2, సెప్టెంబర్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 810 (గఱిక పాటి సేయఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
గఱిక పాటి సేయఁడు గదా గరికిపాటి.

27 కామెంట్‌లు:

 1. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈ రోజు శ్రీ గరికిపాటి వారి అష్టావధానానికి పృచ్ఛకుడిగా వెళ్తున్నాను. ఈనాటి సమస్యపై సాయంత్రం వరకు వచ్చిన పూరణలను అవకాశం కల్పించుకొని వారికి వినిపిస్తాను.

  రిప్లయితొలగించండి
 2. మాస్టారూ, ఆనందించండీ, ఆస్వాదించండి. అలాగే మొత్తం అవధానం మీద ఒక నోట్స్ తరువాత ఇద్దురుగానీ.

  రిప్లయితొలగించండి
 3. గరికపాటి వారి యవధాన గతి వేరు
  అట పురాణ పఠనము నందవధరించె
  “రాముని పరాక్రమముముందు రావణుండు
  గఱిక పాటి సేయఁడు గదా!” గరికిపాటి
  వారి సొమ్మా చమత్కార వాక్పటిమలు

  రిప్లయితొలగించండి

 4. శిష్ట జనముల దూష ణ సేయు వాడు
  గరిక పాటి సేయడు గదా, గరిక పాటి
  వారి యవదాన సరళిని వర్ణ నీ య
  దరమె ? నతు లొ న గూ ర్చుట దప్ప మనకు .

  రిప్లయితొలగించండి
 5. అది గణేశ చతుర్థి దూర్వార్చనమ్ము
  సేయుచు సమాదరమున నృసింహుడనెను
  దేవ! కృప జూపుచున్ నీవు బ్రోవవేని
  గరికపాటి సేయడు గదా గరికిపాటి

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  గరికిపాటి :

  01)
  _______________________________

  ఘటికు డాతడు పద్యాల - గాన మందు !
  గణ్యు డాతడె, యవధాన - కరణ మందు !
  గమథు డాతడు సత్కావ్య - కల్పనమున
  కమను డాతడు సత్కీర్తి - గాంచు టందు !

  ప్రథితు డాతడు సన్మార్గ - వర్తనమున
  పథికు డాతడు సత్కావ్య - పఠన మందు
  ప్రథము డాతడు భారత - ప్రవచనమున !
  ప్రముఖు డాతడు ! ధారణా - బ్రహ్మ యతడు !
  (కాని)
  గగన చారణ సేయగా - గాలిలోన
  గఱిక పాటి సేయడు గద - గరికిపాటి !
  _______________________________
  ఘటికుడు = దిట్ట
  గణ్యుడు = ఎన్నదగినవాడు
  గమథుడు = యాత్రికుడు
  కమనుడు = కాముకుడు
  ప్రథితుడు = కీర్తిశాలి
  పథికుడు = యాత్రికుడు
  ప్రథముడు = మొదటివాడు
  ప్రముఖుడు = గొప్పవాడు
  గగన చారణ = ఆకాశ విన్యాసము(sky diving)
  మనవి : ఆయనకు skydiving తెలిసుండదని నా యూహ !

  రిప్లయితొలగించండి
 7. శ్రీ వసంత కిశోర్ గారూ,

  మీ చమత్కారము అత్యద్భుతం.

  రిప్లయితొలగించండి
 8. అనుభవజ్ఞుడు కానిచో నట్టిచోట
  నడుగు పృచ్ఛకుడవధాన మందు చిన్న
  గఱిక పాటి సేయఁడు గదా; గరికిపాటి
  వారి కవనశక్తి సమర్థపరిణతి గన.

  రిప్లయితొలగించండి
 9. ధారణము నందు పద్యాల ధార జేసి
  సాగరపు గుండె ఘోషను చాటుటందు
  గఱిక పాటి సేయఁడు గదా గరికిపాటి
  ముందు వేరొక కవియన్న పొల్లు కాదు.

  రిప్లయితొలగించండి


 10. ప్రాస కొఱ కగచాట్లను పడుటలోను
  యతుల గిట్టింప పొందెడు వెతలలోను
  నాకు సాటి నేనే యౌదు నాకు ముందు
  గఱిక పాటి సేయఁడు గదా గరికిపాటి

  రిప్లయితొలగించండి
 11. నేమాని పండితుల నేర్పు అనుపమానం.
  వసంత మహోదయుల చమత్కారం చిలిపి.

