2, సెప్టెంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 100

 అష్టావధానము
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. అది విశాఖపురమ్మునందు విరాజిల్లు
    ....లలితాంబికా మహాలయవరమ్ము
    ఆంధ్ర సాహిత్యమం దద్భుత ప్రక్రియ
    ....నానొప్పు నష్టావధాన మచట
    నొనరించు చుండెను యువ వధాన విభూష
    ....యగు రామభట్ల సమర్థ సరణి
    ఆచార్య సార్వభౌమాది విద్వన్మణుల్
    ....విలసిల్లు చుండిరి వేదిక పయి
    శారదాదేవి యచ్చోట సరస గతుల
    నృత్య విన్యాస గతులను నెరపుచుండ
    డెందమునకును వాక్కున కందరాని
    యధికతరమైన ఆనంద మట లభించె

    మిత్రులారా!

    మన బ్లాగులో సభ్యులు (మా తమ్ముడు) డా. గన్నవరపు వరాహ నరసింహ మూర్తి విశాఖపట్టణమునకు వచ్చినపుడు వారి కోరికపై తే.17-2-2012 నాడు శ్రీ లలితా పీఠములో యువ అవధాని (మా మనుమడు) చి. రాంభట్ల పార్వతీశ్వర శర్మచే అష్టావధానము నిర్వహింపబడినది. ఈ కార్యక్రమమును నేను ఏర్పాటు చేసితిని. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో విశ్రాంత ఆచార్యులైన ఆచార్య సార్వభౌమ బిరుదాంచితులు డా. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంచాలకులుగా వ్యవహరించిరి. ఆద్యంతము రసవత్తరముగా సాగిన ఈ సభకు మన మిత్రులు శ్రీ మిస్సన్న గారు కూడ విచ్చేసిరి. ఆ సభ అందరి మన్న లందుకొనినది. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  2. అవధానము లన్నిట నీ
    యవ దా న మె గొప్ప ద నిరి యార్యులు శర్మా !
    యవదా నపు ప్రతి నీ యది
    వివరముగా బంపు కొఱకు వేడుచు నుంటిన్ .

    రిప్లయితొలగించండి
  3. తేనెల నూరు మాధురుల, తీయదనంబును మెచ్చువారలున్,
    జ్ఞానులు, కావ్య సంరచన కమ్మగ జేయుచు నుండువారలున్,
    వీనులు మెచ్చు రీతి కడు వేడుక సాహితి విందుజేతురే!
    మానసమందె సంతసము; మక్కువ తోడ నమస్కరింతు నేన్.

    రిప్లయితొలగించండి
  4. అవధానము జేయు నెడను
    కవనమ్ముల పల్కుచుంద్రు, ఘనమగు విందుల్
    భువనమున సాహితీ ప్రియ
    కవివర్యులకును, వెల గల కానుక లవియే.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    అవధానానికి ఆహ్వానం :

    01)
    _______________________________

    తేనెలూరు తెలుగు కీర్తి - తేజరిల్ల
    తెలుగు వారికి మాత్రమే - తెలిసి యున్న
    తేట తెనుగున యవధాన - దీప్తి వెలయ
    తెలిసి నంతనె రండోయి - తెలుగు లార !
    దిగ్విజయమును చేయగా - దివ్యముగను! _______________________________

    రిప్లయితొలగించండి
  6. నేమాని పండితుల్ నిర్వహింపగ నాడు
    ...........సాహితీ ప్రియులెల్ల రోహొ యనగ
    వేదుల కవివరుల్ మోదమ్ము మీరగ
    ...........సంచాలకుండయి సభను జరుప
    నరసింహ మూర్తి యమెరిక నుండిటు వచ్చి
    ..........అతిథి సత్కారమ్ము నందుకొనగ
    పద్య ప్రియులు ముర్సి వల్లె వల్లె యటంచు
    ..........కరతాళ శబ్దమ్ము కరము జేయ

    పార్వతీశ్వర నాముడౌ బాల సుకవి
    పద్యములు చెప్పి యవధాన పటిమ జూపె
    వాణి విహరింప నచ్చోట వన్నెలూని
    లలిత పీఠమ్ము రంజిల్లె లాస్య గతుల.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు. మీ పద్యము చాల బాగుగ నున్నది. మీ వర్ణనా నైపుణ్యము విద్వన్మాన్యము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. సుధలఁగురియు నవధానము!
    కదనమనితలంచ వారు, కమ్మదనంబున్
    ముదముఁగ్రోలుట నెరుగని
    వెధవాయిలనంగ నేను వెఱువను ధరణిన్!

    రిప్లయితొలగించండి
  9. చిక్కు సమస్యను చేపట్టి పూరించు
    దత్త పదిని పద్య ధార గలుపు
    వ్యస్తాక్షరిని తాను విస్తరించుచు జెప్పు
    ఘంట శబ్దములను గణన సేయు
    వర్ణ నీయగ వర్ణ వర్ణంబులుగ పల్కు
    అప్రస్తుతము తోడ నాట లాడు
    నిషిద్ధమున గూడ నిక్కచ్చి గా నుండు
    ఘన పురాణ ములను కథలు నుడువు

    అష్ట కష్ట ములనె యిష్టంబుగా కోరి
    అవధ రింప జేయు నాశు వుగను
    సరస పద్య ములనె సభ్యులందరు మెచ్చ
    తెల్గు జాతి కున్న తేజ మిదియె.














    రిప్లయితొలగించండి
  10. కొలువు దీరిన సభయందు కోవి దులట
    పోరి పోటీలు పడుచుంద్రు పోడిమి గొను
    సాహితీ సమర మున సాహ సమ్ము
    గాంచి నంతనె మదిపొంగి కలుగు హాయి !

    రిప్లయితొలగించండి
  11. నేమాని పండితార్యా ధన్యవాదములు.
    మీ వర్ణన పద్యపు స్ఫూర్తితో.

    రిప్లయితొలగించండి
  12. హనుమచ్ఛాస్త్రిగారు,
    అష్టావధాన వర్ణన బాగా చేసినారండి.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    గూగుల్‌లో ‘images of అష్టావధానము’ అని వెదికితే ఆ చిత్రం దొరికింది. వేదిక మీద ఆసీనులై ఉన్నవారిలో మిత్రులు డా. గన్నవరపు నరసింహ మూర్తి గారిని స్పష్టంగా గుర్తించగలిగాను. కాని ఆ సభా వివరాలు తెలియవు. ఆనాటి అవధాన సభ విశేషాలను ఛందోబద్ధం చేసి తెలిపినందుకు ధన్యవాదాలు.
    డెందమునకును వాక్కున కందరాని
    యధికతరమైన ఆనంద మందినాఁడ.
    *
    సుబ్బారావు గారూ,
    పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    ఇంతకీ మీ వినతి వారికి చేరిందో, లేదో?
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తెలుగున + అవధాన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తెలుగున నవధాన’ అనండి.
    *
    మిస్సన్న గారూ,
    ఆనాటి అవధానాన్ని వీక్షించిన అదృష్టవంతులు. ఆ సభను చక్కగా వర్ణించారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.
    మూడవపాదంలో ‘ముదమున’లో న టైపు కానట్టుంది.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అష్టావధాన ప్రక్రియను పరిచయం చేసిన మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. ఆభినందనలు.
    ‘సమరమున’ అన్నచో గణదోషం. ‘సమరమ్మున’ అంటే సరి!

    రిప్లయితొలగించండి