27, డిసెంబర్ 2015, ఆదివారం

పద్యరచన - 1130

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

33 కామెంట్‌లు:

  1. ఆంజనేయ శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘నిర్వహించు నుద్యోగి’ అనడం సాధువు. అక్కడ ‘నిర్వహించు భటుని...’ అనండి.

    రిప్లయితొలగించండి
  2. రక్ష కభటుని వోలెను రమ్యముగను
    నాల్గు మార్గాల మధ్యన గల్గునట్టి
    యున్నతంబగు గద్దెపై యూరుసింహ
    మద్భుతంబుగ గూర్చుండె నార్య! కంటె?

    రిప్లయితొలగించండి
  3. నగరపు నలుదారుల కూడలి గని గ్రామ
    సింహమొకటి రాజసమున చేరె నదియు
    విధిని నిర్వహించు భటుని విధము గనగ
    లంచములనడగని జాగిలమ్ము మేలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      సవరించిన పూరణ నిచ్చినందుకు సంతోషం. దీనిని ప్రత్యేకంగా కాకుండా మీ మొదటి పద్యం క్రిందనే ఉన్న ‘ప్రత్యుత్తరం’ క్లిక్ చేసి అక్కడే ప్రకటించండి.

      తొలగించండి
  4. ధీరత్వంబున శునకము
    పౌరగమన నియమ సుపరిపాలన నియతిం
    గోరిన ప్రభుత్వ మిచ్చెనొ
    గౌరువ మొప్పగ గనుండు గ్రామహరీశున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగన్నది. అభినందనలు.
      ‘గౌరవ మొప్పంగ నుండు...’ అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “గౌరవ మొప్పగ ప్రభుత్వమిచ్చెనొ చూడుడు శునకమును ” అని నా భావము.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      అది ‘కనుండు’ అన్న విషయాన్ని గమనించకుండా వ్యాఖ్యానించాను. మన్నించండి. మీ పద్యం నిర్దోషం. ‘గౌరవ మొప్పగఁ గనుండు...’ అంటే సందేహానికి ఆస్కారం ఉండక పోయేదు.

      తొలగించండి
  5. నాల్గు రోడ్ల మధ్య నమ్మకమైనట్టి
    శునకరాజమిచట సూటిగాను
    జూచు చున్న దదిగొ జోరుగాఠీవిగా
    గ్రామసింహమిదియొ గనగ రండు.

    రిప్లయితొలగించండి
  6. మీదు రక్షణ భారము మాదెయనుచు
    బాధ్యతలు వీడె రహదారి భటుడెయంచు
    వ్యథను జెందెనేమొ, విధులు వ్యగ్రమైయ్యి
    నోయి డానొక కుక్క తా జేయ దలచె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీదు రక్షణ భారము మాదెయనుచు
      బాధ్యత మరిచె రహదారి భటుడెయంచు
      వ్యథను జెందెనేమొ, విధులు వ్యగ్రమైయ్యి
      నోయి డానొక కుక్క తా జేయ దలచె

      తొలగించండి
    2. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. కిక్కిరిసిన ట్రాఫిక్కున
    నెక్కడ ప్రాణంబుపోవునేమోయనుచున్
    చక్కగ పోలీస్ పోస్టున
    నెక్కిన యా కుక్కకెంత నిశ్చింతగదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. పోలీసౌ యజమానిని
    యాలియె రమ్మంచు పిలువ నంపగ కుక్క
    న్నూళేయుచు కూడలికడ
    జాలీగావిధులొనర్చి స్వామిని పంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘యజమానిని+ఆలియె=యజమాని నాలియె’ అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
      పోలీసౌ యజమాని
      న్నాలియె రమ్మంచు పిలువ నంపగ కుక్క
      న్నూళేయుచు కూడలికడ
      జాలీగావిధులొనర్చి స్వామిని పంపెన్

      తొలగించండి
  9. పద్య రచన
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఏయ్ ! నిలబడర. చూపి౦చుము లైసెన్సు ;
    . . . బ౦డి బాగున్నది , స్వ౦త మేగ. ?
    అయినచో తీయ వోయ్ ఆర్ . సి . పేపర్సు ? ఏ
    . . . మేమి ? నీ దగ్గర యేమి లేవ. ?
    నెత్తిపై హెల్మెటు నే పెట్ట లేదేల ?
    . . . ఫైను కట్టుము బ౦డి ప్రక్క నిలిపి "
    అని బెదిరి౦చి జేబును ల౦చమున ని౦పు --
    . . . చున్న ట్రా ఫి కు వాని కన్న గూడ

    నేను మేలని తెలుపుచు శ్వాన మొకటి
    రోడ్డు సె౦టరు లోన కూర్చొనియె నౌర. !
    రక్షకభటునివా లేక ల౦చము దిను
    భక్షకభటునివా యని ప్రశ్న వేసి ! ! !

    రిప్లయితొలగించండి
  10. దొంగనుపట్టబూనుటకు తొంగియు జేచెడికుక్కనక్క-ఈ
    రంగపు రక్షకుండిట విరామము నెంచగ నిల్చి యుండగా
    చెంగున దూకి పైకెగిరిచిక్కుల యందున నక్కిజేరగా?
    బంగము లంటుగా తలకు భారమె వేరొక రెంచుకార్యముల్.

    రిప్లయితొలగించండి
  11. వాహనదారు-దారుల వివాదము లేకను వెళ్లు నట్లుగా
    సాహస మైన రక్షణకు సాగెడి దుమ్మును నింపుకున్న?వ్యా
    మోహము మాని నమ్మకమె ముఖ్యమటన్నదికుక్కబుద్ది|సం
    దేహమువీడినుంచిరిట|దిక్కులు నాలుగు చూచు నట్లుగన్.

    రిప్లయితొలగించండి

  12. నిన్నటి పద్యరచన:

    ఇచటుండుచు నచటేడని
    వచియించెడు శంక దానవాధిప తగునే
    యెచటెచటఁ జూడఁ దలచిన
    నచటచటే శౌరి గలడు నంతట(టి) వాడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘ఇచట గల డచట లేడని...’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. ముందు అలాగే వ్రాసుకొని పోస్ట్ చేసేటప్పుడెందుకో అలా మార్చానండి. సవరించిన పూరణ:
      ఇచటఁ గలఁడచట లేడని
      వచియించెడు శంక దానవాధిప తగునే
      యెచటెచటఁ జూడఁ దలచిన
      నచటచటే శౌరి గలడు నంతట(టి) వాడై

      తొలగించండి
  13. రోడ్డుదెప్పరమందున ప్రొద్దుకొడుకు
    చేర యజమాని, కరమగు చింత యడర
    హంతకుని పట్టియివ్వగ నర్థి తోడ
    వేచి యుండెను కూడలిన్ వేపి కనుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి