసారి అంటున్న మాట. అంత్యానుప్రాస పూరణం.


  “అన్నలు నాకు నిత్తు” రని యాదటఁ బ్రోచితి గుత్త యొమ్మికన్;
  కన్నఱ వీడు; మీ మొదవుఁ గానిక సేయరు క్రొత్త నెమ్మికన్;
  పిన్నవు నీవు; పాడువడి బీడవు చేనిని రిత్త నమ్మికన్
  దున్నకు; దూడ బుట్టినది – దుగ్ధముఁ బిండగ దుత్త దెమ్మిఁకన్.

  విధేయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 10. చెన్నుగ దున్నపోతు మును చిన్నది యొక్కటి పుట్టె గేదెకున్
  తిన్నగ సూడిదయ్యె మరి తీరును జూడగ యీను నేడికన్!
  క్రన్నన పెయ్య పుట్టినను గాదిలి హెచ్చగ చిన్ని చెల్లియౌ
  దున్నకు, దూడ బుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్!!

  రిప్లయితొలగించండి
 11. గుండు మధుసూదన్ గారి పూరణ....

  [భూస్వామి, పొలమును దున్నుటకై వేగిరపడు పాలేరుతో, తమ యావు చిన్ని దూడ నీనె నని, పొలమునకు వెళ్ళుట మాని, యావుపాలు పిండుటకై దుత్తను తెమ్మని మాట తడబాటుతో బురమాయించు సందర్భము]
  అన్న! యిదేమి మాట? మన కన్నముఁ బెట్టెడి తల్లి మేదినిన్,
  మిన్నును, నావునున్ మనసు మెచ్చెడి రీతిగఁ జూడు! నిండు చూ
  ల, న్నుగ నీనె నీ దెసను! నాదటఁ బోయి బిరాన భూమినిన్
  దున్నకు! దూడ పుట్టినది; దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్!

  రిప్లయితొలగించండి
 12. తిండికి తప్ప మరొకపనికి తరం కాని కొడుకును గురించి కోపంతో ఒక రైతు తన భార్యతో-

  అన్నము మూడుపూటలును యందిన దందిన యట్లు మెక్కియున్
  తిన్నది చెల్లుగాగ మరి తీరక పాలును కోరసాగెఁబో
  యెన్నని తెచ్చి మేపుదుము? ఈ మన దండగమారి సూనుకున్,
  దున్నకు, దూడ బుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్!!

  రిప్లయితొలగించండి
 13. సన్నని వానతుంపరలు సంతసమున్ గలిగింపగా, మడిన్
  దున్నెద నిప్పుడే యనుచు దోసిట నాగలి పట్టినట్టి రై
  తన్నను జూచి రైతు సతి తాననె, " ఆగుము యించుకన్ మడిన్
  దున్నకు; దూడ పుట్టినది దుగ్దము పిండగ దుత్త తెమ్మికన్ ! "

  వివరణ : పొలం దున్నడానికి రైతు నాగలి తీసుకొని బయలుదేరే అంతలో గొడ్ల పాకలో ఆవు దూడను ఈనిందని గమనించిన రైతు భార్య, రైతుతో అంటున్నది 'పొలానికి ఇప్పుడే వెళ్ళొద్దు ! ....’

  రిప్లయితొలగించండి
 14. సన్నని వానతుంపరలు సంతసమున్ గలిగింపగా, మడిన్
  దున్నెద నిప్పుడే యనుచు దోసిట నాగలి పట్టినట్టి రై
  తన్నను జూచి రైతు సతి తాననె, " ఆగుము యించుకన్ మడిన్
  దున్నకు; దూడ పుట్టినది దుగ్దము పిండగ దుత్త తెమ్మికన్ ! "

  వివరణ : పొలం దున్నడానికి రైతు నాగలి తీసుకొని బయలుదేరే అంతలో గొడ్ల పాకలో ఆవు దూడను ఈనిందని గమనించిన రైతు భార్య, రైతుతో అంటున్నది 'పొలానికి ఇప్పుడే వెళ్ళొద్దు ! ....’

  రిప్లయితొలగించండి
 15. వివరణ పొడిగింపు : రైతు భార్య అంటున్నది రైతుతో " మన ఆవుకు దూడ పుట్టింది; నువ్వు మడిని ( పొలాన్ని ) దున్నడానికి వెళ్ళద్దు ! పాలు పితకడానికి చెంబును తీసుకొని రా !

  రిప్లయితొలగించండి
 16. కవిమిత్రులారా,
  ఇంతకాలం వృత్తపాదాలను సమస్యలుగా ఇస్తే ఔత్సాహిక కవులు ఇబ్బంది పడతారనుకేవాడిని. ఇప్పుడు నాకు నమ్మకం, ధైర్యం కలిగాయి. ఇకనుండి తరచుగా వృత్తపాదాలను కూడా ఇస్తాను.
  *
  మిస్సన్న గారూ,
  శకుని సుయోధనునకు చెప్పిన మాటగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  దూరదర్శన్ వారిపై మీ సెటైర్ చమత్కారభరితంగా ఉంది. అభినందనలు.
  "దుగ్ధము నీడునటమ్మ..." ?
  *
  పండిత నేమాని వారూ,
  రాజకీయనాయకుల మాటల అంతరార్థంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  "చిదంబరం బలికె..." ? "చిదంబరం బనియె" అని మీ భావమా?
  *
  ఏల్చూరి మురళీధరరావు గారూ,
  ఆహా! ఏమా పదసంపద? "కన్నఱ" శబ్దంకోసం నిఘంటువును ఆశ్రయించవలసి వచ్చింది. అత్యానుప్రాసా శోభితమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. భారతార్థంలో ..

  కానల పాలు పాండవులు ; కావున గోపతి కోపగించి, వెం
  కన్నను జూచనెన్, " గ్రహణకాలము ఎంతగ దాపురించెనో !
  చిన్నెల యావు యీనినది ; శీఘ్రమె నీవిటు రమ్ము! ఏమిరా !
  దున్న ! *కుదూడ పుట్టినది దుగ్దము పిండగ దుత్త తెమ్మికన్ ! "

  *కుదూడ = అవిటి దూడ

  వివరణ : పాండవులు అన్యాయంగా అడవుల పాలవడంతో , ఆ రాజ్యంలోని ఒక గోస్వామి కోపంగా తన పాలేరు వెంకడితో ఇలా అంటున్నాడు " ఒరే! చూచావా ! మన రాజ్యానికి ఎంతటి గ్రహణ కాలము దాపురించిందో ! మన ఆవు కూడ అవిటి దూడను వేసింది. తొందరగా చెంబు తీసుకొని రారా ! దున్నపోతా ! పాలు పిండాలి "

  రిప్లయితొలగించండి
 18. మాస్టారూ, ధన్యవాదాలు. "దుగ్ధము నిచ్చునటమ్మ..." అందాము.

  రిప్లయితొలగించండి
 19. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారు చక్కని పద్యములు వ్రాసేరు. సంతోషము - వారికి అభినందనలు. అక్కడక్కడ కొన్ని సవరణలు అవసరము.
  కానల పాలు పాండవులు అని మొదలిడిన పద్యమును చూద్దాము:

  1. 1వ పాదములో ప్రాస నియమము పాటింపబడ లేదు.
  2. గ్రహణ కాలము + ఎంతగ (మరియు) రమ్ము + ఏమిరా అనే చోటులలో విసంధిగా వదిలి వేసేరు.
  3. ఈనినది - (ఈను అనేది క్రియ) - ఆవు + యీనినది అనే విధముగ యడాగమము వచ్చే అవకాశము లేదు.
  4. కుదూడ అనే ప్రయోగము సాధువేనా?

  వారు ఉత్సాహముతో పద్యములు రచించుట ముదావహము. ఆలాగే బాగుగా అభ్యాసము చేయాలి, బాగుగా అభివృద్ధిలోకి రావాలి అని మా ఆకాంక్ష.

  రిప్లయితొలగించండి
 20. అయ్యా ! పండిత నేమాని గారూ ! మీరు ఎత్తి చూపెట్టిన తప్పులన్నీ నిజమే ! ఏదో ఉత్సాహంలో అలా వ్రాశాను. సరిగా చూసుకోలేదు. ధన్యవాదాలు. కుదూడ అనేది నా ప్రయోగమే ! సాధువో కాదో మాస్టారు గారే చెప్పాలి.

  రిప్లయితొలగించండి
 21. ఇదే సమస్యకు నేను 'సాహితీ స్రవంతి' త్రైమాసిక సాహిత్య పత్రికలో చేసిన పూరణలు:
  పున్నెముఁ జేసినాము సుమి భూమిని ధేనువుఁ జేసి పిండె యా
  పన్నశరణ్యుడా పృథువు పాలకు మారు సమస్త వస్తువుల్
  మన్నన సేసె మా మనవి మానుము శోకము చాలు కర్షకా,
  దున్నకు! దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్త తెమ్మికన్

  ఎన్నడులేని ప్రేమలివి ఎచ్చటనుండి జనించె కౌరవుల్
  నిన్నును నన్ను తమ్ములను నేడిటు పంపిరి తల్లి తోడుగా
  చెన్నగు వారణావతము చెల్వగు తీరు యుధిష్ఠిరా, కనన్
  దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్త తెమ్మికన్!

  రిప్లయితొలగించండి
 22. కన్నులు జూడ పెద్దవిటు గాంచగ కొమ్ములు చిన్నవైన మా
  అన్నయ గారి దున్నకును యన్నుల మిన్నగు మాదు గేదెకున్
  కన్నులు గల్సి మేనులును గల్వగ నిప్పుడు మాదు గేదెకున్
  దున్నకు, దూడ బుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్

  రిప్లయితొలగించండి
 23. ఎన్నిక లొచ్చుచున్నవవి యెందులకీ నస యెంచిజూడగన్
  మిన్నగనేలవచ్చుగద మేమును మీరలు కూటమౌద మం
  చన్నవి భాజపా మరియు హస్తము లన్న,నదిట్లుఁబోల్చరే
  "దున్నకు దూడబుట్టినది దుగ్ధముఁబిండగ దుత్తదెమ్మికన్!"

  రిప్లయితొలగించండి
 24. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ!
  మీ భావము బాగున్నది. ఎన్నిక లొచ్చు చున్నవని -- అనరాదు. వచ్చు అనేదే సరియైన పదము. ఎన్నిక లింక వచ్చునని అని మార్చుదాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 25. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళుచున్నప్పుడు సుయోధనునితో కర్ణుని చలోక్తి :

  01)
  _________________________________________

  దన్నుగ నీవు నిల్చినను - ధైర్యముగా, హృదయాంతరాళమం
  దున్నటు వంటి , ద్రౌపదిని - తోడ్కొని దెచ్చి , వివాహ మాడి , ముం
  దెన్నడు బొంద నట్టి , పరి - తృప్తిని బొందెద మిత్ర సత్తమా
  యన్నటు వంటి, వాని , పరి - హాసము జేయుచు కర్ణు డిట్లనెన్ !
  "దున్నకు దూడ బుట్టినది - దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్
  యన్నటు లున్న దీప్సితము - యంత్రపు భేద నొనర్చ కుండగన్ "!
  _________________________________________

  రిప్లయితొలగించండి
 26. నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండవ పూరణలోని దోషాలను నేమాని వారు ప్రస్తావించారు. చూసారు కదా! "కుదూడ" అని ప్రయోగించరాదు. మీ పద్యం సవరణలకు లొంగనంటున్నది. ఏమైనా మీ ప్రయత్నం ప్రోత్సహించ దగింది. అభినందనలు.
  *
  ఫని ప్రసన్న కుమార్ గారూ,
  మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  నేమాని వారి సవరణను గమనించారు కదా!
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. గురువర్యులిర్వురకు ప్రణామములు.ధన్యవాదములు. తమరి సవరణకు కృతజ్ఞతలు. శ్రీనేమని గరువర్య విరచిత రామాయణము చదువాలని ఉంది. శ్రీ నేమని గురువర్యులు దయతో నాకు ఒక కాపి పంపించ గలిగితే ధన్యుడను.స్వస్తి.

  రిప్లయితొలగించండి
 28. ధనికొండ రవిప్రసాద్ గారి పూరణ....

  దున్నలు తేరగా దొరుక తోడుగ నొల్లని బర్రె మాది నే
  నెన్నియొ బాధలన్ బడితి నెక్కువ సొమ్మును బెట్టి యందమౌ
  దున్నను కొంటి దాని తన తోడుగ మెచ్చెను బర్రె కొన్నదౌ
  దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్త దెమ్మికన్ !
  ( ఈ సమస్యని కొద్ది మార్పులతో ఇస్తూ ఉంటారు కానీ దీనిని యథాతథంగా పూరించరు. నేను యథాతథం గానే పూరించాను. ఊరికే వచ్చిన దున్నపోతులని బర్రె అంగీకరించలేదు. డబ్బు పెట్టి కొన్న దున్ననే బర్రె అంగీకరించింది. కట్నం ఇచ్చిన సంబంధాన్నే అమ్మాయి ఒప్పుకున్నట్లు. ఆ దున్న వలననే దూడ పుట్టింది )

  రిప్లయితొలగించండి
 29. తన్నుకు వచ్చుచున్ ప్రజలు దండిగ వోటులు దారపోయగా...
  అన్న ప్రధానమంత్రిగను హాయిని గొల్పుచు రాజ్యమేలగా...
  మిన్నగ భారతావనిని మేలగు గోవులు వట్టిపోవగా...
  దున్నకు దూడ బుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మిఁకన్

  రిప్లయితొలగించండి