22, సెప్టెంబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 829 (అవినీతికి సాటి ధర్మము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
అవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే!
ఈ సమస్యను పంపిన
ఏల్చూరి మురళీధర రావు గారికి
ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

  1. అవినీతి కష్టముల నిడు
    సువిధిన్ ధర్మమ్ము, నీతి, సుగుణములె సదా
    భువి శాంతి సుఖమ్ముల నిడు
    నవి, నీతికి సాటి ధర్మ మవనిన్ గలదే?

    రిప్లయితొలగించండి
  2. అవినీతి సంఘమున కరి
    యవినీతిని విడువ వలయు నందరును జుమీ
    యవినీతి బలము నేతల
    కవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే?

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    అవినీతికి పరాకాష్ఠైన ఒకానొక ముఖ్య మంత్రి యెన్నికల వేళ
    తన కుమారునికి చేస్తున్న హితబోధ :

    _______________________________

    01)
    అవినీతిని పాటింపుము !
    అవినీతికి పోషణ నిడు - యవిరళ మవగా !
    అవినీతిని శ్వాసించుము !
    అవినీతికి సాటి ధర్మ - మవనిన్ గలదే !

    02)
    అవినీతియె బలము మనకు !
    అవినీతియె యాస్తి నిడును ! - యాశల దీర్చున్ !
    అవినీతియె యందల మిడు !
    అవినీతికి సాటి ధర్మ - మవనిన్ గలదే !
    _______________________________

    రిప్లయితొలగించండి
  4. అవినీతి యాత్మ ఘోషిది
    అవినీతి నటంచు నాకు నపనిందేలా
    అవినీతి పరుడె భోగుం-
    డవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే !

    రిప్లయితొలగించండి
  5. అవినీతికి పరాకాష్ఠైన ఒకానొక ముఖ్య మంత్రి యెన్నికల వేళ
    తన కుమారునికి చేస్తున్న హితబోధ :

    03)
    _______________________________

    అవినీతికి శిక్షణ నిడు !
    అవినీతిని విస్తరించు- యనవరతముగా
    అవినీతికి రక్షణ నిడు !
    అవినీతికి సాటి ధర్మ - మవనిన్ గలదే !
    _______________________________

    రిప్లయితొలగించండి
  6. అవినీతికి పరాకాష్ఠైన ఒకానొక ముఖ్య మంత్రి యెన్నికల వేళ
    తన కుమారునికి చేస్తున్న హితబోధ :

    04)
    _______________________________

    అవినీతికి యర్చన నిడు !
    అవినీతిని మచ్చ తేని- యధికారులనే
    అవినీతికి కావలి నిడు !
    అవినీతికి సాటి ధర్మ - మవనిన్ గలదే !
    _______________________________

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని
    వారికి వందన శతకము లొనరించుచు
    -------
    అవినీతి పరులకు జనులు
    భువిలో బట్టమును గట్ట, పుట్టెడి వారల్
    సవినయమున బల్కు నుగా
    నవి నీతికి సాటి ధర్మ మవనిన్ గలదే |

    రిప్లయితొలగించండి
  8. శ్రీ నేమాని గారి, శ్రీ వసంత కిశోర్ గారి పూరణలు అధ్బుతం

    రిప్లయితొలగించండి
  9. అవి నీ తియె జగమంతట

    యవధులు లే లే క యుం డె యాం ధ్రా వనిన్

    వివరణ యిచ్చుట సబబా ?

    య వినీ తికి సాటి ధర్మ మవనిన్ గలదే !

    రిప్లయితొలగించండి
  10. భవసాగరమున మునుగగ
    నవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే!
    భవబంధములను బెంచెడు
    భువనము వీడుట కొఱకయి బుద్ధిని గొనుమా!

    రిప్లయితొలగించండి

  11. సవన శ్రుతిపఠ నర్తధృ
    తి వితర ణాలోభ క్షమ దివ్యతపముల
    ష్టవిధమ్ములు! నీతికిఁ దో
    డవి!! నీతికి సాటి ధర్మ మవనిన్ గలదే?

    రిప్లయితొలగించండి
  12. అయ్యా శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము మంచి మహా సమాసముతో అలరారుచున్నది. ప్రశంసనీయముగా నున్నది. 6వ గణము (2వ పాదము) భగణము వేసేరు. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు. నా సవరించిన పూరణ...

