11, సెప్టెంబర్ 2012, మంగళవారం

పద్య రచన - 109

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. ఓ గ్రహము లార మా పై
    నాగ్రహమును జూపకుండ నయముగ భువిలో
    అగ్రపు భాగము లందగ
    మీ గ్రహ గతులను నడుపుడు మీకివె జోతల్.

    రిప్లయితొలగించండి
  2. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
    లోగడ శ్రీ రేలంగివారిపై మీరు వ్రాసిన పద్యములో 3వ పాదములో ర ల లకు ప్రాసను సమర్ధించుచూ చెప్పిన విశ్లేషణను చూచేను. మీ ఆనందమునకు నేను అడ్డు రాలేను. మీరు ఆలాగుననే ప్రాసలు వేయండి. ఏదో ఒక పుస్తకమును ప్రామాణము అని చూపించుచూ అందులో దొరలిన పొరపాటులనే నేను అనుసరించుతాను అంటే ఇంక ఎవరూ ఏమియును చేయలేము. ఇంతకీ పురాతన గ్రంథాలలో ఎన్నో పాఠాంతరములు ఉంటాయి. "సరళమ్ముగ నారికేళ సలిలము భంగిన్" అనే పాఠాంతరమును చూపగలను. అందుచేత మీరు అన్ని లక్షణములను చక్కగా పాటించుతారో లేదో అనేది మీ విచక్షణకే వదలివేయాలి కదా! స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. గ్రహములకు వందనమ్ములు
    గ్రహపతికిదె విన్నపమ్ము కవితల బ్లాగున్
    రహిమెయి నిత్యోత్సవముగ
    మహాదరణ నలరజేయుమా కృప మెరయన్

    రిప్లయితొలగించండి

  4. గ్రహముల సంఖ్యను దెలుపుడు
    గ్రహములు మఱి తొమ్మి దండ్రు గ్రహ శాస్త్రజ్ఞు ల్
    గ్రహముల కధిపతి యె వ ర న
    గ్రహములకే రాజు సూర్య గ్రహమని దెలియున్ .

    రిప్లయితొలగించండి
  5. శ్రీ నేమని గురువర్యులకు నమస్సులు. ప్రాసగురించి మీరు నన్ను తప్పుగా అర్థము చేసుకున్నారు. నేను భాషాపండితుడఁగాను.పద్యము వ్రాయటము ప్రాణప్రదంగ పెట్టుకొన్నాను.వ్రాసిన పద్యానికి గురువర్యులైన మీరిరువురి విశ్లేషణ నా పద్య రచనకు శక్తినిచ్చే టానిక్కు లాంటిది.ఈ బ్లాగులో జరిగే చర్చ ప్రాధమిక దశలో నున్న నాలాంటి వారికి బహుళ ప్రయోజనకరము. నా పరిశీలనలో చిక్కిన అంశాన్ని తమరికి విన్నవించుకున్నానుః.తప్పయితే ఈ విధంగ తప్పని చెప్పండి.అనుసరిస్తాను. 'మీ ఆనందమునకు అడ్డురాను, మీయిష్టము ప్రకారము వ్రాసుకోమనడం' బాధ కలిగించింది. నాకు మీలాంటి వారు బాగుందంటే ఆనందముకాని, నాయిష్టప్రకారము వ్రాసుకుంటే రాదు. తమరి వాత్సల్యాన్ని మార్గనిర్దేశత్వాన్ని ప్రార్థించే శిష్యునిగా ప్రేమను చూపించండి.ఆ ప్రాసను నా విన్నపము మేరకు తమరే సుచనగా సవరించ ప్రార్థన.

    ఈనాటి పద్యరచన:
    ఆ గ్రహరాశులు దీర్చునే
    భూగ్రహ వాసుల భయమ్ము పూజించగనే?
    నిగ్రహము జూపి సాటి జ
    నాగ్రహముఁ సహింప శాంత మందఱి కబ్బున్!

