5, ఫిబ్రవరి 2014, బుధవారం

సమస్యాపూరణం - 1315 (మానవతీలలామ కభిమానమె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మానవతీలలామ కభిమానమె చాలును చీర యేటికిన్.
(ఇది ప్రసిద్ధమైన సమస్య. ఎన్నో అవధానాలలో ఇవ్వబడినదే. ఇప్పటికే మన బ్లాగులో ఇవ్వలేదు కదా!)

49 కామెంట్‌లు:

 1. ఈ నలిమాక్షి వచ్చె మన యింటికి పెద్ద మనస్సుతోడుతన్
  నేనును సత్కరించితిని నెయ్యము వెల్గగ, మెచ్చె నామెయున్,
  మానవతీ లలామ కభిమానమె చాలును, చీర యేటికిన్?
  కానుక సాటియౌనె? మది గల్గెడు ప్రేమకు నెందునేనియున్

  రిప్లయితొలగించండి
 2. మానక చీర బొట్టు జడ మానిని లక్షల జీతగత్తె కా
  లేనని, మానుటే మనకు లెస్సదనంబని బల్కి, యింక నా
  పానము, బారు జీవనము పంట్లము దారిని బట్టు సాఫ్టువే
  ర్మానవతీలలామ కభిమానమె చాలును చీర యేటికిన్.

  రిప్లయితొలగించండి
 3. సూనులయెన్ త్రిమూర్తులనసూయఁవివస్త్రగ భిక్షనిమ్మనెన్
  వీనులఁజీల్చుకాంక్షవిని భీతినిజెందకనామె వారలం
  గూనలఁజేసిపాలిడెనుకోకనుదీసి మహాపతివ్రతా
  మానవతీలలామకభిమానమెజాలును చీరయేటికిన్|

  సూని = కసాయివాడు (పర్యాయపద నిఘంటువు); సూనులు - దయలేని వారనే అర్థములో

  రిప్లయితొలగించండి
 4. మౌనుల వేషమున్ వెడలి మౌనగు నత్రి సతీమ తల్లితో
  మానిని విన్నవిం చెదము మాదొక నీమము నగ్న మూర్తివై
  బోనము బెట్టు మంచు ముని పుంగవు లెల్లరు ముక్త కంఠ మున్
  మానవతీ లలామ కభి మానమె చాలును చీర యేటికిన్

  రిప్లయితొలగించండి
 5. గానకళాప్రవీణయని ఖ్యాతి వహించిన సుబ్బలక్ష్మికిన్
  ధీనిధి కొక్కమారు బహుదివ్యసుభూషలు, వస్త్రరాశి స
  న్మానములోన గూర్చి రభిమానులు, బాంధవు లెంచిచూడ నా
  మానవతీలలామ కభిమానమెచాలును, చీర(యే)లేటికిన్.

  రిప్లయితొలగించండి

 6. బోనస్సు మైనస్సు అయినది
  మానవతీలలామ కభిమానమె ?
  చాలును చీర యేటికిన్
  వచ్చు ఏటికి కొనిచ్చెదన్ నెక్లేస్సు !


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. కానను సాగుచుండె నొక కన్నియ యొంటరి బాటపట్టి యా
  లోన నెదుర్పడెన్ నడుము లోఁతు ప్రవాహము దాని దాఁటఁగా
  నూనిక పుట్టమున్ తడువకుండఁగ విప్పి తలన్ ధరించు నా
  మానవతీలలామ కభిమానమె చాలును చీర యేటికిన్?

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని వారూ,
  ‘కానుక సాటియౌనె మది గల్గెడు ప్రేమకు’ అన్న మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీ సాఫ్టువేరు లలామ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గూడ రఘురామ్ గారూ,
  త్రిమూర్తులను పసివారిని చేసి చీర లేకుండా వడ్డించిన అనసూయను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  అనసూయ తరువాత అరసున్నా అవసరం లేదు. ‘చెందక యామె’ అనవలసి ఉంది.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
  ‘మౌని + అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘మానక యత్రి సతీమతల్లితో’ అనవచ్చు. ‘మునిపుంగవు లెల్లరు కోర నప్పు డా’ అంటే అన్వయం బాగా కుదురుతుంది.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  ఎమ్మెస్ సుబ్బలక్ష్మి సన్మానం విషయంగా మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
  *
  జిలేబీ గారూ,
  సంతోషం! మీ భావానికి మిత్రులెవరైనా పద్యరూపాన్నిస్తారేమో చూద్దాం. వీలైతే ఈ సాయంత్రం వరకు నేనూ ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి


 9. దీనజనావనా!యనుచు పెక్కువ ద్రౌపది ఆర్తనాదముల్
  వీనుల నందగా నటుల వేగమె వచ్చియు బ్రోవ కాంచినన్
  మానవతీ లలామకభిమానమె చాలును చీర యేటికిన్
  దానవు చేతిలో విడువదంచు మనంబున నమ్మి నిల్చెగా !

  రిప్లయితొలగించండి
 10. మాజేటి సుమలత గారూ,
  అన్వయం కొద్దిగా తికమక పెట్టినా మొత్తానికి మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

  మిత్రుల మధ్య సంభాషణ
  =============*================

  ఘన కీర్తి నొంద,ధెరిసా
  యను మానవతీ లలామకభిమానమె చా
  లును చీర యేటికిని రా?
  మన దేశము నందు నామె మఖమున్ గనరా!

  (మఖము = యజ్జ్ఞము )

  రిప్లయితొలగించండి
 12. జిలేబీ గారి భావముతో పూరణకై ప్రయత్నము.

  మానక జేయుచుండెనొక మాన్యుడు కొల్వును క్రొత్త క్రొత్తగా
  బోనసు లేదు, వచ్చునని ముద్దుల భార్యకు నచ్చజెప్పుచున్
  ఆనక తెచ్చియిత్తునని హారము చీరలు హామి నివ్వగా
  మానవతీలలామ కభిమానమె చాలును చీర యేటికిన్?

  రిప్లయితొలగించండి
 13. వరప్రసాద్ గారూ,
  ఉత్పలమాల పాదాన్ని కందంలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  జిలేబీ గారి భావానికి మీరిచ్చిన పద్యరూపం చాలా బాగుంది. అభినందనలు.
  ‘చెప్పుచున్/ ఆనక’ అని విసంధిగా చెప్పడం కంటె ‘నచ్చజెప్పి తా/ నానక తెచ్చి యిత్తునని...’ అంటే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 14. పూనె కమండలంబు విరబూసిన మోమువిభూతిపాత్రమై
  ధ్యానసమాధియోగపువిధానమునందున పూజచేసెనా
  కాననమందు పార్వతి దిగంబరుకై తను నారవస్త్రమన్
  మానవతీలలమకభిమానమె చాలును చీరయేటికిన్.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  కానలలోన గుంభనముగా చరియించుచు దేశవాసులన్
  గానక వంతెనల్ వివిధ కట్టడముల్ నశియింప నుగ్రత
  న్నూనెడి సంస్థలన్ దునుమ నున్నవి స్త్రీకనుకూలవస్త్రముల్ మానవతీలలామ కభిమానమె చాలును చీయేటికిన్.

  రిప్లయితొలగించండి
 16. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  అపర్ణను ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  నారవస్త్రము, నారచీర అన్నా ఒకటే కదా!
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
  కానీ భావం అవగాహన కాకున్నది.

  రిప్లయితొలగించండి
 17. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
  గారికి వందనములు


  బోనసు వచ్చెనంచు”చెలి బుగ్గను మీటుచు భర్త హారమున్
  కానుకనీయ బల్కెసతి"గానరుఖర్చులు"."చీర చాలదో .
  యీ నగ ఎండుకంచనగ” నింతిని గౌగిలి జేర్చి బల్కె నీ
  మానవతీలలామ కభిమానము చాలును చీర యేటికిన్?

