26, సెప్టెంబర్ 2012, బుధవారం

పద్య రచన - 124

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. దేవకి గర్భమందు వసుదేవుని పుత్రుని రూపమందునన్
  పావనమూర్తి శ్రీ హరియె భక్తుల పాలిట కామధేనువై
  భావిని పుట్టబోవునను పల్కుల కంసుడు విన్నతోడనే
  దీవనలిచ్చి పంపదగు దేవకి నప్పుడు చంప బూనెనే!

  రిప్లయితొలగించండి
 2. చెల్లెలి కడుపున బుట్టెడు
  అల్లరి కన్నయ్య నన్ను నంతము జేయున్
  చెల్లగ నివ్వను దానిని
  ఇల్లిదె హతమార్చు కంసు డిప్పుడె నిన్నున్.

  రిప్లయితొలగించండి
 3. శ్రీ గుండు మధుసూదన్ గారు ప్రతి నిత్యము నొక ఖండికను వెలువరించు చున్నారు. వారి కృషి గురించి:

  కనుపట్టంగనె కావ్య వస్తువని వేగంబొప్ప పద్యమ్ములన్
  మనమారన్ విరచించు చుండుగద సమ్మాన్యుండు నిత్యంబు నా
  తని శ్రీమాన్ మధుసూదనున్ కవివరున్ తజ్ఞున్ బ్రశంసించుచున్
  మనుమా శాంతి సుఖాలతో ననుచు బ్రేమన్ గూర్తు నాశీస్సులన్

  రిప్లయితొలగించండి

 4. పుట్టె కృష్ణుడు దేవకి పొట్ట నుండి

  తెలిసి కంసుడు చంపను చెలియ నకట

  కరము నెత్తె ను జూ డుడు కనబ డు న దె

  ప్రాణ రక్షణ కన్నని వంతు సుమ్ము  రిప్లయితొలగించండి
 5. గారాబు చెల్లికి కళ్యాణమొనరించి
  ....నవ దంపతుల సాగనంపుచుండ
  కంసు డవ్వేళ నక్కట! పల్కె నశరీర
  ....వాణి భయంకర వాక్యములను
  ఓరి! కంసా! విను వీరి యష్టమ తన
  ....యుడు చంపు నిన్నన పిడుగు బోలు
  నా వార్తతో కంసు డాగ్రహోదగ్రుడై
  ....యప్పుడే దేవకి నంతమొంద
  జేయగా బూని ఖడ్గమున్ జేతబూన
  వలదు వలదంచు ప్రాధేయ పడుచును వసు
  దేవు డావేళ వారించి దైవమట్లు
  వధువునకు ప్రాణగండంబు బాపె నంత

  రిప్లయితొలగించండి

 6. గౌ.పండిత నేమాని వారికి ధన్యవాదములు! తమవంటి పెద్దల యాశీస్సు లెల్ల వేళలయం దుండవలయునని యాశించు...భవదీయ విధేయుఁడు,
  గుండుమధుసూదన్

  రిప్లయితొలగించండి


 7. (దేవకీగర్భగతాష్టమశిశువు చేఁత మరణమున్నదని కంసున కాకాశవాణి తెలుపుట)
  తే.గీ.
  కూర్మి వసుదేవకుం డంత కోరి రమణి
  దేవకిని బెండ్లియాడి యేతెంచు సమయ
  మునను "రథము నే నడుపుదు" ననుచుఁ గంసుఁ
  డుత్సుకతతోడ నడుపంగ నొక్కసారి;(1)
  కం.
  ఫెళఫెళమను ఘోషముతోఁ
  బలికెను నాకాశవాణి "భళి, యో కంసా!
  చెలియలి గర్భస్థాష్టముఁ
  డొలియించును నీదు ప్రాణ మోయీ వినుమా!"(2)
  ఆ.వె.
  అనఁగ కుపితుఁ డయ్యె నా కంసుఁ డంతటఁ
  గత్తి దూసి చంపఁగాను బోవ,
  "బావ! యాగు" మనుచు వసుదేవుఁ డాపియు
  నష్ట బాలకులను నతని కిడుదు;(3)
  తే.గీ.
  అనఁగఁ గంసుండు శాంతించి, "యట్టులె" యని
  మాట పుచ్చియు విడిచెను మఱది, చెల్లి!
  ప్రాణ సమమైన చెల్లెలు, బావ యనియుఁ
  జూడ రయ్యయో దుష్టులు సుంతయైన!(4)

  రిప్లయితొలగించండి
 8. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం కరుణరసాంచితమై మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అభినందనీయమైన ప్రయత్నం. కానీ అన్యయలోపం ఉన్నది. మూడవ పదాన్ని ‘చెల్లగ నివ్వ ననుచుఁ దా’ అని సవరిస్తే అన్వయం కుదురుతున్నట్టు అనిపిస్తున్నది.
  *
  పండిత నేమాని వారూ,
  గుండు మధుసూదన్ గారిని ఆశీర్వదించిన పద్యం మహదానందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
  చిత్రానికి అన్ని విధాల తగిన పద్యరత్నాన్ని రచింది హృదయాహ్లాదాన్ని కలిగించారు. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ ఖండిక బాగుంది. అభినందనలు. చివరి వాక్యం ఆ ఖండికకు వన్నె తెచ్చింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి


 9. పలికె నాకాశవాణి యాపద నెరుంగు
  సోదరీ గర్భమున బుట్టు సుతుడె నీకు
  మృత్యు కారకు డౌనిది సత్యమౌను
  కంసభూపతీ నీవిక కాచుకొనుము.

  పలుకులనువిని కోపమ్ము భయము రగుల
  దేవకిని బట్టి క్రిందికి దిగిచి ఖడ్గ
  మెత్తె వధియింప గంసుండు నింతలోన
  నతని వారించె వసుదేవు డాగుమనుచు.

  సంకేతిక దోషం వలన 833వ సమస్యకు నా పూరణ ,125వ పద్యరచన కింద ప్రచురితమైనది.గమనించ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 10. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
  సవరణ తో నాపూరణ...

  "చెల్లెలి కడుపున బుట్టెడు
  అల్లరి కన్నయ్య కంసు నంతము జేయున్"
  అల్లన వినగా 'వాణిని '
  చెల్లిని జంపంగ కత్తి చేతను బట్టెన్.

  రిప్లయితొలగించండి