30, సెప్టెంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 128

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. మాయ నెరుగ డత్యానందమయుడు సుతుడు
    పుత్రు నాటపాటలు జూచి మురియు తల్లి
    మోము బింబాలలో నవ్వు పువ్వు లలరె
    కన్ను దమ్ములలో ప్రేమకాంతు లొప్పె

    రిప్లయితొలగించండి
  2. చూ డు డ క్కడి చి త్రము చూ పు లలర
    ముద్దు మురిపాలు దీ ర్చను ముదము తోడ
    యూ సు లాడుచు నుండెను నుత్సు కత న
    తల్లి బిడ్డల యను బంధ ముల్ల మలరె

    రిప్లయితొలగించండి
  3. కూడు గూడు గుడ్డ కొదవ గావచ్చును
    ముద్దు మురిపెమునకు హద్దు గలదె
    కాకి పిల్ల ముద్దు కాకికి ధరలోన
    బీద తల్లి కామె బిడ్డె జగము.

    రిప్లయితొలగించండి
  4. పండిత కవి మిత్రులకు ప్రణామములు! గడచిన రెండు దినములుగా కొన్ని యాకస్మిక సంఘటనల కారణమున సాహితీ సత్సంగమున పాలుగొనలేకపోయినందులకు మన్నించఁవలసినదిగా కోరుకొనుచు...

    తల్లి యొడిలోన పసిపిల్ల తల్లడిల్ల,
    తల్లి యుల్ల మదెంతయో తల్లడిల్లు!
    తల్లి యొడిలోన పసిపిల్ల యుల్లసిల్ల,
    తల్లి యుల్ల మదెంతయో యుల్లసిల్లు!

    రిప్లయితొలగించండి
  5. అమ్మకు సుతుడై పెంపక
    కమ్మదనంబెరుఁగహరియె గర్భము జేరెన్
    బొమ్మగ దేవకి మురియగ
    నిమ్ముగ మాతా యశోద కిష్టుడు గాగన్!

    రిప్లయితొలగించండి

  6. నవ మాసంబులు మోసి ప్ర
    సవించి శిసువును బహువిధ శ్రమలన్ పడుచున్
    ప్రవిమల ప్రేమను చూపుచు
    అవిరళముగ సాకు నట్టి నమ్మకు జేజే!


    ఉంగా ఉంగా యనుచున్
    లుంగలు పడి పొర్లి దొర్లి రోదించంగా
    చెంగున నొడి చేర్చుచు నా
    బంగరు కొండా యటంచు పాలున్ కుడుపున్


    రాంభట్ల వేంకటరాయ శర్మ

    రిప్లయితొలగించండి
  7. కన్నతల్లి బిడ్డడి కోసం :

    ఆకాశంబునుదించగ
    శ్రీకారంబైనఁజుట్టు చిన్నోడలరన్!
    యాకొనఁగఁబాల కడలిన్
    గేకలు మాన్పించ హృదయ గేహముఁ జేర్చున్!

    రిప్లయితొలగించండి
  8. ముద్దులను మూట గట్టెడు పుత్రుని గని
    సర్వము మరచి యా తల్లి సంతసించు
    "పేగు బంధ" మిదియె ! ననిపించు నపుడు
    తల్లి ప్రేమను తూచుట తరము గాదు !


    రిప్లయితొలగించండి
  9. నీకన్నా నాకెవ్వరు
    నా కన్నా! నీదు ముద్దు నాకన్నమురా !
    నాకున్న దానిలోనే
    నీకన్నియు ముద్దు కన్న! నేనిత్తునురా!

    రిప్లయితొలగించండి



  10. తల్లి బిడ్డల ప్రేముడి నెన్న దరమె
    పేద ధనిక భేదమ్ము లేదాద మరచి
    ముఖము నందు సంతోషమ్ము మొలకలెత్త
    నాటపాటల దేలుచు నలరుచుండ్రి.

    రిప్లయితొలగించండి
  11. మంచి గంధపు పరిమళ మించు కైన
    పంచ భక్ష్య భోజ్యమ్ముల నెంచ కుండ
    పొంద గోరును పసివాని బంధ మెపుడు
    అందు కొనునవి తల్లియై విందు లనుచు
    -----------------------------------------
    కొమరుని జిలిబిలి చేష్టలు
    తమకముగా ననుభ వించ తల్లుల కెపుడున్ !
    మమతగ ప్రేమను ముడివడి
    యమునితొ పోరాడి యైన యవనిని గెలుచున్ !

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో "యూసులాడుచు" బదులుగా నుగాగమము చేసి "నూసులాడుచు" అంటే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. నాయనా చి. వేంకట రాయ శర్మా! శుభాశీస్సులు.
    నీ పద్యములు బాగుగనున్నవి. శిశువు అనే పదము తప్పుగా టైపు అయినట్ట్లున్నది. సరిజేయాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులకు నమస్సులు.
    ‘మాతృప్రేమ’ అంశంపై మనోహరమైన పద్యాలను వ్రాసిన
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    మిస్సన్న గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    సహదేవుడు గారికి,
    రాంభట్ల వేంకటరాయ శర్మ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    కమనీయం గారికి
    అభినందనలు. ధన్యవాదాలు.
    కరెంటు కోత కారణంగా మీ పద్యాలను సమీక్షించలేకపోయాను. అవకాశముంటే సాయంత్రం వరకు వ్యాఖ్యానిస్తాను.
    *
    రాంభట్ల వేంకటరాయ శర్మ గారికి ‘శంకరాభరణం’ బ్లాగు ఆనందంతో స్వాగతం పలుకుతున్నది.
    *
    పండిత నేమాని వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. అన్నన్నా హనుమన్నా
    ఎన్నెన్నో న్నా లు వేసితింపుగ మిన్నై
    వన్నెల నీనగ పూరణ
    నేనెన్నుదు నెన్నొ మార్లు నిజమిది యన్నా!

    రిప్లయితొలగించండి