20, ఫిబ్రవరి 2014, గురువారం

శ్రీ లలితా స్తుతిశ్రీ లలితా స్తుతి
రచన

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

 ఇంద్రవజ్ర

శ్రీమాతృ మూర్తిం లలితాం నమామి

శ్రీమన్మహేశీం లలితాం నమామి

శ్రీం బీజ వాచ్యాం లలితాం నమామి

శ్రీచక్ర సంస్థాం లలితాం నమామివేదస్వరూపాం లలితాం నమామి

వేదాంతవేద్యాం లలితాం నమామి

నాదప్రియాం శ్రీ లలితాం నమామి

మోదప్రదాం శ్రీ లలితాం నమామిలోకాధినేత్రీం లలితాం నమామి

నాకేశవంద్యాం లలితాం నమామి

రాకేందువక్త్రాం లలితాం నమామి

శ్రీకల్ప వల్లీం లలితాం నమామికామేశపత్నీం లలితాం నమామి

సోమార్క నేత్రాం లలితాం నమామి

ప్రేమస్వరూపాం లలితాం నమామి

కామప్రదాత్రీం లలితాం నమామిఉపేంద్రవజ్ర

పరాం పరేశీం లలితాం నమామి

సరోజనేత్రాం లలితాం నమామి

పురత్రయేశీం లలితాం నమామి

స్మరప్రపూజ్యాం లలితాం నమామిసదాశివేశీం లలితాం నమామి

హృదంబుజస్థాం లలితాం నమామి

సదా ప్రసన్నాం లలితాం నమామి

చిదగ్నిజాతాం లలితాం నమామిఇంద్రవజ్ర

స్మేరాననాం శ్రీ లలితాం నమామి

కారుణ్య మూర్తిం లలితాం నమామి

నీరేజనేత్రాం లలితాం నమామి

గౌరీం భవానీం లలితాం నమామిదేవీం మదంబాం లలితాం నమామి

భావాభిరామాం లలితాం నమామి

సౌవర్ణ గాత్రీం లలితాం నమామి

దేవేంద్ర వంద్యాం లలితాం నమామిశ్రీమాతృ మూర్తిం లలితాం నమామి

శ్రీమాతృ మూర్తిం మనసా స్మరామి

శ్రీమాతృ మూర్తిం సతతం భజామి

శ్రీమాతృ పాదౌ శరణం వ్రజామి

12 కామెంట్‌లు:

 1. చక్కని లలితా స్తుతి నందించిన శ్రీ నేమాని వారికి నమస్సులు.

  రిప్లయితొలగించండి
 2. అధ్బుత మైన లలితా స్తుతి నందించిన శ్రీ నేమాని గురుదేవులకు నమస్సులు.

  రిప్లయితొలగించండి
 3. చాలా బాగుంది గురువుగారు లలితాస్తుతి, ..ధన్యవాదములు..

  రిప్లయితొలగించండి
 4. స్తోత్ర మయ్యది వ్రాసిన సుగుణు డతడు
  వరల నేమాని వంశపు వారసుండు
  రామ జోగయ్య నామము రమ్య మలరి
  ధరను వెలుగొందు నెప్పుడు ధార్మికుడుగ

  రిప్లయితొలగించండి
 5. శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

  రామ రసమ్మును ద్రాగిన
  నేమాని గురువులు నేడు నెమ్మది తోడన్
  పామర తతి బాడుటకై
  కోమల లలితాంబ స్తుతిని కువలయమునకున్

  పొంక మలర నిడిరి గనుడు,
  శంకలు వీడి జదువంగ సద్గుణములతో,
  శాంకరి సంపదల నిడును,
  పొంక మలరగ నిరతమ్ము పూజలు జేయన్!

  రిప్లయితొలగించండి
 6. మా లలితా స్తుతిని ప్రకటించిన శ్రీ కంది శంకరయ్య గారికి
  దానిని గురించి స్పందనను తెలియజేసిన మిత్రులు
  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
  శ్రీ వరప్రసాద్ గారికి
  శ్రీమతి శైలజ గారికి, మరియు
  శ్రీ సుబ్బా రావు గారికి
  మా సంతోషము తెలియజేయు చున్నాము. స్వస్తి

  రిప్లయితొలగించండి
 7. నమస్కారములు
  లలితా దేవి స్తుతిని అందించిన పూజ్య గురువులకు ప్రణామములు

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని వారూ,
  అప్పుడప్పుడు మీ రందించే స్తుతి కవిత్వం మిత్రులను ఆనందపరుస్తున్నది. అందుకు నా బ్లాగు వేదిక అవుతున్నందుకు నాకు సంతోషంగానూ, కించిద్గర్వంగానూ ఉన్నది. కృతజ్ఞతాభివందనాలు.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ లలితాంబ వారి స్తోత్రము ప్రతి దినము చదువుకుందుకు చాలా బాగుంది. అన్నయ్యగారి స్తోత్రాలన్నీ అద్భుతముగా ఉంటాయి. వారికి నమస్సులు.

  రిప్లయితొలగించండి
 10. ఆర్యా!
  నమస్కారములు, శ్రీ లలితాస్తుతి అత్యద్భుతముగా నున్నది.

  లలితాసంస్తవ మియ్యది
  యిలవారల కఘము ద్రుంచి యిహపరసుఖముల్
  కలిగించెడి యౌషధమ
  ట్లలరుచు నున్నది కవివర! యభివాదంబుల్.

  రిప్లయితొలగించండి
 11. సహృదయముగ స్పందించిన మిత్రులు --
  శ్రీమతి రాజేశ్వరి గారికి
  తమ్ముడు చి. డా. నరసింహమూర్తికి, మరియు
  శ్రీ హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి
  శుభాశీస్సులు - చాల సంతోషము.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ లలితాం భజామ్యహం.

  నేమాని పండితార్యా! విదేశాల్లో ఉన్నా సమయాన్ని సద్వినియోగం చేసుకొంటున్నారు. నమోనమః.

  రిప్లయితొలగించండి