  రిప్లయితొలగించండి
 12. అయ్యా!
  శ్రీ సంపత్కుమర శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యములో "విదుషీమణి" అని వాడేరు. ఆ పదము స్త్రీలింగము అని మీకు తెలుసునా? పొరబడినారా? స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. ఈ రోజు గరికపాటి వారి అష్టావధానం. దూరంగా ఉండటం వల్ల చూసే,వినే అవకాశం లేదు. ఎవరన్నా వారి కార్యక్రమాన్ని అంతకు ముందు Texas లో కార్యక్రమం లాగా, వీడియో తీసి you tube లో పెడితే, చూసి సంతోషించటానికి అవకాశం ఉన్నది. అలాగే ఏదన్నా TV ఛానల్ వారు దీన్ని ప్రసారం చేస్తున్నారా తెలియ జేయవలసిందిగా ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 14. ధారణా బ్రహ్మరాక్షసులకు, అవధాననర సింహునకు నమస్కారములతో....

  వాణి మనసున నిల్పిన బలము చేత
  పరుల కందని ధారణా పటిమ చేత
  చిక్కు లెన్నేని సేయడు లెక్క, వాటి
  గఱిక పాటి సేయఁడు గదా, గరికిపాటి

  రిప్లయితొలగించండి
 15. శ్రీ గురుభ్యోనమ:

  గురువుగారికి నమస్సులు. మహా సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావుగారికి నమస్సులు తెలియజేయప్రార్థన.

  ప్రేక్షకావళి సహనము విసుగునట్లు
  గరికపాటి చేయడు కదా, గరికపాటి
  యైన ఘనసాలమైనను హ్లాదమొసగు
  కవనరంగాన యవధాన కర్షకునకు.

  రిప్లయితొలగించండి
 16. తే.గీ.(సప్తపది)
  వరద వృక్షాల పెకిలించి బురద జేయు
  గఱిక తెలివిగ తలవంచి తిరిగి నిల్చు!
  గరిక పాటివారెంతయో మెఱికె గనుక
  పదము నిలుపక పద్యమ్ము పలుక నేర్చి
  యెన్నియోయవధానాల వన్నె గూర్చ
  గఱికపాటిసేయడుగదా గరిక పాటి!
  యనుటయేపాటి నిజమగు నయ్య లార?

  రిప్లయితొలగించండి
 17. ప్రొద్దుటూరు నందు ఈ సంవత్సరము మే నెలలో, శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారి శాలలో, మహాసహస్రావధాని డా॥ గరికపెటి వారి శ్రీదక్షణామూర్తి ప్రవచనములను వినే మహద్భాగ్యము నాకు లభించి
  ధారాపాతంగ సాగే వాక్ప్రవాహములో మునిగి తేలి ధన్యుడ నయ్యాను.వారికి నా అభినందనలు. మరియు ఈనాటి అవధాన సంధర్భంగా శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 18. త్రాగి తూలెడి వానికి, తారతమ్య
  భేదములు లేని వానికి, వెకిలి తనమె
  ప్రాణమును జీవనంబగు వానికి మరి
  గఱిక పాటి సేయఁడు గదా గరికిపాటి!!

  రిప్లయితొలగించండి
 19. నాగ ఫణిశర్మ యవదాన నారి కడము
  మెడ సాని వారలు మేలు మేలు గాదె !
  యెవరి ఘనతను నెంచగ నెవరి తరము
  గఱిక పాటి సేయడు గదా గరికి పాటి
  తనదు చాతుర్య మునయందు తనకు తాను !

  రిప్లయితొలగించండి
 20. సంపత్ కుమార్ శాస్త్రి గారూ ! ధన్యవాదములు !
  మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 21. గరికిపాటి వారి అవధానం ఆద్యంతం మనోరంజకంగా కొనసాగింది.
  ముందు నా పేరు సమస్యాపూరణలో ఉందన్నారు. అందుకు సిద్ధపడి రెండు సమస్యలు సిద్ధం చేసికొని వెళ్ళాను. తీరా అవధానం ప్రారంభమయ్యే సమయంలో నిర్వాహకులు వచ్చి మరో పృచ్ఛకుడు తనకు సమస్యాపూరణమే కావాలని పట్టుబడుతున్నాడని, నన్ను దత్తపది తీసుకొమ్మని కోరారు. అప్పటికప్పుడు కొత్త దత్తపదిని సిద్ధం చేయలేక గతంలో ‘శంకరాభరణం’లో ఇచ్చిన దత్తపది... ‘అక్క, అన్న, మామ, వదిన’ పదాలను ఉపయోగించి రావణునకు మండోదరి చేసిన ఉపదేశాన్ని ఉత్పలమాలలో చెప్పమన్నాను. దానికి అవధాని శ్రీ గరికిపాటి నరసింహ రావు గారి పూరణ ఇది..