    సవన శ్రుతిపఠ నర్తధృ
    తి వితర ణాలోభ సహన దివ్యతపముల
    ష్టవిధమ్ములు! నీతికిఁ దో
    డవి!! నీతికి సాటి ధర్మ మవనిన్ గలదే?

    -

    రిప్లయితొలగించండి
  14. అవినీతి పరుడు తనను తాను యిలా సమర్థించుకుంటాడు :

    "అవినీతి నేటి పోకడ
    అవినీతే మార్గము గద యందల మెక్కన్ !
    అవినీతే యుగ ధర్మము
    అవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే !"

    రిప్లయితొలగించండి
  15. అవమానము కాదేదన
    భవ నమ్ముల కులుకు దొరల భాగ్యము పండన్ !
    నవయుగ మున ప్రియ మేమన
    అవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే ? !

    రిప్లయితొలగించండి
  16. చవి చూడ నొక్క మారు ప

    దవు లిచ్చెడి గ్రాస తీపి తరమే మరువన్!

    శివ! పదవే చిరునామా

    అవినీతికి, సాటి ధర్మమవనిన్ గలదే!

    రిప్లయితొలగించండి
  17. చవి చూడ నొక్క మారు ప

    దవు లిచ్చెడి గ్రాస తీపి తరమే మరువన్!

    శివ! పదవే చిరునామా

    అవినీతికి, సాటి ధర్మమవనిన్ గలదే!

    రిప్లయితొలగించండి
  18. భువిలో నెల్లరు హారతి
    నవనీతికి బట్టుచుందు రనవరతము, వై
    భవమును బెంచే మిక్కిలి
    అవనీతికి సాటి ధర్మ మవనిన్ గలదే!

    గండూరి లక్ష్మీనారాయణ

    రిప్లయితొలగించండి
  19. పండిత నేమాని వారూ,
    ‘ఇడునవి - నీతికి అన్న’ అన్న విభజన ప్రశంసనీయంగా ఉంది. దక్కని పూరణ.
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ నాలుగు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    1వ పద్యంలో ‘ఇడు + అవిరళము’, 2వ పద్యంలో ‘ఇడును + ఆశల’, 3వ పద్యంలో ‘విస్తరించు + అనవరతము’ అన్నప్పుడు యడాగమం రాదు. వరుసగా ఇడు మవిరలము, ఇచ్చు నాశల, విస్తరింపు మనవరతము’ అని నా సవరణలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘ఘోష + ఇది’ అన్నప్పుడు సంధి లేదు. ‘ఘోష యి/దవినీతి...’ అందాం.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘వారల్’ బహువచనం. పల్కునుగా అని ఏకవచనం వేసారు. ‘పల్కెద రిదె/యవినీతికి’ అని నా సవరణ.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘అంతట + అవధులు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘అంతట నవధులు’ అవుతుంది. రెండవ పాదంలో గణదోషం. ‘నవధులు లేకుండ యుం డె యాం ధ్రా వనిలో’ అందాం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    నీతికి తోడయిన అష్టవిధ తపములను గురించి శబ్దాడంబరంతో మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘అవినీతే’ అనకుండా ‘అవినీతియె’ అనండి.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసార్హం. మొదటి రెండు పాదాల్లో అన్వయం ఇబ్బంది పెడుతున్నది.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మీనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పెంచే’ - పెంచెడి అంటే సరి!

    రిప్లయితొలగించండి


  20. అవురా చోద్యము కుమతులు
    ఎవరేమనుకొన్న నేమి యిచ్చారీతిన్
    సవరింతురు చట్టము దమ
    యవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే.

    రిప్లయితొలగించండి
  21. ముప్పాళ రంగనాయకమ్మ ఉవాచ:

    "చెవులను ముక్కును గోయుచు
    చవకల మరగునను దాగి చంపుచు రిపుల
    న్నవలీలగ సతిని వదలు
    యవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే!"

    రిప్లయితొలగించండి
  22. అవలీలగ కాంచనమును
    ప్రవిమలమగు రాజకీయ రంగము నందున్
    జవురుటయే ధ్యేయమవగ
    నవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే!

    రిప్లయితొలగించండి