15, ఫిబ్రవరి 2014, శనివారం

సమస్యాపూరణం - 1324 (దుష్టాచారములె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దుష్టాచారములె ముక్తి దొరకొనఁ జేయున్.

22 కామెంట్‌లు:

 1. కష్టములు కలుగజేయును
  దుష్టాచారములె, ముక్తి దొరకొన జేయున్
  శిష్టాచారము లూనుచు
  నిష్టంబుగ చేయుపూజ లిమ్మహిలోనన్.

  రిప్లయితొలగించండి
 2. నిష్టగ దేవుని కొలిచిన
  కష్టము బ్రతుకంగ జనులు కలియుగ మందున్
  దుష్టులు నిండిన జగతిని
  దుస్టా చారములె ముక్తి దొరకొన జేయన్

  రిప్లయితొలగించండి
 3. నష్టములుకలుగ జేయును
  దుష్టాచారములె, ముక్తి దొరకొన జేయున్
  నిష్టగ హరినే గొలువగ
  కష్టములన్నవి గలుగవు కలియుగ మందున్

  రిప్లయితొలగించండి
 4. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  శిష్టాచార్యుల కిడుముల
  సృష్టించిన దుష్టజనులు చేర నరకమున్
  కష్టమ్మది నమ్మి జనుట
  దుష్టాచారములె ముక్తి దొరకొనఁ జేయున్.

  రిప్లయితొలగించండి
 5. భ్రష్టునిగ జేయబోవును
  దుష్టాచారములె, ముక్తి దొరకునఁ జేయున్
  శిష్టాచార సమూహము,
  స్పష్టము జేయంగనేర్తు పండితవర్యా!

  రిప్లయితొలగించండి
 6. కష్టముల బాలు జేయును
  దుష్టా చారములె , ముక్తి దొరకొన జేయు
  న్న ష్ట మ గర్భుని గృష్ణుని
  నిష్ఠ త తోపూ జసేయ నీ భువి లోనన్

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  శిష్టుల బాధించిననూ
  దుష్టాత్ములు రావణుండు దుర్యోధనుడున్
  తుష్టిగ దివి కేగిరి గద
  దుష్టాచారములె ముక్తి దొరకొన జేయున్!?

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  ==============*====================
  దుష్టుల లోకము నందున
  దుష్టాచారములె,ముక్తి దొరకొన జేయున్
  శిష్టులకు స్ధాన మన్నది
  కష్టము,కరుణాల వాల!క్రాంతికుమారా!

  రిప్లయితొలగించండి
 9. కష్టములను పెంచును గద
  దుష్టాచారములె! ముక్తి దొరకొన జేయ
  న్నిష్టముగను హరి సేవన
  మష్టవిధమ్ముల జేయుటనది మార్గంబౌ!

  శిష్టాచారము లేకయు
  కష్టాలను కోరినట్లు. గావున మనమం
  దిష్టమున దలపరాదిట!
  “దుష్టాచారములె ముక్తి దొరకొన జేయన్.”

  దుష్టులనిట శిక్షించుట
  శిష్టులనందరిని రక్ష జేయుట ధర్మ
  మ్మిష్టవిధి పలుకనేలనె!
  “దుష్టాచారములె ముక్తి దొరకొన జేయన్.”

  రిప్లయితొలగించండి
 10. కష్టములు దెచ్చు జేసిన
  దుష్టాచారములె, ముక్తి దొరకొనజేయున్
  శిష్టాచారముల నడచి
  నిష్ఠించు మనమున శివుని నిరతము గొల్వన్

  రిప్లయితొలగించండి
 11. దుష్టుండగు రాక్షసుడే
  మాస్టరుగా జేరి జెప్పె మరి శిష్యునికే
  శిష్టులు భువిలో సలిపెడి
  దుష్టాచారములె ముక్తి దొరకొనజేయున్

  రిప్లయితొలగించండి
 12. శిష్టాచారముల సతత
  మిష్టాపూర్వకముఁ జేయ హృద్యంబౌ; నే
  కష్టమ్మెదురయినన్ విడు
  దుష్టాచారములె; ముక్తి దొరకొనఁ జేయున్.

  రిప్లయితొలగించండి
 13. హరి వేంకటసత్యనారాయణ మూర్తి గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘నిష్ఠ’ను నిష్ట అన్నారు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. నాల్గవ పాదంలో ప్రాస తప్పింది.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘బాధించిననూ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. అక్కడ ‘బాధించిన యా’ అందాం.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మారెళ్ళ వామన కుమార్ గారూ,
  మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  చివరిపాదంలో ప్రాస తప్పింది.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరిచ్చిన సలహాకు కృతజ్ఞతలు. మార్చిన పద్యము పంపుచున్నాను.
  క: కష్టములు దెచ్చు జేసిన
  దుష్టాచారములె, ముక్తి దొరకొనజేయున్
  శిష్టాచారముల నడచి
  నిష్ఠగ మదిలోన శివుని నిరతము గొల్వన్

  రిప్లయితొలగించండి
 15. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని గురుదేవులకు నమస్కృతులు......
  దయచేసి భావ, గణదోషములను సవరించ మనవి..

  కష్టములపాలు జేయును
  దుప్టాచారములె, ముక్తిదొరకొన జేయున్
  ఇష్టముగ శివుని మనమున
  శిష్టాచారమున దలచి శివశివ యనగన్.

  రిప్లయితొలగించండి
 16. కుసుమ సుదర్శన్ గారూ,
  మీ పూరణ బాగున్నాది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. క్లిష్టమ్ముల దప్పించు
  న్నిష్టముతో కష్టమనక నియమమ్ములతో
  తుష్టిని కలిగించెడి ని
  ర్దుష్టాచారములె ముక్తి దొరకొనఁ జేయున్

  రిప్లయితొలగించండి


 18. కష్టపడనేల పిరియపు
  సాష్టాంగముల వి భుని గొలుచన్ చక్కగ, నీ
  నిష్టయె జిలేబి, కాదోయ్
  దుష్టాచారములె, ముక్తి దొరకొనఁ జేయున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి