ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ముప్రత్యయం స్థానంలో అనుస్వారం ఉంచి ‘వత్సరం’ అనడం వ్యావహారికం. ‘పదునా రనెడి యేఁడు’ అనండి. ‘మాసాల | యాంగ్ల...’ అనండి.
గురువులకు , సోదర సోదరీ మణులకు , అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ---------------------------- వచ్చె రెండు వేల పదునారు వన్నెల క్రొత్త వత్స రమ్ము కోరి మనకు తెచ్చు నేమొ జగతి తీరైన సౌరులు మెచ్చు కొనగ మిగుల మేల టంచు
అది యేమి జిలేబి ప్రారబ్ధమో గాని జిలేబి వ్రాసిన పలుకులకి ఛందస్సు సాఫ్ట్ వేర్ "హంసగతి రగడ" అని పేరు బెట్టి (!ఇదియే కదా జిలేబి తల రాత యన -రగడే :) దరిదాపుల్లో చూపిస్తోంది అరవై శాతం !
గురువు గారికి మిత్రులకు నూతనసంవత్సర శుభాకాంక్షలు. వచ్చె రెండు వేల పదునారు,హరుషంబు నిండె జనుల మనము నిండ,నంద చేయుచుంటి మీకు శీఘ్రంబు గానిట సౌఖ్య మంద మనుచు సంతసాన.
కవి పండితులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు...
స్వామి మాలలో నున్న స్వామి డయరీలు అమ్ముచు ========*======== వచ్చె రెండు వేల పదునారు డయరీలు మీ బలుకులు వ్రాయు, మీ పనులను జేయు నండి ! మీరు మెచ్చు రీతి జాగు చేయ వలదు స్వాములార !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివచ్చె రెండు వేల పదునారు ముదమారఁ
రిప్లయితొలగించండిదెచ్చుఁ గలుములెన్నొ యిచ్చ మెచ్చి
సౌఖ్య సాగరమున సంతోషమునఁ దేలి
యోలలాడఁజేయు నుర్వి జనుల!
డా. విష్ణునందన్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ముప్రత్యయం స్థానంలో అనుస్వారం ఉంచి ‘వత్సరం’ అనడం వ్యావహారికం. ‘పదునా రనెడి యేఁడు’ అనండి. ‘మాసాల | యాంగ్ల...’ అనండి.
గురువు గారికి....సుకవి మిత్రులెల్లరులకూ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
తొలగించండివచ్చె రెండు వేల పదునారనెడు యేడు
విశ్వమెల్ల బిలిచి వేడ్కజేయ
ధరణి నేల దలచి ద్వాదశ మాసాల
యాంగ్ల వత్సరాంబ అవని జేరె
గురువులకు , సోదర సోదరీ మణులకు , అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి----------------------------
వచ్చె రెండు వేల పదునారు వన్నెల
క్రొత్త వత్స రమ్ము కోరి మనకు
తెచ్చు నేమొ జగతి తీరైన సౌరులు
మెచ్చు కొనగ మిగుల మేల టంచు
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివచ్చె రెండు వేల పదునారు
పోయె రెండు వేల పదునైదు
రానున్నది రెండు వెల పదిహేడు
మారునా ఇసుమంత జీవము జిలేబి ?
శుభోదయం
నూతన సంవత్సర శుభాకాంక్షల తో
జిలేబి
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ భావానికి నా పద్యరూపం.....
వచ్చె రెండువేల పదునారు; పదునైదు
స్మృతుల నొసఁగి పోయె చిత్రగతుల;
వచ్చు రెండువేల పదునే డిక జిలేబి!
మారున యిసుమంత మనుజు బ్రతుకు?
తొలగించండికంది వారికి !
నమో నమః !
@ఇచ్చోట వెలయు కవీశ్వరులందరికి !
నూతన సంవత్సర శుభాకాంక్షల్ !
జిలేబి
కంది వారు,
తొలగించండిఅది యేమి జిలేబి ప్రారబ్ధమో గాని జిలేబి వ్రాసిన పలుకులకి ఛందస్సు సాఫ్ట్ వేర్
"హంసగతి రగడ" అని పేరు బెట్టి (!ఇదియే కదా జిలేబి తల రాత యన -రగడే :) దరిదాపుల్లో చూపిస్తోంది అరవై శాతం !
జిలేబి
మాస్టరు గారికి కవి మిత్రులు, వీక్షకులు అందరికీ 2016 " ఆంగ్ల " సంవత్సర శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండికందము:
పదియారు రెండువేలకు
పదిలముగా కలసినట్టి వత్సరమందున్
వదలక మిము సుఖశాంతులు
మదిగది నానంద జ్యోతి మరినిండవలెన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
వచ్చె రెండువేల పదునారు వత్సర
రిప్లయితొలగించండిమిచ్చుగాక మనకు మించు సిరులు
మదికి శాంతి గలిగి మహిలోని జనులకు
సౌఖ్యమంద వలయు చక్కగాను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మిత్రులందఱకు నవ్యాంగ్లవత్సరాది శుభాకాంక్షలు!!
రిప్లయితొలగించండి"హాయిగ రెండువేల పదహా రిడు శాంతులు సౌఖ్యముల్ సిరుల్!"
వచ్చె రెండువేల పదునారు నాట్యమ్ము
లాడి పాడి మనము లన్ని మురియ!
శాంతిసౌఖ్యములును సంతోష సంపదల్
జనుల కొసఁగి కాఁౘు సతము ద్రుతము!!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
అందరకూ నూతన ఆంగ్లవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండివచ్చె రెండువేల 'పదునారు' ప్రాయమ్ము
యవ్వనమ్ము తిరిగి యంకురించ
కలుములెన్నొగూర్చ బలిమి! కరగిపోవు
క్రొత్త వత్సరమునఁ గోటి వెతలు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిలాస్య గారూ,
తొలగించండిధన్యవాదాలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!
గురువు గారికి మిత్రులకు నూతనసంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండివచ్చె రెండు వేల పదునారు,హరుషంబు
నిండె జనుల మనము నిండ,నంద
చేయుచుంటి మీకు శీఘ్రంబు గానిట
సౌఖ్య మంద మనుచు సంతసాన.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వచ్చెను వత్సర మయ్యది
రిప్లయితొలగించండియిచ్చకమును మనకుజేయ యీవత్సరమున్
మెచ్చుచు జెప్పుచు నుంటిని
నెచ్చెలులకు శుభములిడుత నీరజ భవుడున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిదన్యవాదాలు.
పూజ్య గురుదేవులకు,కవిమిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండివచ్చె రెండు వేల పదునారు వేడ్కతో
మెచ్చు కొనగ తనను యిచ్చు సిరులు
పచ్చ దనము తోడ పాడిపంటలొసగి
సురభి జనుల కిడును సుఖము శాంతి!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వచ్చె రెండువేల పదునారు ముదముగ
రిప్లయితొలగించండిసంబరముల నడుమ సాదరముగ
అర్థవంతమవగ నందరి బ్రతుకింక
సంతసంబునవని స్వర్గమవును
రవికాంత్ మల్లప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురువుగారు శ్రీ కందిశంకరయ్య గారికి కవిమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!
రిప్లయితొలగించండివచ్చె రెండు వేల పదహారు,పదిహేను
వీడుకోలు జెప్పి వెళ్లి పోయె
మత్సరములు క్రొత్త వత్సరమున వీడ
రాయి రత్న మవదె హాయి నిడదె !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వచ్చె రెండువేల పదునారు వర్షంబు
రిప్లయితొలగించండితెచ్చు సిరులు జనులు మెచ్చగ నని
ఇచ్చిపుచ్చుకొందు రచ్చపు కుశలంపు
పృచ్ఛ లొకరినొక్క రిచ్చకములు
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండివచ్చె రె౦డు వేల పదునారు | వరుణ దే
వ. ! " పదు నార కు౦డ. " -- వలసి న౦త
వరకు కురిసి , మ౦చి ప౦టల న౦ది౦చి
యరుస మొసగు మోయి హాలికులకు
{ పదును = నేల బాగా తడిసి న౦తటి వర్ష.
ప్రమాణము ; పదునార కు౦డ = భూమిలో
తేమ ఆర కు౦డా ;
అరుసము = హర్షము ; }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండి‘పదునారు’ శబ్దాన్ని శ్లేషించి చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
పూజ్య గురుదేవులకు,కవిమిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండికందుల వరప్రసాద్ గారూ,
తొలగించండిధన్యవాదాలు. మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
వచ్చె రెండువేలపదునారు కళలను
రిప్లయితొలగించండిపంచి పెంచ నెంచి పట్టుదలను
ప్రజల కందజేసి పంటలనందించి
శాంతి సుఖములొసగుచదువులుంచ|
2.వచ్చె రెండువేల పదునారు నేడిల
సంతసంబు సాకు సంబరాలు
విశ్వ మానవులకు వివరించ దలచియే
అర్ధరాత్రినిలకు నడుగుబెట్టె.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
వచ్చె రెండువేల పదనారు శివమిడ
రిప్లయితొలగించండిరెండు రాష్త్రముల కు దండిగాను
అన్నదమ్ములవలె ననవరతము మన
తెలుగు జాతి ప్ర జ లు మెలగు గాక
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
వచ్చె రెండువేల పదునారు జనులెల్ల
రిప్లయితొలగించండిసంతసంబుతోడ స్వాగతించి
వేడుకలను జేసి వేడిరి సుఖశాంతు
లిచ్చిబ్రోవుమనచు కచ్చితముగ
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
గురువర్యులకు కవిమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు రెడ్డి గారూ!
తొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండికవి పండితులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు...
స్వామి మాలలో నున్న స్వామి డయరీలు అమ్ముచు
========*========
వచ్చె రెండు వేల పదునారు డయరీలు
మీ బలుకులు వ్రాయు, మీ పనులను
జేయు నండి ! మీరు మెచ్చు రీతి
జాగు చేయ వలదు స్వాములార !
కందుల వరప్రసాద్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘...జేయునండి మీరు జేజే లనెడు రీతి’ అనండి.
వచ్చె రెండువేల పదునారు, కలలన్ని
రిప్లయితొలగించండివిచ్చుకొనఁగ ముదము పెచ్చరిల్లె
శాంతిసౌఖ్యములు వసంతశోభారాసి
పెంపునొందవలె సవిస్తరముగ.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
గురుదేవులకు,కవిమిత్రులకు
రిప్లయితొలగించండినూతన సంవత్సర శుభాకాంక్షలు
వచ్చెరెండువేల పదునారు సంవత్స
రమ్ముస్వాగతించ రండు,విబుధు
లెల్ల ప్రీతి మెరయ పల్లెవాసుల గూడి
భరతమాత ప్రతిభ ప్రస్తుతించ
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.