  ‘అక్క’ట భార్య లిందరు మహాసుగుణాఢ్యలు సుందరీమణుల్
  జక్కఁగ నిన్ను గొల్వఁగ విచారణ ‘మన్న’ది లేక జానకిన్
  గ్రక్కున దెచ్చి కొంపలను గాలిచి ‘మామ’క బోధ నెట్లు నే
  దిక్కునఁ ద్రోసినా ‘వది న’దిన్ జలధిన్ బడఁద్రోసినావొకో!

  రిప్లయితొలగించండి
 22. గుండు మధుసూదన్ గారి పూరణ....

  అజ్ఞుఁ డయ్యును సోమరియైనవాఁడు
  గఱిక పాటి సేయఁడు! గరికిపాటి
  వారలు సుమేరు నగ ధీరు లౌట నిజము!
  వారి యవధాన వైచిత్రి వరయుతమ్ము!!

  రిప్లయితొలగించండి
 23. కవిమిత్రుల పూరణలను గరికిపాటి వారి సమక్షమంలో వేదికపై చదవాలనుకున్నాను. మధ్యాహ్నం వరకు వచ్చిన దంద్రశేఖర్, సుబ్బారావు, పండిత నేమాని, వసంత కిశోర్, లక్ష్మీదేవి, మిస్సన్న, గోలి హనుమచ్ఛాస్త్రి గారల పూరణలను అవసరమైన సవరణలు చేసికొని ఒక కాగితంపై వ్రాసి దగ్గర పెట్టుకున్నాను. అవధానం జరుగుతుండగా కరెంటు వల్ల కొంత అటకం, వ్యవధానం చిక్కగా గరికిపాటి వారికి శంకరాభరణం బ్లాగును గురించి చెప్పి, నిన్న ఇచ్చిన సమస్యను తెలిపి, అప్పటికి ఎనిమిది పూరణలు వచ్చాయని తెలియచేసాను. వారు సంతోషించి, అవధానం మధ్యలో అవకాశాన్ని కల్పించుకొని ఆ పద్యాలను వేదికపై చదివి వినిపించమన్నారు. కాని నిర్వాహకులు నాకు అవకాశం ఇవ్వలేదు. దానితో అవధానం అయిపోయిన తరువాత పూరణల కాగితాన్ని గరికిపాటివారి చేతికిచ్చాను. వారు తలపంకిస్తూ దానిని మడిచి జేబులో పెట్టుకున్నారు. ఇదీ జరిగింది.
  *
  చంద్రశేఖర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘గరికపాటి వారి యవధాన రహి మించ/నట...’ అని నా సవరణ.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘సరళిని వర్ణనీయ దరమె’ అనకుండా ‘సరళిని కోరి పొగడ/ దరమె..’ అనండి.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  రెండు పాదాల మొదటి పదాలను అటూ ఇటూ మార్చాను.
  పథికు డాతడు సన్మార్గ - వర్తనమున
  ప్రథితు డాతడు సత్కావ్య - పఠన మందు....
  అలాగే
  ప్రముఖు డాతడు ! ధారణా - బ్రహ్మ యతడు !
  (కాని).... అన్నదానిని
  ప్రముఖు డాతడు ! ధారణా - బ్రహ్మ కాని.... అని మార్చాను.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. ముఖ్యంగా రెండవ పూరణలోని చమత్కారం అదిరింది. అభినందనలు.
  *
  వామన కుమార్ గారూ,
  ధన్యవాదాలు. ఈసారి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆడియో దొరికితే నా బ్లాగులో, వీడియో దొరికితే యూట్యూబ్‌లో పెట్టే ప్రయత్నం చేస్తాను.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  కాని సమస్య ప్రారంభంలో ఉన్నది ‘గఱికపాటి’... గరికిపాటి కాదు!
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  నిజమే.. అలాంటివారు గరికిపాటి వారిని లెక్కచేయరు కదా! చాలా బాగుంది పూరణ... అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. శంకరార్యా ! ధన్యవాదములు ! ఇది చూడండి

  మండోదరి రావణునితో :

  01)
  _________________________________________

  చుక్కల వంటి భార్యలదె - స్రుక్కగ , యక్క నదేల దెస్తివో ?
  చిక్కులు మిక్కిలౌను గద ! - సీతను రామున కప్పగించి , మా
  మక్కు వ దీర్చు మన్న, సతి - మాటల నించుక గౌరవించినన్
  దక్కును మానమున్ మరియు - తప్పును చావది నన్ను నమ్ముమా !
  _________________________________________
  అక్క = స్త్రీ(సీత)

  రిప్లయితొలగించండి