    రిప్లయితొలగించండి
  6. శ్రీ సహదేవుడు గారికి శుభాశీస్సులు.
    మీ మనస్సునకు నొప్పి కలిగినందులకు చింతించు చున్నాను. నేను చాలా చాదస్తముగా వ్యవహరిస్తాను అని అందరకి తెలుసును. అందరినీ దోషములు లేకుండా చూచుకోమని చెప్పుచునే యుంటాను. వెసులుబాటులు కొన్ని కొన్ని అక్కడక్కడ మన పూర్వ శాస్త్రకారులు కల్పించేరు. కాని స్వఛ్ఛమైన ప్రమాణాలతోనే పద్య రచన హాయిగా నడచుచుండును. మనకు ప్రామాణికమైన రచనలు కవిత్రయమువారివి, శ్రీనాథుడు, అల్లసాని పెద్దన గారివే ఎక్కువగా పరిగణిస్తారు. వానిలోని ప్రయోగములనే మనము అనుసరించాలి. మిగతా కవుల రచనలు అంత ప్రమాణములు కావు. పరిభాష కొంచెము కొంచెము మెరుగుపడుతూ ఉంటే పద్యరచన దాని అంతట అదే మెరుగు పడుతుంది. మీరు చక్కగా కృషి చేస్తున్నారు. రాను రాను మీ రచన కూడా వృద్ధిలోకి వస్తుంది అని మా ఆకాంక్ష - ఆశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శ్రీ అందవోలు విద్యాసాగర్ గారూ!
    నిన్నటి లక్ష్యముపై మీరు వ్రాసిన పద్యమును చూచేను. చాలా సంతోషము. అభినందనలు. అవనిజధవా! అని సంబోధిస్తూనే నీవెరవు అని అడుగుచున్నారేమిటి? మీ పద్యము ప్రశంసనీయముగానే యున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారి పద్యములు....

    (1)
    కం.
    భాముఁడు, సోముఁడు, భౌముఁడు,
    సోమజుఁడుం, దేవ గురుఁడు, శుక్రుఁడు, శనియున్,
    సోమ గ్రాహియుఁ, గేతువు
    గాములు తొమ్మిది; జనులకు గరిమను జూపున్!

    (ఇదే మఱొక కంద మందున)

    కం.
    రవి, రాట్, కుజ, బుధ, గురు, కవి,
    రవిజ, తమ, శ్శిఖి నవ ఖ చరమ్ములు నెపుడున్
    భువి చుట్టుఁ దిరుగు చున్, మఱి,
    భువి జనులను బాధ పఱుపఁ బొదలింపఁ గనున్!

    రిప్లయితొలగించండి
  9. గ్రహ నక్షత్రమ్ముల పతి
    యహముల నొనరించు భువికి నాదిత్యుండై
    యిహపర సౌఖ్యము లిచ్చుచు
    నహరహమును కొల్చు వారి కారోగ్య మిడున్.

    రిప్లయితొలగించండి
  10. ఆగ్రహము వలదు మీకని
    యే గ్రహమును కొలిచి నంత యోగ్యత మారున్ ?
    భూ గ్రహమా వాస్తు దెలిపి
    మా గ్రహ స్థితిని మార్చి మమ్ము గావుము తల్లీ !

    రిప్లయితొలగించండి
  11. ఈనాడు పద్య రచన కార్యక్రమములో మిత్రులెందరో ఉత్సాహముతో పాల్గొనిరి. వారి పూరణలు చక్కగా అలరించుచున్నవి. అందరికీ పేరు పేరునా శుభాభినందనలు.
    1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
    2. శ్రీ సుబ్బా రవు గారికి
    3. శ్రీ సహదేవుడు గారికి
    4. శ్రీ మధుసూదన్ గారికి
    5. శ్రీ మిస్సన్న గారికి
    6. శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారికి
    అందరికీ శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి