ముదముగ తల్లిని మించిన యదనపు హృదయమును పంచి యాదర మొప్పన్ కదిలించు మదిని ప్రియమగు వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్
పదియేండ్ల బుడతడాతడు ముదముననొక లడ్డునిత్తు ముద్దిడ ననగా నొదుగుచు వాత్సల్యమ్మున వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.
కదలాడు బొమ్మలాగునపదిమాసము లైన లేని బాలుండొకడేఅదరక,బెదరకజేరియువదిననుముద్దాడె మరిది పదుగురు చూడన్2.అదిచిన్ని పెళ్లికూతురువదినను ముద్దాడె మరిది పదుగురు చూడన్బదులుగ తానొక టివ్వగ?మదిగల భావాల మమత మై మరిపించున్|
పదుగురి లో పలుచనగాసదమదమవజేసి సతియె సాధించుచుతాన్హృదయము లేదన. తనువినివదినను, ముద్దాడె మరిది పదుగురు జూడన్
చదువది యెంతయొ గల్గియువిధివశమున నుండియొక్క వింతౌవ్యాధిన్యెదురుగ నెవరని తెలియకవదినను ముద్దాడె మరిది పదుగురు జూడన్
A sexual maniac
ముదితకు చిన్నత్త కొడుకుపదునెనిమిది నెలల వాడు వనితకు చనువై వదనము పై నధరమతోవదినను ముద్దాడె మరది పదుగురు చూడన్ .
మదపిచ్చి ముదిరి తలచెనుయెదురుగ నెవరైన నేమి యీప్సితమొదవన్బెదరక వదురుచు నాతడువదిను ముద్దాడె మరిది పదుగురు జూడన్
వదిన తనదు మూడేండ్ల మరఁదిని నిడి నిజాంకమున కరం బనురక్తిన్ ముదమున ముద్దీయ మనగవదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.
ఆంజనేయ శర్మగారూ నమస్కారం.పదేళ్ళు మరీ ఎక్కువపదిమాసాలుకొంచెం తక్కువ అనిపించిందండీ.మీ పదునెనిమిది నెలలు చక్కగా సరిపోయిందండీ
సదనమున యాడు పాపడువదినను ముద్దాడె;మరది పదుగురు చూడన్పదిలముగా పాపనిన్ నింపొదవగ నెత్తుకొని తాను బుగ్గలు నిమిరెన్
* గు రు మూ ర్తి ఆ చా రి * ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఛ౦ ద ము = మ ధ్యా క్క ర వదిన మాతృస్వరూప యని ...... వచియి౦చెద. | రది యట్లు౦డ. :-- వదిన. విధవ యైన లేక ........ వ౦ధ్య యైనను " సి౦గ్ " కులమున వదినను మరది పె౦డ్లాడు , ........... పడయగ స౦తతిన్ | కా న వదినను ముద్దాడె మరది .......... పదుగురు మెచ్చ " రా౦ సి౦గు " { వ౦ద్య. = గొ డ్రా లు }
ధన్యవాదాలండీ Shashima గారూ....నమస్కారములు.
వదలక కంటికి రెప్పగముదముగ తనబిడ్డవోలె మురిపెము తోడన్పదియేళ్ళుగ బెంచెడి తనవదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్!!!
అదియే మిచిత్రమో యదివదినను ముద్దాడె మరది పదుగురు చూడన్నదియా , బాలున కప్పుడుపదిమాసములే గద మరి వయసున్జూడన్
* గు రు మూ ర్తి ఆ చా రి * ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,పది మ౦ ది కొడుకు లొకనికి |మొదటి తనయునికి వివాహము జరిగె, మరి యా సుదతికి ి చి న్నతడు మరది | వదినెను ముద్దాడె మరది పదుగరు మెచ్చన్ !
గదలను పట్టి సమరమునఁగదియ సజాతులు, రఘుపతి కాండము తో వేతుదముట్టించెన్ వాలినివదినను ముద్దాడె మరిది పదుగురు చూడన్
వదినయె ద్రౌపది. నకులునకిది చిత్ర వివాహమౌట యేవురు పతులై కుదురుగ భర్తయు నౌటను వదినను ముద్దాడె మరది పదుగురు చూడన
ముదమొందగ జేసెను తన వదినను, ముద్దాడె మరఁది పదుగురు చూడన్ఎదురుగ నిలచిన తన ప్రియ 'మదవతిని', గనినినవారి మతులున్ జెదరన్.
పదములు తడబడ వేయుచు ముదముగ పరుగెత్తు చిన్ని ముద్దుల మరిదిన్ వదిన పరుగులిడి బట్టగవదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.
ముదమున చినతమ్నుని తావదినై యనురాగ సుధలు పంచెనటంచున్నుదుటన మెప్పుగ నన్నయెవదినను ముద్దాడె, మరఁది పదుగురు చూడన్!
ముదిరన వయసున పెండిలికుదరగ, మంటపము చెంత కూర్చొని యుండన్వదలని తొలినెచ్చెలి, అరవది, నను ముద్దాడె, మరఁది, పదుగురు చూడన్ [ మరఁది,+పదుగురు చూడన్]
వదలక చంకననెత్తుక ముదముననొక లడ్డునిత్తు ముద్దిడుమనగా నొదుగుచు బోసిగ నవ్వుచు వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.
1.పదహారునెలల వయసునమదిదోచెడు సుందరుండు మరదే యైనన్ ముదితకు చనువై మెలగుచువదినను ముద్దాడె మరది పదుగురు చూడన్ .2.మృదువగు కరములు రెండునువదనము పైజేర్చి యామె పాలము పై తానధరముల తోడ బాలుడువదినను ముద్దాడె మరది పదుగురు చూడన్ ,
కవిమిత్రులారా, నమస్కృతులు. నాన్నగారి అంత్యకర్మలలో వ్యస్తుణ్ణై మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.
ఊకదంపుడు గారు, మీ పూరణ వైవిధ్యంతో చాలా బాగుంది.
అదిగో! అన్నను చూడుడు! వదినను ముద్దాడె!:...మరఁది పదుగురు చూడన్కుదురుగ కూర్చొనియుండక... అదరగ చప్పట్లు కొట్టె హడలిన యవ్వల్!
కుదరగ బాల్యవివాహముముదమున మా తాత లెల్ల ముద్దుగ చూడన్ కదలుచు తడబడు కాళ్ళను వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
40 కామెంట్లు:
ముదముగ తల్లిని మించిన
యదనపు హృదయమును పంచి యాదర మొప్పన్
కదిలించు మదిని ప్రియమగు
వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్
పదియేండ్ల బుడతడాతడు
ముదముననొక లడ్డునిత్తు ముద్దిడ ననగా
నొదుగుచు వాత్సల్యమ్మున
వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.
కదలాడు బొమ్మలాగున
పదిమాసము లైన లేని బాలుండొకడే
అదరక,బెదరకజేరియు
వదిననుముద్దాడె మరిది పదుగురు చూడన్
2.అదిచిన్ని పెళ్లికూతురు
వదినను ముద్దాడె మరిది పదుగురు చూడన్
బదులుగ తానొక టివ్వగ?
మదిగల భావాల మమత మై మరిపించున్|
పదుగురి లో పలుచనగా
సదమదమవజేసి సతియె సాధించుచుతాన్
హృదయము లేదన. తనువిని
వదినను, ముద్దాడె మరిది పదుగురు జూడన్
చదువది యెంతయొ గల్గియు
విధివశమున నుండియొక్క వింతౌవ్యాధిన్
యెదురుగ నెవరని తెలియక
వదినను ముద్దాడె మరిది పదుగురు జూడన్
A sexual maniac
ముదితకు చిన్నత్త కొడుకు
పదునెనిమిది నెలల వాడు వనితకు చనువై
వదనము పై నధరమతో
వదినను ముద్దాడె మరది పదుగురు చూడన్ .
మదపిచ్చి ముదిరి తలచెను
యెదురుగ నెవరైన నేమి యీప్సితమొదవన్
బెదరక వదురుచు నాతడు
వదిను ముద్దాడె మరిది పదుగురు జూడన్
వదిన తనదు మూడేండ్ల మ
రఁదిని నిడి నిజాంకమున కరం బనురక్తిన్
ముదమున ముద్దీయ మనగ
వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.
ఆంజనేయ శర్మగారూ నమస్కారం.
పదేళ్ళు మరీ ఎక్కువ
పదిమాసాలుకొంచెం తక్కువ అనిపించిందండీ.
మీ పదునెనిమిది నెలలు చక్కగా సరిపోయిందండీ
ఆంజనేయ శర్మగారూ నమస్కారం.
పదేళ్ళు మరీ ఎక్కువ
పదిమాసాలుకొంచెం తక్కువ అనిపించిందండీ.
మీ పదునెనిమిది నెలలు చక్కగా సరిపోయిందండీ
సదనమున యాడు పాపడు
వదినను ముద్దాడె;మరది పదుగురు చూడన్
పదిలముగా పాపనిన్ నిం
పొదవగ నెత్తుకొని తాను బుగ్గలు నిమిరెన్
* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఛ౦ ద ము = మ ధ్యా క్క ర
వదిన మాతృస్వరూప యని
...... వచియి౦చెద. | రది యట్లు౦డ. :--
వదిన. విధవ యైన లేక
........ వ౦ధ్య యైనను " సి౦గ్ " కులమున
వదినను మరది పె౦డ్లాడు ,
........... పడయగ స౦తతిన్ | కా న
వదినను ముద్దాడె మరది
.......... పదుగురు మెచ్చ " రా౦ సి౦గు "
{ వ౦ద్య. = గొ డ్రా లు }
ధన్యవాదాలండీ Shashima గారూ....నమస్కారములు.
వదలక కంటికి రెప్పగ
ముదముగ తనబిడ్డవోలె మురిపెము తోడన్
పదియేళ్ళుగ బెంచెడి తన
వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్!!!
అదియే మిచిత్రమో యది
వదినను ముద్దాడె మరది పదుగురు చూడ
న్నదియా , బాలున కప్పుడు
పదిమాసములే గద మరి వయసున్జూడన్
* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పది మ౦ ది కొడుకు లొకనికి |
మొదటి తనయునికి వివాహము జరిగె, మరి యా
సుదతికి ి చి న్నతడు మరది |
వదినెను ముద్దాడె మరది పదుగరు మెచ్చన్ !
గదలను పట్టి సమరమునఁ
గదియ సజాతులు, రఘుపతి కాండము తో వే
తుదముట్టించెన్ వాలిని
వదినను ముద్దాడె మరిది పదుగురు చూడన్
వదినయె ద్రౌపది. నకులున
కిది చిత్ర వివాహమౌట యేవురు పతులై
కుదురుగ భర్తయు నౌటను
వదినను ముద్దాడె మరది పదుగురు చూడన
ముదమొందగ జేసెను తన
వదినను, ముద్దాడె మరఁది పదుగురు చూడన్
ఎదురుగ నిలచిన తన ప్రియ
'మదవతిని', గనినినవారి మతులున్ జెదరన్.
పదములు తడబడ వేయుచు
ముదముగ పరుగెత్తు చిన్ని ముద్దుల మరిదిన్
వదిన పరుగులిడి బట్టగ
వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.
ముదమున చినతమ్నుని తా
వదినై యనురాగ సుధలు పంచెనటంచున్
నుదుటన మెప్పుగ నన్నయె
వదినను ముద్దాడె, మరఁది పదుగురు చూడన్!
ముదిరన వయసున పెండిలి
కుదరగ, మంటపము చెంత కూర్చొని యుండన్
వదలని తొలినెచ్చెలి, అర
వది, నను ముద్దాడె, మరఁది, పదుగురు చూడన్ [ మరఁది,+పదుగురు చూడన్]
వదలక చంకననెత్తుక
ముదముననొక లడ్డునిత్తు ముద్దిడుమనగా
నొదుగుచు బోసిగ నవ్వుచు
వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.
1.
పదహారునెలల వయసున
మదిదోచెడు సుందరుండు మరదే యైనన్
ముదితకు చనువై మెలగుచు
వదినను ముద్దాడె మరది పదుగురు చూడన్ .
2.
మృదువగు కరములు రెండును
వదనము పైజేర్చి యామె పాలము పై తా
నధరముల తోడ బాలుడు
వదినను ముద్దాడె మరది పదుగురు చూడన్ ,
కవిమిత్రులారా,
నమస్కృతులు.
నాన్నగారి అంత్యకర్మలలో వ్యస్తుణ్ణై మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.
దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.
ఊకదంపుడు గారు, మీ పూరణ వైవిధ్యంతో చాలా బాగుంది.
అదిగో! అన్నను చూడుడు!
వదినను ముద్దాడె!:...మరఁది పదుగురు చూడన్
కుదురుగ కూర్చొనియుండక...
అదరగ చప్పట్లు కొట్టె హడలిన యవ్వల్!
కుదరగ బాల్యవివాహము
ముదమున మా తాత లెల్ల ముద్దుగ చూడన్
కదలుచు తడబడు కాళ్ళను
వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్
కామెంట్‌ను పోస్ట్ చేయండి