11, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెవికీ ఆహ్వానం


తెలుగు వికీపీడియా డిసెంబర్ 10, 2013న పది వసంతాలు పూర్తి చేసుకున్నదని అందరికీ విదితమే. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు వికీపీడియనులను ఒక వేదిక మీదకు తెచ్చి సత్కరించాలనే సంకల్పంతో తెలుగు వికీపీడియా క్రియాశీల సభ్యులు, వికీమీడియా భారతదేశ చాప్టర్, తెలుగు వికీపీడియా విశేష అభివృద్ధి జట్టు మరియు సీఐఎస్-ఏ2కే సంయుక్తంగా దశాబ్ది వేడుకలను విజయవాడలో నిర్వహించనున్నారు. 
ఈ వేడుకలు 2014 ఫిబ్రవరి 15 మరియు 16 తేదీలలో విజయవాడలోని కేబీయన్ కళాశాల ప్రాంగణంలో జరుగనున్నాయి. 
అందరికీ ఇదే మా ఆ
హ్వానం. 
దయచేసి మీకు తెలిసిన తెలుగు మిత్రులకు , తెలుగు భాషా ప్రేమికులకు లను తెవికీ దశాబ్ది ఉత్సవాల గురించి తెలియ చేయడి. 
ఈ వేడుకలలో భాగంగా, తెలుగు వికీపీడియాను ఉపయోగించుకోవడం, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన రెండు రోజుల సదస్సును నిర్వహిస్తున్నాం. తెలుగు వికీపీడియాలోని విశేష వ్యాసాలతో కూడిన సీడీని కూడా ఈ సందర్భంగా పంపిణీ చేస్తున్నాం. తెలుగులో అపూర్వ విజ్ఞాన సంపదను సేకరించే ఈ మహా ప్రయత్నంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాముల్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగు వికీపీడియా మరియు సోదర వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేసిన సభ్యులకు, ఆదరించి, ప్రోత్సహించిన సమాజంలోని వ్యక్తులు, సంస్థలందరికి వికీపీడియా దశాబ్ది సందర్భంగా ధన్యవాదాలు. తెవికీ విజ్ఞానగనిలా విలసిల్లి ప్రతి ఒక్కరికి విజ్ఞానాన్ని పంచుతూ, ప్రతి ఒక్కరి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందాలని కోరిక. 

పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశం లోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ దశాబ్ది మహోత్సవాలను సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

అందరం ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఆశిస్తున్నాము
అందరికీ ఆహ్వానం

ఇట్లు
తెవికీ దశాబ్ది కార్యవర్గం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి