11, సెప్టెంబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 819 (ఆమనిఁ గని శుకపికమ్ములు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
ఆమనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్.

33 కామెంట్‌లు:

  1. ఏమందు మీ ప్రపంచం
    బామయమయమయ్యె బ్రతుకు లాపదపాలై
    స్వామీ! కలుషితమగు నీ
    యామనిగని శుక పికమ్ము లయ్యో యేడ్చెన్

    రిప్లయితొలగించండి
  2. ఆమని పక్షుల నెన్నియొ
    ప్రేమగ తా నింటి లోనె ఫెంచును, పెండ్లై
    ఓ మాసముండి రాగా
    ఆమనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యము 3వ పాదములో ఓ మాసముండి అని వ్యావహారికమును వాడేరు. ఇలా మార్చుదాము:
    "యామె చని పిదప రాగా"

    రిప్లయితొలగించండి
  4. రాముడు సీతను విడి వన
    సీమలలో దిరుగు చుండె చిక్కిన వాడై !
    రాముని దు:ఖము గని , నట
    నామని గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్ !

    రిప్లయితొలగించండి
  5. అయ్యా!శ్రీ చింతా రామకృష్ణా రావు గారూ!
    శుభాశీస్సులు.
    3వ పాదములో 3వ గణము సరిగా లేదు. జగణము వద్దు. సరిచేయండి.
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము 3వ పాదములో "నట" అని నుగామము వాడేరు. "యట" అని సరిచేయండి.

    రిప్లయితొలగించండి

  7. భామ యగు సీ త మాతను
    పామరుడగు చాకి వాని మాటలు నమ్మీ
    రాముడు పంపగ నడవికి
    యా మని గని శుక పికమ్ములయ్యో యే డ్చెన్ .

    రిప్లయితొలగించండి
  8. భూమీ తలంబు వగచగ
    నేమారెనుఋతువులన్ని 'ఎలనిన్' కొలువై
    యేమావిచిగుర్లెరుగక
    నామనిఁగని శుక పికంబులయ్యోయేడ్చెన్!

    రిప్లయితొలగించండి
  9. భూమీ తలంబు వగచగ
    నేమారెనుఋతువులన్ని 'ఎలనిన్' కొలువై
    యేమావిచిగుర్లెరుగక
    నామనిఁగని శుక పికంబులయ్యోయేడ్చెన్!

    రిప్లయితొలగించండి
  10. భూమీ తలంబు వగచగ
    నేమారెనుఋతువులన్ని 'ఎలనిన్' కొలువై
    యేమావిచిగుర్లెరుగక
    నామనిఁగని శుక పికంబులయ్యోయేడ్చెన్!

    రిప్లయితొలగించండి
  11. అయ్యా శ్రీ సుబ్బారావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యమును చూచేను. చాలా మార్పులు అవసరము. చూడండి:
    1. భామయగు సీత మాతను (1వ పాదము)
    సీతా మాత అని సమాసము. భామ యని అన్ని సందర్భములలోనూ అందరు స్త్రీలకు వర్తింపజేయలేము. అందుచేత : భూమీసుతయగు సీతను అని మార్చ వచ్చును.

    2. పామరుడగు చాకివాని మాటలు నమ్మీ: ప మ లకు యతి మైత్రిలేదు. నమ్మీ అనేది వ్యావహారికము. నమ్ముచు అంటే వ్యాకరణ శుద్ధము అవుతుంది. పామరుడగు చాకివాని పలుకులు వినుచున్ - అని మార్చ వచ్చును.

    3. రాముడు పంపగ నడవికి: బాగుగనే యున్నది.

    4. (నుగాగమముతో) నా మని గని శుక పికమ్ము లయ్యో యేడ్చెన్. నాకు అన్వయము అర్థము కాలేదు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యా పూరణలు కొన్నిటిని చూద్దాము:

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    ఆమని అనే వారి ప్రక్కింటి అమ్మాయి గురించి వ్రాసేరు - వినూత్నముగా నున్నది.

    శ్రీ చింతా రామకృష్ణా రావు గారు:
    మానవులు వనములను దహించుతూ ఉంటే ఆమనిలో పక్షులు యేడ్చెను అన్నారు. ఉత్తమముగా నున్నది.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు: సీతలేని రాముని దుఃఖమును గాంచిన పక్షులు యేడ్చేయి అన్నారు - ప్రశస్తముగా నున్నది.

    శ్రీ సహదేవుడు గారు: భూమీ తలము వగచే రీతిగా ఋతువులను పోల్చుకోలేని స్థితిని వర్ణించేరు. ప్రశస్తముగా నున్నది.

    అందరికీ అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. ఏమని చెప్పను శంకర!
    ఈ మానవ జాతి వనములెల్ల దహింపన్
    తాముండగ తగని యచటి
    యామనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ గురువులకు, పెద్దలకు ప్రణామములు!

    ఆమనిచెలి విరితూపుల
    నా మనికుని మనికితనము నధికాధిక మౌ
    నామని రేయెండను సౌ
    దామనిఁ గని శుకపికమ్ము లయ్యో! యేడ్చెన్.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  15. అయ్యా! డా. ఏల్చూరి వారూ! శుభాశీస్సులు.
    మీ పూరణ అద్భుతముగా ఉంది. నా దొక చిన్న సందేహము. ఇచ్చిన సమస్యలో "ఆమని"లోని తొలి "ఆ"కి యతి స్థానములోని "అయ్యో"లోని "అ"తో యతి మైత్రి ఉన్నది. సౌదామని అనే పదమును వాడినప్పుడు యతి మైత్రిని ఏలాగున అన్వయించాలి? సందేహ నివృత్తి చేయగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. Respected nemani varu ! namaste.
    i think that the samasya is aamenu gani
    insted of aamani gani. sorry for the same.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ గురువులకు విహితానేక ప్రణామములు!

    ఈ రోజు మిత్రుని ఇంటి వేడుకలో మేమంతా ఉండి వినోదంకరణగా పూరణ చేయటం జరిగింది.

    “దా + ఆఙ్ + మ” అన్న ప్రక్రియ వల్ల “దామ”; “సుదామ”; ఆ పైని “సౌదామనీ” అన్న ముకుట వ్యాఖ్య మూలాన;

    “సుదామ వ ద్దీర్ఘ ఆకారోఽస్యా స్తీతి” అన్న సరస్వతి తిరువేంగడాచార్యుల వ్యాఖ్యాధారితం గానూ;

    “ద్యతి = బంధనే” అన్న అర్థంలో “దా + ఆఙ్ + మ” అన్న గుర్తు మూలాన;

    “ప్రజ్ఞాద్యణ్ – అన్ ఇతి ప్రకృతిభావః” అనుకొని

    “సౌదామని” గూఢస్వరం కాగలదని ఊహించాను.

    “సుదామ” పర్వతం పైని తొలుత మెఱుస్తుంది కాబట్టి సౌదామని అని పేరు వచ్చిందని ఒక కథ.

    ఆదిపూడి సోమనాథరావు గారు “ప్ర, భాకర – అనియెన్” అని తమ “కుమారసంభవము” కావ్యానువాదంలో వ్రాశారు. “ప్రభాం కరోతీతి” అని చెప్పుకొంటే యతి భంగం; “ప్రభాయాః ఆకరః” అని చెప్పుకొంటే సరిపడుతుంది – అన్నారట. “దాయాః ఆకరః” అని వ్రాసిన వెనుక మఱో అర్థం స్ఫురించింది.

    ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి సరిచూసి మీకు వ్రాస్తాను. తప్పయితే తప్పక తెలియజేసి, దిద్దుకొంటాను. పూరణకు మీరందజేసిన ఆశీర్వచస్సే మాకు శ్రీరామరక్ష.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  18. గుండు మధుసూదన్ గారి పూరణ....

    ఏమో, యీ గడ్డుకాలము?
    భూమి జనసంఖ్య పెరిఁగెను; భూ జను లుండన్
    భూమిజ ఖండనఁ జేయఁగ;
    నామనిఁ గని శుక పికమ్ము లయ్యో! యేడ్చెన్.

    రిప్లయితొలగించండి
  19. నేమాని గారూ !
    ధన్యవాదములు. యడాగమంతో -


    రాముడు సీతను విడి వన 
    సీమలలో దిరుగు చుండె చిక్కిన వాడై ! 
    రాముని దు:ఖము గని , యట 
    నామని గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్ ! 

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    శ్రీ గుండు మధుసూదన్ గారి పూరణ మీ ద్వారానే టైపు అయినది. కనుక మీరునూ ఒక మారు చూచిన తరువాతనే టైపు చేస్తే బాగుగ నుండెడిది. శ్రీ మధుసూదన్ గారి పద్యములో: 1వ పాదములోను 2వ పాదములోను గణ భంగము కలదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. ఆ "మిస్టరు పెళ్లాము"న
    భామను చక్కంగ జూపె బాపు సొగసుతో
    తాము సరి రామని తలచి
    ఆమనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్!!

    రిప్లయితొలగించండి
  22. గాముడు రాజ్యము నేలగ
    భూమిని త్రవ్వుచు దనుజులు భూజము నఱకున్ !
    యేమారిన ప్రకృతి వింతను
    అమని గని శుక పికమ్ము లయ్యో యే డ్చెన్ !
    ------------------------------------------------------------
    సోముని సొగసుల చిందులు
    హేమంతపు ప్రియ సఖి మది హేలగ విరియన్ !
    యేమది వికృతి చెందిన
    ఆమని గని శుక పికమ్ము లయ్యో యే డ్చెన్ !

    రిప్లయితొలగించండి
  23. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
    సొగసైన సవరణ సూచించారు...
    సవరణతో...

    ఆమని పక్షుల నెన్నియొ
    ప్రేమగ తా నింటి లోనె ఫెంచును, పెండ్లై
    యామె చని పిదప రాగా
    ఆమనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్.

    రిప్లయితొలగించండి
  24. పండిత నేమాని వారూ,
    నమస్కృతులు.
    నా ఆరోగ్యపరిస్థితిని దృష్టియం దుంచుకొని దయతో మిత్రుల పద్యముల గుణదోషవిచారణము చేయుచున్నదుకు కృతజ్ఞుడను. మఱి రెండు దినములలో నా యారోగ్యము బాగుపడునని భావించుచున్నాడను.
    గుండు మధుసూదన్ గారి వద్ద కంప్యూటర్ లేదు, వారికి కంప్యూటర్ పరిజ్ఞానము కూడా లేదు. వారి వద్ద నున్న‘ఐఫోను’ ద్వారా వారి పద్యములను, వ్యాఖ్యలను స్వయముగా టైపు చేసి పంపిందుచున్నారు. అవి నా మెయిలుకు వచ్చుచున్నవి కాని బ్లాగులో ప్రకటింపబడుట లేదు. అందువలన నా మెయిలుకు వచ్చిన వ్యాఖ్యలను ‘కాపీ’ చేసి, ఇక్కడ వ్యాఖ్యల పెట్టెలో ‘పేస్ట్’ చేయుచున్నాడను. వ్యాఖ్య బ్లాగులో ప్రకటింపబడిన తరువాత చదువుచున్నాను. అందువలన ఆ పొరపాటు జరిగినది.

    రిప్లయితొలగించండి
  25. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....

    గురుతుల్యులు పండిత నేమానివారూ! నా పద్యములో దొరలిన దోషమును దెలిపినందులకు ధన్యవాదములు! నేను మొదట దీనిని సరిగనే వ్రాసితిని. కాని సెల్ ఫోనులో టైపు చేయు సమయమున నెందులకో 1,2 పాదములు తారుమారయినద. యతి తప్పినదని సవరించితిని! కాని ప్రమాదమును గమనించనైతిని. మఱొక మారు ధన్యవాదములతో...స్వస్తి.

    సవరించిన పూరణ....

    భూమి జనసంఖ్య పెరుఁగఁగ
    నేమో యీ గడ్డుకాల మీ జనులుండన్
    భూమిజ ఖండనఁ జేయఁగ;
    నామనిఁ గని శుక పికమ్ము లయ్యో! యేడ్చెన్.

    రిప్లయితొలగించండి
  26. గోమించుతల్లి విద్యా
    ధామమునకుఁ వచ్చి వెడలు తరిఁ సుతునివలెన్
    దా మరుగయ్యెడి ఘడియల
    నామనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్.

    రిప్లయితొలగించండి
  27. శ్రీమంతులకేలదెలియు?
    మామిడి, మల్లె, మగువ రతి, మన్మధులవలెన్
    ఓ మరదల!వీడ్కోలని
    నామనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్

    రిప్లయితొలగించండి

  28. శ్రీ సరస్వత్యై నమః:
    ఈనాటి సమస్యా పూరణములో పాల్గొనిన కవి మిత్రులందరికి పేరు పేరునా అభినందనలు. అందరి పూరణలు రసభరితముగా నున్నవి. కవితలలో ఆమని కనువిందు చేసినది.

    1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
    2. శ్రీ నాగరాజు రవీందర్ గారికి
    3. శ్రీ సుబ్బా రావు గారికి
    4. శ్రీ సహదేవుడు గారికి
    5. శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి
    6. డా. ఏల్చూరి వారికి
    7. శ్రీ మధుసూదన్ గారికి
    8. శ్రీ జిగురు సత్యనారాయణ గారికి
    9, శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారికి
    10, శ్రీ రామకృష్ణ గారికి
    అందరికీ శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  29. అయ్యా విషాదం ఏమిటంటే నిన్న రాత్రి నేను పెట్టిన పూరణ బ్లాగులో కనుపించడం లేదు. కారణం తెలియదు. మళ్ళీ ఉంచుతున్నాను.

    ఆ మురళీధరు డేగం
    గా మధురకు గోపికాళి కడు దు:ఖించెన్
    తామెట్లిక మనగలమని
    యామనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్.

    రిప్లయితొలగించండి
  30. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
    మీ పూరణ "మధురలోని మురళీ గానమును" వినిపించినది. మధురముగా నున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  31. ఆమీరుపేట రోడ్డున
    మామిడి పది చెట్లు విరియ మామిడి పూవుల్
    ఆ మునిసిపాల్టి నఱకగ...
    ఆమనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్

    రిప్లయితొలగించండి
  32. Love Birds:

    నీమముగా గుడ్లనునిడి
    పాముల నోళ్ళ పడకుండ బలుపౌ గూళ్ళన్
    టైముకు కట్టగ వలెనని
    ఆమనిఁ గని శుకపికమ్ము లయ్యో యేడ్చెన్ :)

    రిప్లయితొలగించండి