మిత్రులారా! శ్రీ సరస్వత్యై నమః: అందరికీ అభినందనలు. నిన్నటి పద్యరచన శీర్షికలో చివరగ వచ్చిన పద్యములను తిలకించుదాము: 1. శ్రీ సహదేవుడు గారు మండే సూర్యునితో కందపద్యమును మొదలు పెట్టేరు. అన్వయము సులభగ్రాహ్యముగా లేదు. 2. డా. కమనీయము గారి చంపకమాల మనోహరముగా నున్నది. స్వస్తి.
అయ్యా శ్రీ సుబ్బారావు గారూ! శుభాశీస్సులు. మీ పద్యమును చూచేను. కొన్ని సవరణలు చెయ్యాలి. 1. వీణాధరుడు అనాలి - వీణధరుడు అనరాదు. 2. వేలుపు దొర అంటే ఇంద్రుడు. నారదుడు కాడు. స్వస్తి.
హరి నారాయణ భవ్య తత్త్వ విభవం బశ్రాంతమున్ మంజు వాక్
రిప్లయితొలగించండిసరణిన్ గీర్తన జేయుచున్ జగములన్ సౌభాగ్యముల్ నింపు శ్రీ
కరు డోహో కలహాశనుండు దయతో కన్విందు గావించు నీ
తరుణంబయ్యె శుభప్రదం బతనికిన్ దండంబు లత్యాదృతిన్
నిరతనితాంత తత్వరసనిశ్చలుడై భువనత్రయంబునన్
రిప్లయితొలగించండిదిరుగుచు భక్తిమార్గముపదేశముజేయుచు ధన్యజీవుడై
హరిపదవర్ణనంబులనహర్నిశలున్ వినిపించునట్టి సు
స్వరనిధి,వేల్పుతాపసికి వైణికమౌనికి నేను మ్రొక్కెదన్.
శ్రీ సంపత్కుమార శాస్త్రి గారి పద్యము మంచి ధారాశుద్ధితో, భావ గర్భితముగా సాగినది. అభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండి"నారాయణ నారాయణ"
రిప్లయితొలగించండినారాయణుడే నిలిచెను నారదు మదిలో.
"సారము గ్రహియించితివో
నారద!మంత్రమ్మిదం"చు నమ్మితివయ్యా!
వనిత కడుపులో పెరిగెడు
రిప్లయితొలగించండిచినవానికి జ్ఞానబోధ చేసిన మౌనీ,
దనుజునిసంహారమునన్
ఘనమగు భాగము వహించి కరుణించితివే.
లక్ష్మీ దేవి గారు నారదుని 2 కందములలో బాగుగనే ప్రశంసించిరి. కందముల కందములను గూర్ఛే ప్రయత్నము చేసేరు. చాలా బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమిత్రులారా!
రిప్లయితొలగించండిశ్రీ సరస్వత్యై నమః:
అందరికీ అభినందనలు.
నిన్నటి పద్యరచన శీర్షికలో చివరగ వచ్చిన పద్యములను తిలకించుదాము:
1. శ్రీ సహదేవుడు గారు మండే సూర్యునితో కందపద్యమును మొదలు పెట్టేరు. అన్వయము సులభగ్రాహ్యముగా లేదు.
2. డా. కమనీయము గారి చంపకమాల మనోహరముగా నున్నది.
స్వస్తి.
రిప్లయితొలగించండికలహ భోజ నుండు కామి తార్ద దుడును
వీ ణ ధరుడు మఱియు వేలుపు దొర
నార సింహ జపము నా రా యణం చును
సకల భువన ములకు సంచ రించు .
అయ్యా శ్రీ సుబ్బారావు గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మీ పద్యమును చూచేను. కొన్ని సవరణలు చెయ్యాలి.
1. వీణాధరుడు అనాలి - వీణధరుడు అనరాదు.
2. వేలుపు దొర అంటే ఇంద్రుడు. నారదుడు కాడు.
స్వస్తి.
రిప్లయితొలగించండికలహ భోజ నుండు కామి తార్ద దుడును
వైణి కాగ్ర జుండు ,వటుడు ,మౌని
నార సింహ జపము నా రా యణం చును
సకల భువన ములను సంచ రించు .
హరినామము నహరహ మును
రిప్లయితొలగించండిస్మరి యిం చుచు దిరుగు నీవు చంద్ర ద్యుతివౌ !
పరి పూర్ణ మైన భక్తికి
సరి తూగరు వేదవిదులు సర్వ జ్జ్ఞుడవౌ !
గుండు మధుసూదన్ గారి పద్యములు....
రిప్లయితొలగించండికం.
నారాయణ నామామృత
పారాయణ సక్త చిత్త! భక్త శ్రేష్ఠా!
దూరస్థిత భవబంధా!
నారద! సంగీత లోల! నాభిజ తనయా!
తే.గీ.
భక్తి రస సుధాస్వాద! సస్వర సుగాత్ర!
పరమ భాగవత శ్రేష్ఠ! సుర మునీంద్ర!
లోక కళ్యాణ కామి! త్రిలోక గామి!
కలహ భోజన! నా నమస్కారము లివె!
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా!
ఈనాటి పద్య రచన -- నారద మహర్షి
చాల కొంచెమే పద్యములు వచ్చినవి. అన్నీ బాగుగ నున్నవి. అందరికి అభినందనలు.
శ్రీ సుబ్బా రావు : భావము పద్యము బాగున్నవి.
శ్రీమతి రాజేశ్వరి: భక్తి భావములో నారదునితో ఎవరూ సరితూగలేరని వక్కాణించేరు. నిజమే. మంచి పద్యము - ప్రశస్తముగా నున్నది.
శ్రీ గుండు మధుసూదన్: 2 చక్కని పద్యములు - మంచి శైలి - భావ గర్భితముగ నున్నవి.
స్వస్తి.
శ్రీ నేమాని గురువర్యులకు ప్రణామములు.
రిప్లయితొలగించండిమీ ప్రశంసనందుకొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యోస్మి.
కలహము భోజనంబనుచు కద్దు జనంబులు పల్కుచుంట నా
రిప్లయితొలగించండికలహము వెన్క లోకహిత కారణ మున్న దటంచు నేరరే
నలువురు నమ్మితిన్ మదిని నల్వకు తండ్రిని వాక్కు కర్మలన్
పలికెద వాని నామమును ప్రార్థన చేయుచు లోక శాంతికై.
శ్రీ పండితుల వారికి నమస్కృతులు , ధన్యోస్మి
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిస్వార్థమునకు గాదాతని చర్యలెన్న
లోక కళ్యాణమునకునై ప్రాకటముగ
బాటుపడుచుండు దేవర్షి ;పరమ భాగ
వతుడు ,కలహభోజనుడని వాదు కలిగె .
అతడే నారద నామధేయుడగు బ్రహ్మానంద సంభావ్య సం
తత నారాయణ నామ సంస్మరణ తాత్పర్యమ్మునన్ లీనుడౌ
వ్రతనిష్ఠా పరుడైన బ్రహ్మసుతు డాత్మజ్ఞానిసంబోధిత
శ్రుత గోవింద మహత్త్వ గానమున సుశ్లోకుండయెన్ సిద్ధుడై .
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమరి కొన్ని రచనలు:
పంపిన కవి మిత్రులందరికీ అభినందనలు.
శ్రీ మిస్సన్న: కలహ భోజనము లోకహితకారణమని - నారదుడు లోకశాంతి గోరువాడని చక్కని వృత్తములో సెలవిచ్చేరు. ప్రశస్తముగా నున్నది.
డా. కమనీయం: 2 మంచి పద్యములలో అలరించేరు. దేవర్షిని లోక కళ్యాణమునకు పాటుఫడు సిద్ధుడని అభివర్ణించేరు. అద్భుతముగా నున్నవి పద్యములు.
నేమాని పండితార్యా ధన్యవాదములు.
రిప్లయితొలగించండినారాయణ! నారాయణ!
రిప్లయితొలగించండినారద ముని వచ్చెసర్వ నాశన మనుచున్
పేరును బెట్టకు నిజమిది
తీరుగ కళ్యాణ మగును తిన్నగ గనినన్.
రిప్లయితొలగించండిఎందుకో నారదమహర్షి గురించి మరికొంత వ్రాయాలనిపించి వ్రాస్తున్నాను.మన్నించాలి.
భరత జనుల కాదర్శమై వరలునట్లు,
దనర వాల్మీకి రామగాథను రచింప ,
వ్యాసుని మనశ్శాంతికై వాసుదేవు
దివ్యలీలల వర్ణించు భవ్యగాథ
భాగవతపురాణమ్మును వ్రాయునట్లు
స్ఫూర్తి కలిగించె ; శాశ్వత కీర్తిగాంచ
త్యాగరాజునకు బ్రసన్న దర్శనమున
పూని సంగీతనిధి యగు పుస్తకమ్ము
నిచ్చె సంగీతసామ్రాజ్య మేలునట్లు
జనని గర్భాన నున్నట్టి కనకకశిపు
తనయుడైన ప్రహ్లాదుని ,తత్త్వబోధ
విష్ణుభక్తుడై ,తరియింప వెలయజేసె
నెన్నియో నారదుని చర్య లెన్నదరమె !
త్యాగరాజుకు నారదుడు ఇచ్చిన పుస్తకం పేరు '' సంగీతార్ణవం '' అని జ్ఞాపకం.
శ్రీనేమని గురువర్యులకు నమస్సులు.
రిప్లయితొలగించండిఆర్యా!
పెళ్ళికాని కుంతి కని బయపడి ఎండకు(తండ్రైన సూర్యునికి)వదిలిపెడితే,నేటికుంతీ, కుమారులను కుండీలలో చెత్తగా పారవేస్తుందన్న సామాజిక స్పృహతో రాశి మీ మెప్పు పొంద నందులకు చింతిస్తూ
నిన్నటి పద్యరచన తమ పరిశీలనకై:
లోకార్తిఁదీర్చమునివై
శ్రీకర నామము జపింప శ్రీకర మవ్వన్!
ఈ కలి నారదు మన్యుల్
యాకలి దీరకనె దోచి రన్యాయముగన్!