23, సెప్టెంబర్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 830 (దయ్యమ్మును గనిన హనుమ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్.
ఈ సమస్యను పంపిన
కామరాజు శ్రీనివాస రావు గారికి
ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

 1. దయ్యమ్మొక్కటి రా! మా
  భయ్యా నిన్ జంపు ననుచు పలుకగ నాహా!
  దయ్యం 'రామా' యనెనని
  దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్.

  రిప్లయితొలగించండి
 2. మిత్రులారా! శుభాశీస్సులు.
  దైవము (ప్రకృతి) : దయ్యము (వికృతి)
  శబ్ద రత్నాకరములో దయ్యము అను పదమునకు ఈ క్రింది అర్థములను ఇచ్చిరి:
  (1) దేవుడు; (2) వేలుపు; (3) విధి; (4) పిశాచము

  అయ్యా! కోరుదు నే రా
  మయ్య విభుని దర్శనమ్ము నటుల దరింతున్
  నెయ్యమున విడువుమా యను
  దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్

  రిప్లయితొలగించండి
 3. రయ్యిన రా భీతిల లే
  దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్
  చయ్యన బంధింపగ నది
  యొయ్యన తల వంచె నసురు లుద్ధతి మీరన్.

  రిప్లయితొలగించండి


 4. అయ్యా ! రాముని భటు డా !

  కయ్యము మఱి సేయ కిపుడు కపివర ! హనుమా !

  నెయ్యము సేతును ననునా

  దయ్యమ్ము ను గనిన హనుమ దారిని విడి చెన్ .


  రిప్లయితొలగించండి
 5. దయ్యమ్మును బట్టగలుగు
  నయ్యమితబలయు తుడప్డు హాహాయనుచున్
  చయ్యన శరణము వేడిన
  దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్.

  రిప్లయితొలగించండి
 6. శ్రీ గురువులకు, పెద్దలకు
  ప్రణామములు!

  లంకలో హనుమంతునిపై మేఘనాదుఁడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన సన్నివేశము:

  కయ్యమ్మున నింద్రజి దా
  నొయ్యన బ్రహ్మాస్త్ర మనుప; నోటాఱక పెం
  దియ్యమునను గెలువపుఁ బా
  ద య్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి

 7. యుద్ధమునందున రాముని బాణపరంపరకు భీతిల్లి శరణు వేడిన దయ్యముననకు దారిచ్చినాడనే అర్థములో........

  కయ్యమునందున తాన
  క్షయ్యముగా వేయు బాణ కారణమున రా
  మయ్యా శరణని వేడిన
  దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్.

  రిప్లయితొలగించండి
 8. అయ్యాంజనేయు బంధితుఁ
  జెయ్యఁగ నా యింద్రజిత్తు చివ్వన యపుడున్
  వెయ్యఁగ బ్రహ్మాస్త్రముఁ; బె
  ద్దయ్య మ్మునుఁ గనిన హనుమ, దారిని విడిచెన్!

  (పెద్దయ్యన్=బ్రహ్మను; మునున్=ముందఱ)

  రిప్లయితొలగించండి
 9. నెయ్యము సుగ్రీవునితో
  కయ్యమ్మొన గూడె వాలి కాముకుతో రా
  మయ్యకు, డీకొన బోవా
  దయ్యమ్మును గనిన హనుమ దారిని వీడెన్.

  గండూరి లక్ష్మీనారాయణ.

  రిప్లయితొలగించండి
 10. అయ్యలు దోచెడు రాజ్యం
  బయ్యెగ భారతమని మనమందున గల రా
  మయ్యను దోచెదరని యా
  దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్!

  రిప్లయితొలగించండి
 11. డయ్యక మోదెను హరియా
  దయ్యమ్మును గనిన హనుమ, దారిని విడిచెన్
  తొయ్యలి లంకయు నాతడ
  జయ్యుడ నితెలిసి జయోస్తు జయశీలయనెన్!

  రిప్లయితొలగించండి
 12. కయ్యమ్ములు మనకెందుకు
  నెయ్యముగా నుండ గోరి నెగడుల చెంతన్ !
  అయ్యో యిది లంక యనుచు
  దయ్య మ్మును గనిన హనుమ దారిని విడిచెన్ !

  రిప్లయితొలగించండి
 13. " అయ్యా ! హనుమయ్య వినుము !
  గయ్యాళగు నీదు భార్య గబగబ వచ్చెన్ !
  అయ్యో ! లగెత్తు మ"ని యన
  దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్ !

  రిప్లయితొలగించండి
 14. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  లంకా గర్వభంగం :

  01)
  _______________________________

  కయ్యమున నోడి పోయిన
  దయ్య మపుడు, నెయ్య మూని - దానవ నాశం
  బియ్యెడ తప్పదని యనిన
  దయ్యమ్మును గనిన హనుమ - దారిని విడిచెన్ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 15. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  నిన్న రోజంతా వివిధ కార్యక్రమాల్లో వ్యస్తుడనై మీ పూరణలను, పద్యాలను చూడలేకపోయాను. ఆలస్యానికి మన్నించండి.
  వైవిధ్యంగా పూరణలను పంపిన
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  మిస్సన్న గారికి,
  సుబ్బారావు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  ఏల్చూరి మురళీధర రావు గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  సహదేవుడు గారికి,
  చంద్రశేఖర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  నాగరాజు రవీందర్ గారికి,
  వసంత కిశోర్ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. కయ్యమునకు నెయ్యమునకు
  డయ్యక కుయ్యనక నెపుడు ఢంకా తోడన్
  సయ్యనుచు కడకు వియ్యపు
  దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్

  రిప్లయితొలగించండి
 17. తియ్యకు నా ప్రాణంబులు
  కయ్యము నే నోడితయ్య, కరుణన్ గనుమా
  అయ్యా! మీదే జయమను
  దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్

  రిప్లయితొలగించండి