6, డిసెంబర్ 2015, ఆదివారం

సమస్య - 1876 (కుసుమము తాఁకఁగనె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె నయ్యో. 

46 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

వసుధను నీటిని జల్లగ
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె న్యాం
బసురులు నమృతము కొఱకని
మిసిమిగ మోహిని నిగాంచె మీరిన కోర్కెన్

విరించి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గుసగుస లాడెను మల్లెలు
రుసరుస లాడుచును నవ్వె రోజా పూవుల్
కసికసిగ పలికె నప్పుడు
కుసుమము తాఁకఁగనె నుసురు గోల్పడె న్యాయం

కంది శంకరయ్య చెప్పారు...

స్విఫ్ట్ కీ కీబోర్డ్ లో టైప్ చేయడంలో 'నయ్యో' అన్నది 'న్యాయం' అయింది. మన్నించండి. సవరించాను.

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'... గోల్పడె నయ్యో | యసురులు... ' అన్నా సరిపోతుంది.

కంది శంకరయ్య చెప్పారు...

ఆంజనేయ శర్మ గారూ,
సమస్యలోని టైపాటును సవరించాను. ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది (సవరించిన సమస్యకు అనుగుణంగా ఉంది). అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

అక్కయ్యా,
మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.

shashima.with.ekalamu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
shashima.with.ekalamu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
shashima.with.ekalamu చెప్పారు...

ఒసగుటకై నీ పూజన
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడెనయ్యో
యసువులు బాపుట తగదని
కుసుమాల వదిలి లతలను కొలుతును దేవా

shashima.with.ekalamu చెప్పారు...

శర్మగారూ నమస్కారం. భావాన్ని కొంత విపులీకరించ మనవి

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ముసియించగ కాలము తా
పసియిచ్చిన శాపమునను పాండు విభుండే
స్వసతిగూడ మనసిజు
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడెనయ్యో

విరించి చెప్పారు...

తమ సంతానమును మానవులు కర్కశంగా తమనుండి లాక్కుంటున్నారని విసిగిన
వృక్షాలన్ని బ్రహ్మను మొరపెట్టు కున్నాయట తమ సుకుమార మైన పుష్పాలనెవరైనా తాకితే వెనువెంటనే వారి మరణము స్థిరమవ్వాలని

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మిసమిసల విద్యుదమరిత
ప్రసూన మని యెరుగనట్టి భ్రమరము సుధకై
బిసబిసఁ గ్రోలఁగ వాలిన
కుసుమము తాకఁగనె నుసురుఁ గోల్పడెనయ్యో!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

అసురున్ గూల్చెడు కొమరుని
ప్రసాదముగ నీయ శివుఁడు, పార్వతిని గనన్
విసరగ మన్మధుఁడు, హరున్
గుసుమము తాకఁగనె, నుసురుఁ గోల్పడె నయ్యో!

కంది శంకరయ్య చెప్పారు...

శశికాంత్ మల్లప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజన అనకుండా పూజను / పూజకు... అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

మిసమిసలాడెడి విరులతొ
నసమాక్షుని గొల్వనెంచి హరుషము తోడన్
విసవిస నడచుచు మొరటుగ
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

మిసమిసలాడెడి విరులతొ
నసమాక్షుని గొల్వనెంచి హరుషము తోడన్
విసవిస నడచుచు మొరటుగ
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో.

Unknown చెప్పారు...

కుసుమపు దళములమాటుగ
ముసుగున విష కల్పితంబు ముంచుట చేతన్
పసివాడట నాడుచుగని
కుసుమము తాకగనె నుసురు గోల్పడి నయ్యో|
౨కుసుమేసిన పైరందున
పసరంబటు గడ్డిమేయు పనిలో నుండన్
బుసగొట్టు పాముకాటుకు
కుసుమము తాకగనె నుసురు గోల్పడి నయ్యో|


కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

గౌతమ మహర్షి భార్య అహల్యను నిరాహారిగ వాయు భక్షిణిగ భస్మ శాయినిగ తపిస్తూ అందరికీ అదృశ్య రాలుగ వేల సంవత్సరాలు, శ్రీ రాముడు అక్కడికి వచ్చి ఆతిధ్యము స్వీకరించు నంత వరకు, ఉండుమని శపించెను. శ్రీరాముడు విశ్వామిత్రుని సూచన మేర కాశ్రమములో అహల్యను చూచి పాదములకు నమస్కరిస్తాడు. అహల్యకు శాప విమోచనమవుతుంది. ఆధారము: వాల్మీకి రామాయణము

అసుర సుర నరుల కగపడ
ని సతి యహల్య పతి శాప నిందిత ఘన తా
పసి యట రాముడు దన పద
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె నయ్యో.
[తాఁకఁగనెను= తాకగా చూచెను; కోల్పడు=అగపడు; ఉసురు= ప్రాణము; అయ్యో=ఓ అయ్యా]

shashima.with.ekalamu చెప్పారు...

ధన్యవాదాలండీ

shashima.with.ekalamu చెప్పారు...

ధన్యవాదాలు గురువుగారూ

విరించి చెప్పారు...


విసిగిన కుటజము లన్నియు
నొసగమనుచు గోరె ధాత నొకవర మదియే 
కుసుమాలను గావుమనుచు,
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో

విరించి చెప్పారు...

కుసుమించిన కుసుమ ముపై
రసాయనమ్ముల విరివిగ రైతులు వాడన్
విషయ మెఱుంగని భ్రమరము
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.” తాఁకఁగనె” లో “క” తర్వాత అర్ధానుస్వారముంది గనుక తాకాగానె అని అర్థము రాదు గద.

Unknown చెప్పారు...

:వ్యసనపరుడైన భ్రమరము
విసుగును జెందక మధువును వేమరి గ్రోలన్
వసి వెదజల్లిన నొక విష
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో !

కంది శంకరయ్య చెప్పారు...

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'మిసమిసలాడు విరులతో' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు కామేశ్వరరావు గురూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సోకఁగ, ప్రాకఁగ, ఇంకఁగ.... ఇత్యాదులందు క తర్వాత అరసున్నా ఉంటుంది.

కంది శంకరయ్య చెప్పారు...

ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

తాకంగ; శోకంగ ... లకు మారు రూపములనుకుంటాను.

sailaja చెప్పారు...

కుసుమపు తీవెల దాగిన
బుసపుర్వును గానలేక పుష్పలిహమ్మే
బిసబిస మధువును గ్రోలగ
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో!!!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

క్షమించాలి రెండవ పాదంలో చివర ' న్యాయం " కి బదులు న్యాం ' అని టైపాటు

Bhagavatula Krishna Rao చెప్పారు...

విసమును చిమ్మెడి వ్రణమున
పసిబాలుని బోలు ముసలి వగ్గును గాంచన్
పసగల వైద్యుని శస్త్రము
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె నయ్యో.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు కామేశ్వరరావు గురూ,
అది సోకఁగ.... శోకంగ కాదు.

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అది ముద్రా రాక్షస ఫలితము.

subbarao చెప్పారు...

కుసుమము వెనుకన పురువది
కసికసిగా దినుచురేకు కాపుర ముండన్
విసమునుగానక తుమ్శెద
కుసుమముదాకగ నె నుసురుగోల్పడెనయ్యో

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

విసమంచు కీటకములకు
రసాయనములు వెదజల్ల రైతన్నచటన్
రసమును కోరిన భ్రమరము
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె నయ్యో :(

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

ముసలము పుట్టిన రోజున
నసుగుచు ద్వారక నగరిని నారద పూజన్
ముసలిది విషవృక్షమ్మున
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె నయ్యో