3, సెప్టెంబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 811 (లవకుశు లనువారు కవలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
లవకుశు లనువారు కవలు లక్ష్మణుని సుతుల్.

26 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్నటి అవధాన కార్యమానికి హుస్నాబాద్ వెళ్ళి ఇప్పుడే ఇంటికి చేరుకున్నాను. మరికొద్ది సేపట్లో కరెంటు పోతుంది. మళ్ళీ కరెంటు వచ్చాక నిన్నటి పూరణలను, పద్యరచనలను పరామర్శిస్తాను. అలాగే వీలైతే నిన్నటి అవధాన విశేషాలను తెలుపుతాను.

    రిప్లయితొలగించండి
  2. అయ్యా!
    ఈ సమస్య నిర్మాణమును ఒక సారి చూడండి. "కవ" అంటేనే జత. కవలు అనవచ్చు - కాని కవలలు అనరాదేమో. వ్యవహారములోనే కవలలు అంటాము - అది వ్యాకరణ శుద్ధము కాదు అని అనుకొనుచున్నాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారికి,
    సభక్తి నమస్కృతులు.
    నిజమే. నేను గమనించలేదు. దోషమును తెలియజేసినందుకు ధన్యవాదములు. సవరిస్తాను.

    రిప్లయితొలగించండి
  4. అవనీజాతకు సుతులట
    లవకుశు లనువారు, కవలు; లక్ష్మణుని సుతుల్
    భువిలో నెవరని యెఱుగను,
    వివరములను నేనడిగెద, వివరింపగదే?

    రిప్లయితొలగించండి
  5. అవనీపుత్రికి తనయులు
    లవకుశులనువారు కవలు, లక్ష్మణుని సుతుల్
    భువి నేలిరి భరతు సుతులు
    సువిధిన్ శత్రుఘ్ను సుతులు శోభలు జెలగన్

    (రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నిరువురేసి సుతులు ఉండిరి, వారెల్లరును
    వివిధ రాజ్యములను ఏలిరి.)

    రిప్లయితొలగించండి

  6. అవగత మా ?మీ కిట్లుగ
    లవ కుశు లను వారు కవలు లక్ష్మణుని సుతుల్
    వివరింతును వా రిరువురు
    కవలురు మఱి సీ త సుతులు కాదు నసత్యం .

    రిప్లయితొలగించండి

  7. రవికుల సంజాతుల రౌ
    లవ కుశలనువారు` కవలు ,లక్ష్మణ సుతులున్
    ప్రవిమల గురుకుల మందున
    నవిరళ విద్యార్థులగుచు నలరారె కదా

    రాంభట్ల వేంకటరాయ శర్మ

    రిప్లయితొలగించండి
  8. రాంభట్ల వేంకటరాయ శర్మసోమవారం, సెప్టెంబర్ 03, 2012 1:41:00 PM

    రవికుల సంజాతుల రౌ
    లవ కుశలనువారు` కవలు ,లక్ష్మణుని సుతులున్
    ప్రవిమల గురుకుల మందున
    నవిరళ విద్యార్థులగుచు నలరారె కదా

    రాంభట్ల వేంకటరాయ శర్మ

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,

    గురువుగారి సవరణలకు ధన్యవాదములు

    సూర్యుని వర ప్రసాదము గావున "సుర వరు డని " వాడితిని . నేను వ్యక్తిగతము గా ఏమి సాధించిననూ

    అది అంతయూ మీరు పెట్టిన భిక్షయే. సవ్యసాచిని గాను మీ శిష్యుడను గురువుగారు.
    -----

    వనము లందు మునులతోడ వాసమున్న

    లవకుశ లను వారు కవలు, లక్ష్మ ణుని సు

    తులకు సోదరుల్, బందించె, తొలుత వారు

    లక్ష్మ ణుని, యుద్దమును జేసె రాము తోడ |



    రిప్లయితొలగించండి
  10. గుండు మధుసూదన్ గారి పూరణ....

    అవనీజా రామ సుతులు
    లవ కుశులనువారు; కవలు! లక్ష్మణుని సుతుల్
    రవిచంద్ర నిభులు లలితులు
    నవిచారులు చంద్రకేతు లంగదులు గదా!

    రిప్లయితొలగించండి
  11. మరో చిన్న ప్రయత్నము

    రవికులమ్మున జనియించె - రామ లక్ష్మణ భర తుల్

    విధి కరమున జిక్కి రాము - విడచె సీత నడవిలో

    లవకుశలను వారు బుట్టె - రమణి సీత కపుడు యా

    లవకుశలను వారు కవలు -లక్ష్మణు నిసుతు లకు నా

    వివరములను ముందు దెlipe వినయ మండితmmuగా

    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    గుండు వారి పూరణలో లక్ష్మణుని కుమారుల పేర్లను తెలిపారు. చూడండి.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాంభట్ల వేంకటరాయ శర్మ గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు ఆనందంతో స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    గురువును మించిన శిష్యుడు అనిపించుకునే యోగ్యత మీకున్నది. కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. కవలుల్ యన్నకు బుట్టిన
    భువిలో సుతులే యగుదురు పోలిక జూడన్
    వివరముగ తమ్మనక,టుల
    లవకుశులనువారుకవలు లక్ష్మణుని సుతుల్

    రిప్లయితొలగించండి
  14. కవలుల్ యన్నకు బుట్టిన
    భువిలో సుతులే యగుదురు పోలిక జూడన్
    వివరముగ తమ్మనక,టుల
    లవకుశులనువారుకవలు లక్ష్మణుని సుతుల్

    రిప్లయితొలగించండి
  15. కవలుల్ యన్నకు బుట్టిన
    భువిలో సుతులే యగుదురు పోలిక జూడన్
    వివరముగ తమ్మనక,టుల
    లవకుశులనువారుకవలు లక్ష్మణుని సుతుల్

    రిప్లయితొలగించండి
  16. కవలుల్ యన్నకు బుట్టిన
    భువిలో సుతులే యగుదురు పోలిక జూడన్
    వివరముగ తమ్మనక,టుల
    లవకుశులనువారుకవలు లక్ష్మణుని సుతుల్

    రిప్లయితొలగించండి
  17. కవలుల్ యన్నకు బుట్టిన
    భువిలో సుతులే యగుదురు పోలిక జూడన్
    వివరముగ తమ్మనక,టుల
    లవకుశులనువారుకవలు లక్ష్మణుని సుతుల్

    రిప్లయితొలగించండి
  18. ravikula tilakuni charitamu
    SravaNaa naMdamuga baaDa jaatara lonan
    cheviyoggi vinuchu mechchiri
    లవకుశులను, వారు కవలు లక్ష్మణుని సుతుల్.

    రిప్లయితొలగించండి
  19. అయ్యా! శుభాశీస్సులు.
    లవకుశ అని సినిమా ప్రయోగము. పౌరాణిక ప్రయోగము "కుశలవులు" అనే. ఆ కవలో కుశుడు పెద్ద వాడని చెపుతారు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. వరప్రసాద్ గారూ,
    మీ రెండవ ప్రయత్నం ప్రశంసనీయం.
    కాని పద్యం నడక సాఫీగా లేదు. అక్కడక్కడ కొన్ని దోషాలున్నాయి. భావమూ కొంత గందరగోళంగా ఉంది.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణలోని లాజిక్ బాగుంది. అభినందనలు.
    ‘కవలుల్ + అన్నకు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కవ లన్నకు బుట్టినచో’’ అందాం.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ఇదే కదా...

    రవికుల తిలకుని చరితము
    శ్రవణా నందముగ బాడ జాతర లోనన్
    చెవియొగ్గి వినుచు మెచ్చిరి
    లవకుశులను, వారు కవలు లక్ష్మణుని సుతుల్.

    బాగుంది. అభినందనలు.
    కానీ లక్ష్మణుడి కుమారులు అంగద, చంద్రకేతులు కవలేనా?
    *
    పండిత నేమాని వారూ,
    ఔత్తరాహికులు కూడా కుశలవులు అనే అంటారు. సినిమాలో, లేక మరే కారణంగానో మన తెలుగువాళ్ళే లవకుశులు అంటారు.

    రిప్లయితొలగించండి




  21. అవనీజాతకు గల్గిరి
    లవకుశులనువారు కవలు; లక్ష్మణుని సుతుల్
    ప్రవిమలుడు చంద్రకేతువు,
    నవయువకుండంగదుండు నా యిర్వురుగా.

    రిప్లయితొలగించండి
  22. కమనీయం గారూ,
    మీ పూరణ అన్నివిధాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. రవికుల సోముని చరితము
    వివరముగా తెలిపి రకట వీనుల విందౌ !
    కవి వాల్మీకి రచింపగ
    లవకుశు లనువారు కవలు లక్ష్మణుని సుతుల్ !

    రిప్లయితొలగించండి
  24. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పాలించినట్టే
    లవకుశులు మరియు లక్ష్మణ సుతులూ కలసి

    అయోథ్యను పాలిస్తే :

    01)
    _______________________________

    రవికుల వారసు లౌటను
    లవకుశు లనువారు కవలు, - లక్ష్మణుని సుతుల్
    రవికుల దీప్తిని బెంచుచు
    రవణించగ ప్రజలు నాడు - రాజ్యం బేలెన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యా ! ధన్యవాదములు. నెట్ సమస్య వలన అలా వ్రాశాను. తెలుగించినందులకు కృతజ్ఞతలు.
    నా భావం ..అది కలియుగ జాతర .. ఆ తిరు నాళ్లలో ఒక గాయక బృందం లోని "లక్ష్మణు"డను వాని కవల కుమారులను శ్రోతలు మెచ్చుకున్నారని....

    రవికుల తిలకుని చరితము
    శ్రవణా నందముగ బాడ జాతర లోనన్
    చెవియొగ్గి వినుచు మెచ్చిరి
    లవకుశులను, వారు కవలు లక్ష్మణుని సుతుల్.

    రిప్లయితొలగించండి
  26. అవనీ పుత్రికి తనయులు
    లవకుశులనువారు కవలు; లక్ష్మణుని సుతుల్
    కవలో కాదో గూగుల్
    ప్రవచనలిక వెదకుమా ప్రభాకర శాస్త్రీ!

    ...(పండిత నేమాని వారికి నమస్సులు)

    రిప్లయితొలగించండి