  రిప్లయితొలగించండి
 18. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ సరసంగా ఉండి అలరించింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
  గారికి వందనములు


  మరియొక పూరణ:
  మానత గల్గు
  ధర్మజుడు మాయలజూదమునందు తమ్ములన్
  రాణినియోడ ద్రౌపదిని రచ్చకు నీడ్చి వివస్త్ర జేయగా
  నానతి జేసె కౌరవుడు నాతని తమ్ముడు చీర గుంజి నీ
  మానవతీలలామ కభిమానము చాలును చీర యేటికిన్?

  రిప్లయితొలగించండి

 20. ధర్మరాజు భీమునితో అన్నమాటలు:
  మౌనులు గ్రుడ్డివారు పశుమాత్రులు నిండిన చోట యున్న యి
  మ్మానవతీలలామ కభిమానమె చాలును చీరయేటికిన్?
  ఆనిల! కృష్ణభక్తిమహిమాంబరధారిణి యాజ్ఞసేనికిన్!
  యేనును నీవు తమ్ములు సహింప జయింతుము ధర్మరంగమున్!

  రిప్లయితొలగించండి
 21. శ్రీమతి మాజేటి సుమలత గారు! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. ఒక సూచన: 1వ పాదములో యతి మైత్రి పాటింపబడ లేదు. సవరించవలెను. స్వస్తి.

  శ్రీ ఆదిత్య గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సూచనలు:
  1. చోట + ఉన్న = నుగాగమము వలన చోట నున్న అగును.
  2. యాజ్ఞసేనికిన్ తరువాత "యేనును" అని యడాగమము రాదు.
  3. జయింతును ధర్మరంగమున్ : అన్వయము సరిగా లేదు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 22. శ్రీ కంది శంకరయ్య గారి కన్నియ ఒంటరిగా కానలలో సాగుచుండుట సమస్యా పూరణమునకు ఒక మంచి మార్గ మయినది. పద్యము బాగుగ నున్నది.
  అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 23. శ్రీ రఘురాం గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. ఒక సూచన: త్రిమూర్తులు అనుట బహువచనము కదా -- సూనులయెన్ మరియు భిక్ష నిమ్మనెన్ అనుట ఏకవచన ప్రయోగములగుచున్నవి. పరిశీలించి సరిచేయండి. స్వస్తి.

  శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. దిగంబరుకై అనుట సాధువు కాదు. దిగంబరునకై అనుట బాగుగ నుండును. స్వస్తి.

  శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. వివిధ కట్టడములు అను సమాసము సాధువు కాదు. పరిశీలించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 24. కవి మిత్రుల పూరణలు కమనీయంగా ఉన్నాయి.

  దుర్యోధనుడు ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో:

  రానని యేకవస్త్ర నని రాణి నటంచును హుంకరించెనా
  యీ నయవంచకిం గనుడు యేవురు భర్తల గల్గి సాధ్వియా
  బానిస పత్నికిన్ పొగరె వల్వల దీయుము వేగ సోదరా
  మానవతీలలామ కభిమానమె చాలును చీర యేటికిన్.

  రిప్లయితొలగించండి
 25. ఈ నిశి దీపమేల నిక నిందుముఖీ! చిరునవ్వు లుండగా
  నూనము మల్లె లేమిటికి? నొచ్చును నీ తను వేల భూషణాల్?
  వీనుల విందు నీ గళము వీణ యదేటికి? విన్ము ప్రేయసీ!
  మానవతీలలామ కభిమానమె చాలును చీర యేటికిన్?

  రిప్లయితొలగించండి
 26. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్కారములు, పద్యమును సవరించనందులకు ధన్యవాదములు, మీరు సూచించిన సవరణతో..

  మానక జేయుచుండెనొక మాన్యుడు కొల్వును క్రొత్త క్రొత్తగా
  బోనసు లేదు, వచ్చునని ముద్దుల భార్యకు నచ్చజెప్పి తా
  నానక తెచ్చియిత్తునని హారము చీరలు హామి నివ్వగా
  మానవతీలలామ కభిమానమె చాలును చీర యేటికిన్?

  రిప్లయితొలగించండి
 27. నేమానివారికి ధన్యవాదాలు.
  మీసూచనలు శిరోధార్యాలు.
  సహింప జయింతుము ధర్మరంగమున్ - నా భావన సహనంతో ఉంటే ధర్మక్షేత్రము నందు గెలుస్తాము. (శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువులో రంగము అనగా ప్రదేశము, స్థలము అని అర్థం ఉన్నాది.) ఇక్కడ ధర్మానికి సంబంధించినంతవరకూ మనకు తిరుగుండదు అని అర్థం రావాలని వేసాను.
  ' ఇప్పుడు సహనంగా ఉంటే ధర్మయుద్ధంలో మనకు జయంకలుగుతుంది ' అని ఇంకో అర్థం కూడా రావాలని అనుకున్నా. (రంగము అనగా యుద్ధభూమి అని కూడా అర్థం ఉన్నాది కనుక)
  జయించెదము అనడానికి జయింతుము అని వేసుకొనవచ్చునా.. తెలుపగలరు.

  రిప్లయితొలగించండి
 28. మానవతన్న పేర సినిమాలలొ పెద్దగ పేరు బొందెగా
  ఆ నళినాక్షి చిత్రముల నారగబోయగ నందమంతయున్
  వేనకువేలు లక్షలుగ వెంటనెనుండభిమానులెందరో
  మానవతీ లలామ కభిమానమె చాలును, చీర యేటికిన్.

  రిప్లయితొలగించండి
 29. మాజేటి సుమలత గారూ,
  మీ పద్యంలో మొదటి పాదాన్ని ‘దీనజనావనా యని నుతించెడి ద్రౌపది...’ అంటే యతిదోషం తొలగిపోతుంది.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రాణిని + ఓడ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘రాణినె యోడ’ అందాం.
  మూడవ పాదంలో ‘...తమ్ము డిటుల్ వచించె నీ...’ అంటే బాగుంటుంది.
  *
  ఆదిత్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  నా పూరణ మీకు నచ్చినందుకు ధన్యుడను. ధన్యవాదాలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నవి. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. శ్రీ ఆదిత్య గారికి శుభాశీస్సులు.
  మీ వివరణ చూచితిని. మీ పద్యములో 4వ పాదమును ఇలాగ మార్చినచో బాగుగ నుండును:
  "పూనిన నోర్పు సత్ఫలము పొందెద మొప్పుగ ధర్మ రక్షతో"
  స్వస్తి.

  రిప్లయితొలగించండి

 31. పూజ్యులుగురుదేవులు శ్రీ శంకరయ్య గారికి
  వందనములు
  మీరు సూచించిన సవరణలకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 32. శ్రీ శంకరయ్య గారి వ్యాఖ్యకు నా సమాధానం

  ఉగ్రవాదాన్ని అణచ డానికి అహోరాత్రులు శ్రమించుచున్న ప్రత్యేక రక్షక భట వర్గము లోని స్త్రీ ఉద్యోగులు ధరించుటకు అనుకూల మైన దుస్తులు
  చీరలు కావు కదా ! అవి ఏకరూప దుస్తులు (యూనిఫారం).ఆ దుస్తులు ధరించిన స్త్రీ ఉద్యోగి భావవ్యక్తీకరణ నా పద్యంలో తెలిపాను .

  రిప్లయితొలగించండి
 33. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ వివరణ చూసి మళ్ళీ ఒకసారి పద్యాన్ని చదివితే అంతా సుబోధమయింది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 34. నేమానివారికి ధన్యవాదాలు.
  మీసూచనలు శిరోధార్యాలు.
  శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్కారములు, పద్యమును సవరించనందులకు ధన్యవాదములు, మీరు సూచించిన సవరణతో..

  దీనజనావనా యని నుతించెడి ద్రౌపది ఆర్తనాదముల్
  వీనుల నందగా నటుల వేగమె వచ్చియు బ్రోవ కాంచినన్
  మానవతీ లలామకభిమానమె చాలును చీర యేటికిన్
  దానవు చేతిలో విడువదంచు మనంబున నమ్మి నిల్చెగా !
  నేను ఇంకొక రకంగా, పెక్కువ కాకుండ దిక్కుల అందామనుకున్నను. కానీ మీ సవరణ బాగుంది.

  రిప్లయితొలగించండి
 35. కానల జీవితమ్ము యణగారిన వర్గము వన్యసంపదల్
  తేనెల నాదిగా బడయ తీరదె యాకలి! దారపై సదా
  మానసమందునింపి యభి మానముఁజూపగ,మాటిమాటికిన్
  మానవతీ లలామకభిమానమె చాలును చీర యేటికిన్

  రిప్లయితొలగించండి
 36. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘జీవితమ్ము + అణగారిన’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘జీవితమ్ము నణగారిన’ అంటే సరి.

  రిప్లయితొలగించండి
 37. కానన మందునన్ తిరుగుకన్యనుగాంచి, ముదంబు గల్గగా
  మానస మామెనే తలచ మానము నాకుల కప్పినట్టి ఆ
  మానిని జేకొనన్ మదను మార్గణ తాపున ఇచ్చపుట్టె ఆ
  మానవతీలలామ కభిమానమె చాలును చీర యేటికిన్

  గురువు గారికి నమస్సులు. నామొదటి ప్రయత్నం కావున నాతప్పులను క్షమించి సరిదిద్దవలసిందిగా కోరుచున్నాను

  రిప్లయితొలగించండి
 38. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మొదటి ప్రయత్నమైనా వృత్తాన్ని చక్కగా నడిపించారు. పూరణ బాగుంది. అభినందనలు.
  ‘మార్గణ తాపున’ అన్న సమాసమొక్కటే దోషం. అక్కడ ‘మదన మంజుల కేళికి నిచ్చపుట్టె’ అనండి. బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 39. Timmaji Rao Kambai గారూ మీ పూరణ

  బోనసు వచ్చెనంచు”చెలి బుగ్గను మీటుచు భర్త హారమున్
  కానుకనీయ బల్కెసతి"గానరుఖర్చులు"."చీర చాలదో .

  సున్నితంగా చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 40. Annapareddy satyanarayana reddy గారూ మీ పూరణ

  కానన మందునన్ తిరుగుకన్యనుగాంచి, ముదంబు గల్గగా
  మానస మామెనే తలచ మానము నాకుల కప్పినట్టి ఆ

  శ్లాఘనీయం మొదటి ప్రయత్నం చాలా చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి

 41. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

  సవరణతో నా పూరణ:

  కానల జీవితమ్ము నణగారిన వర్గము వన్యసంపదల్
  తేనెల నాదిగా బడయ తీరదె యాకలి! దారపై సదా
  మానసమందునింపి యభిమానముఁ జూపగ ,మాటిమాటికిన్
  మానవతీ లలామకభిమానమె చాలును చీర యేటికిన్  రిప్లయితొలగించండి
 42. మేనక నూర్వశిన్ పొగిడి మెండుగ గారము మీర మెచ్చగా...
  చాన ప్రియంక చోపరను చల్లగ చూడగ చిత్రమందునన్
  జీనుసు టాపునున్ తొడిగి చిన్నది కుక్కను తోలుచుండెడిన్
  మానవతీలలామ కభిమానమె చాలును చీర యేటికిన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. https://www.google.co.in/search?q=priyanka+chopra+in+jeans&client=safari&channel=iphone_bm&prmd=inv&source=lnms&tbm=isch&sa=X&ved=2ahUKEwiQ2OTg3O7kAhW64XMBHTgwDcMQ_AUoAXoECA0QAQ&biw=375&bih=549#imgrc=spQ6Dr71DWI6DM

   తొలగించండి

  2. Search criteria priyanka chopra jeans అని కొడ్తే అట్లాగే ఫోటోవస్తుందండి కొంత మార్చి priyanka chopra saree అని కొట్టి చూడండి :)   జిలేబి

   తొలగించండి


 43. బోనసెప్పటికి వచ్చేను :)


  పూనిక చేసినాడ సఖి! పువ్విలు తాకగ బోనసివ్వగా
  నేనిక సేల నీకు కొని నేరుగ తెచ్చెద వేచి వుండవే
  జాను! జిలేబి ! కంజముఖి! చాన !తలోదరి!తోయజాక్షి! ఓ
  మానవతీ! లలామ కభిమానమె చాలును చీర యేటికిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి