7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 815 (కోడ లున్నచోటు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కోడ లున్నచోటు వీడు నత్త!

25 కామెంట్‌లు:

  1. ఔర! యుండరు తొలి యాషాఢ మాసాన
    నొక్క యింట నత్తయును స్నుషయును
    నట్టి కారణమున నా యొక్క నెల లోన
    కోడలున్న చోటు వీడు నత్త

    రిప్లయితొలగించండి
  2. పెత్తనమును చేయు నత్త కొడుకు యింట
    మూతి ముడుచు కోడ లంత లోన ;
    "కొడుకు ఎపుడు గూడ కోడలి వెంటనే !"
    కోడలున్న చోటు వీడు నత్త

    రిప్లయితొలగించండి
  3. నూత్నదంపతులకు నోట మంగళములు
    పలికి, హారతులను పడతులెల్ల
    జేరి యిచ్చి జనగ;చీకటింట కొడుకు,
    కోడ లున్నచోటు వీడు నత్త!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ నాగరాజు రవీందర్ గారి భావము స్పందన బాగుగనున్నవి. అభినందనలు. వ్యాకరణ దోషములు, యతి దోషములు కంపడుచున్నవి. ఆ పద్యము కొన్ని సవరణలతో ఇలాగ మార్చుదాము:

    పెత్తనమును జేయు నత్త కొడుకు నింట ( కొడుకు + ను + ఇంట) నుగాగమ సంధి
    మూతి ముడుచు కోడ లాతరి కద (యతి మైత్రి కొరకు మార్పు చేసేము)
    కొడుకు తిరుగు చుండు కోడలి వెంటనే (అన్వయ సౌలభ్యము కొరకు మార్పు చేసేము)
    కోడలున్న చోటు వీడు నత్త

    రిప్లయితొలగించండి
  5. మిత్రులారా!
    నిన్నటి సమస్యా పూరణలో చివరిగా వచ్చిన కొన్ని పూరణలు చూద్దాము:
    ముందుగా అందరికీ అభినందనలు.
    1. డా. కమనీయము గారు బాగగు భావముతో (అంబులెన్సు సాయము) అని పూరించేరు. 3వ పాదములో గణములు మరొక్క మారి సరిజూడాలి. స్వస్తి.
    2. చి. కందుల వరప్రసాద్ 3 పద్యములు పంపేరు.
    మొదటి పద్యములో మగత నిద్రలో యముగని అని పూరించేరు.
    2వ పద్యములో రోగము నయము గని అని పూరించేరు.
    3వ పద్యము నేటి గనుల భోక్తలగు నేతలని వర్ణించేరు. శిక్షకు దండనము అంటారు, దండము కాదు. అందుచేత పద్యమును ఇలా మార్పు చేస్తున్నాను:
    దుమికించగ సి బి ఐ బొ
    గ్గుమసిన్ దొరకెను గనులను గొన్న ఘనులు, లే
    శము శిక్షయు లేదను మన
    యము గని రోగార్తు డొక్క డానందించెన్

    రిప్లయితొలగించండి
  6. అత్తగారు మొగుడుతో మొరపెట్టుకొంటోంది:
    కోడలున్నచోటు వీడు నత్తనడకనడు
    చు నది కానబడని చోట మేక
    పోతువోలె వదరి ముప్పునబడు నీ కొ
    డుకొక వెర్రినాగన కద స్వామి!

    రిప్లయితొలగించండి

  7. ధనికు నకును మిగుల దారిద్ర్య మంటును
    కోడలున్న చోటు , వీ డు నత్త
    కొడుకు కాపు రంబు పొడగని నంతనె
    అత్త వారి బంధ మట్ల యుండె .

    రిప్లయితొలగించండి
  8. పెంచు సుతుని తల్లి పెద్దవాడైనంత
    తీరుబాధ్యతలవి తిరువణముతో
    రాగ సతియు సుతుని కార్యధారిణీకాగ
    కోడలున్న చోటు వీడు నత్త

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్

    (సరస్వతీ కటాక్షమున్నచో, లక్ష్మీ కటాక్షమును; లక్ష్మీ కటాక్షమున్నచో, సరస్వతీ కటాక్షమును నుండ వనుట ప్రత్యక్ష సిద్ధమని పెద్దల నానుడి!)


    చదువులున్నచోట సంపదలుండవు;
    సంపదలును నున్నఁ జదువుఁ జొరదు!
    లోక వృత్త మిట్లు లోతుగా వీక్షింపఁ
    గోడలున్నచోటు వీడు నత్త!!

    రిప్లయితొలగించండి
  10. లక్ష్మి వాణి యత్త. లక్ష్మి తానున్నచో
    వాణి దూర మగుచు పారిపోవు
    అత్త యున్న చోటు కటు పోదు కోడలు.
    కోడ లున్నచోటు వీడు నత్త!

    రిప్లయితొలగించండి
  11. రాజకీయమున పురంధరేశ్వరి నేడు
    కాంగి రేసు లోన కలసి పోయె
    బాబు కొడుకె మొగుడు బ్రాహ్మిణికిన్, కాన
    కోడ లున్నచోటు వీడు నత్త!!

    రిప్లయితొలగించండి
  12. కొడుకు పెండ్లి జేయ కోడలిం టికిరాగ
    కొంగు బట్టి యతడు చంగు మనగ
    కన్న తల్లి గుండె ఖంగని విలపింప
    కోడ లున్న చోటు వీడు నత్త !

    క్షమిం చాలి ! . నా కంప్యూటర్ , అలిగి [ కోడల్లా ] కొరుక్కు తింటోంది . అందుకే మన బ్లాగుకి దూ............రమై పోతున్నాను .

    రిప్లయితొలగించండి
  13. అక్కయ్యగారూ, పూరణలో కూడా అత్తగారనిపించారు. పసందుగా ఉంది. అత్తాకోడళ్ళ సరసం-విరసం ప్రపంచమంతటా ఉన్నదే. Everyone Loves Raymond అనే టీవీ షో అమెరికా ఇళ్ళల్లో ఉండే అత్తా-కోడళ్లకి దర్పణ౦, వీలయితే అవకాశం వున్న వాళ్ళు చూస్తారని ఉటంకించాను.

    రిప్లయితొలగించండి
  14. నేమాని గారూ ! వందనములు. దోషములను సవరించి మార్పు చేసినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    ఈనాటి సమస్యకి ఎక్కువ స్పందన రాలేదు. వచ్చిన వన్నియు బాగుగ నున్నవి.
    అందరికి అభినందనలు.

    శ్రీ నాగరాజు రవీందర్: కొడుకు కోడళ్ళ అన్యోన్య సామరస్యము - అత్త పెత్తనమునకు ఆటంకము గురించి వర్ణించేరు. ఉత్తమముగా నున్నది.

    శ్రీమతి లక్ష్మీ దేవి: కోడుకు కోడళ్ళ శోభన గది నుండి అత్త బయటికి వచ్చుటను చెప్పేరు. మంచి స్ఫూర్తి.

    ది అదర్: కోడలు వచ్చిన తరువాత తమ కొడుకు వెర్రి నాగన్నగా తయారు అయేడని భర్త వద్ద వాపోయిన ఇల్లాలు. ఉత్తమముగా నున్నది.

    చంద్రమౌళి: కోడలి రాకతో అత్త పోస్టు ఖాళీ అయింది అని వర్ణించేరు. ప్రశస్తముగా నున్నది.

    శ్రీ గుండు మధుసూదన్: లక్ష్మీ సరస్వతుల వైరుద్ధ్యమును ఉట్టంకించేరు. ఉత్తమముగా నున్నది.

    శ్రీ చింతా రామకృష్ణా రావు: లక్ష్మీ సరస్వతుల విభేదాలను వర్ణించేరు. ప్రశస్తముగ నున్నది.

    శ్రీమతి రాజేశ్వరి : కొడుకు కోడలితో సై అనుట చూచి అత్తగారు దూరముగా పోవుటను వర్ణించేరు. సొగసుగా నున్నది.

    రిప్లయితొలగించండి
  16. Sree jiguru satyanaarayaNa gaaru raajakeeyamulanu prastaavimceru. vinootnamugaa nunnadi. swasti.

    రిప్లయితొలగించండి
  17. వీడు కలత నీవు వెన్నుడు తోడుండ
    కీడు కలుగ బోదు కృష్ణు డనెను
    కరవు కాటకాలు దరిరావు నీసుతుల్
    కోడ లున్న చోటు వీడు నత్త

    రిప్లయితొలగించండి
  18. కొడుకు బార్య ? చూడ కొరత యెచ్చట తీరు ?
    ఊరి కున్న నొక్క పేరదేమి ?
    నడక లోన నెంచ కడు నెమ్మ దదియేది ?
    కోడలు, న్నచోటు, వీడు, నత్త.

    రిప్లయితొలగించండి




  19. వింత యేమి కలదు,వినుచున్నదే కదా!
    చాల యిండ్ల యందు జరుగు కథయె
    అత్త పొడయె గిట్ట నట్టి కోడళ్ళుంట
    కోడలున్న చోటు వీడు నత్త.

    రిప్లయితొలగించండి
  20. గురువులకు ప్రణామములు
    ఛాలా రోజుల తర్వాత తప్పు లోస్తాయని భయ పడ్డాను కానీ గురువుల ప్రశంస ఉక్కిరి బిక్కిరి చేసింది .ధన్యు రాలను
    మా మంచి తెలుగు సోదరులు , శేఖర్ గారూ ! అత్త గారయ్యాక కుడా అనిపించు కోక పొతే ప్చ్ ! లాభం లేదు . శతాబ్దాలుగా నిలచి పొయిన పేరు కదా మరి !

    రిప్లయితొలగించండి
  21. శ్రీ సరస్వత్యై నమః:

    మరి కొందరు మిత్రుల పూరణలు:
    అందరికీ అభినందనలు.
    శ్రీ మిస్సన్న: వనవాసమునకు పాండవులు పోవునపుడు కుంతికి కృష్ణుడు ఇచ్చిన భరోసాను వ్రాసేరు. ప్రశస్తముగా నున్నది.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి: క్రమాలంకారములో సాధించేరు. చాల బాగున్నది.

    డా. కమనీయం: ఇంటింటి రామాయణమని తేల్చేసారు. ఉత్తమముగా నున్నది.

    రిప్లయితొలగించండి
  22. మామసంపదలవిమాయమైపోయినన్
    యత్త మామ లెవరు?చెత్తనుచును
    తల్లిగారి కలిమి తనదంచు గర్వించు
    కోడలున్నచోటువీడునత్త!

    రిప్లయితొలగించండి