పండిత నేమాని వారూ, అర్ధనారీశ్వర తత్త్వాన్ని వివరిస్తున్న మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మంచి ప్రయత్నం. అభినందనలు. మూడవ పాదంలో గణదోషం, నాల్గవ పాదంలో యతిదోషం. ఆ రెండు పాదాలకు నా సవరణ..... బంధముల జిక్కి మఱచిన యంధుడనై బ్రతుకుచుంటి నాదుకొను మయా. * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. రెండవ పాదంలో (తతోజ - సరిగణంగా జగణం) గణదోషం. జటాధారి లేదా జడదారి అనవలసింది. ఆ పాదానికి నా సవరణ... “నగసుతతోడ జడదారి నవ్వుచు వచ్చెన్"
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటి పద్యం ఆరు పాదాలుగా ఉన్నది. ఆటవెలదికి ఆ సౌకర్యం లేదు. నేను రెండు పాదాలను చేర్చుతున్నాను. కొన్ని టైపాట్ల సవరణలతో మీ పద్యాలు.....
శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు. మీ ప్రశంసలకు మా సంతోషము. వాగర్థ స్వరూపులగు ఆది దంపతులను తలచుకొంటే పద్యములే కరవా? అందముగా అవే వస్తాయి. ఇంకా మీ పద్యము రాలేదని చూచుచున్నాను. స్వస్తి.
శ్రీ వోలేటి వారు: శుభాశీస్సులు. మీకు పద్యము వ్రాయుట తెలియదన్నారు. తెలుసుకొనవలెనను ఆసక్తి ఉంటే అదే వస్తుంది. మీలాగ అన్న వాళ్ళెందరో మా శంకరయ్య గారి బ్లాగులో చేరి చక్కగా పద్యములు వ్రాయుట నేర్చుకొన్నారు. మీరును మొదలు పెట్టండి. మా సహకారము, సూచనలు ఎప్పుడూ ఉంటాయి. స్వస్తి.
శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు. శివ శక్తులలో ఎవరు శబ్దమో ఎవరు అర్థమో విడదీసి చెప్పలేము. ఇద్దరూ ఇద్దరే. వాక్కు శక్తియే కదా. మరి శక్తిని అర్థము అనగలమా? వారిద్దరును అక్షర స్వరూపులే. అందుకే లలితా సహస్రనామములలో చివర శ్రీ శివా శివ శక్త్యైక రూపిణీ లలితాంబికా అన్నారు. శివ శక్తులది ఒకటే రూపము. ఈ విషయములు మీకు తెలియనివి కావు - ఏదో చాపల్యముచేత చెప్పేను. స్వస్తి.
మొదటి పద్యమే చక్కని పోలికలతో అర్ధనారీశ్వర రూప వర్ణన అందంగా అమరింది. శైలజ గారి పద్యము నచ్చినది. గోలి హనుమచ్చాస్త్రి గారు నలుపు తెలుపు, కారుచిచ్చులు, కరుణ వంటి వర్ణనలను బాగా కూర్చినారు. మిస్సన్న గారు పండితుల వారి వర్ణనలోని అందాన్ని, శాస్త్రిగారి మెలికల తళుకులను తమ పద్యములో చూపించినారు.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. తెలిపేటి - అనుట బాగులేదు -- తెల్పెడు అందాము. నిండార భక్తి మా మదిని జేర - అను పాద భాగములో యతి లేదు. స్వస్తి.
పండిత నేమాని వారూ, వోలేటి వారి భావానికి అందమైన పద్యరూపాన్నిచ్చారు. అలాగే మిత్రుల పద్యాలలోని దోషాలను, నివారణామార్గాలను చూపుతున్నారు. ధన్యవాదాలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మిత్రుల పద్యాలను ప్రశంసించినందుకు ధన్యవాదాలు. ఇటువంటి ప్రశంసలే రచనోత్సాహాన్ని పెంపొందింపజేస్తాయి. మీ సీసపద్యం బాగుంది. అభినందనలు. నేమాని వారి సూచనలను గమనించారా?
జ్ఞాన వైరాగ్య నిధానుడౌ శివుడును
రిప్లయితొలగించండి....కరుణామృతాక్షియౌ గిరితనయయు
శూలాయుధము దాల్చు సోమశేఖరుడును
....నగుమోముతో నొప్పు నగతనయయు
సర్పహారము గల్గు సర్వేశ్వరుండును
....స్వర్ణహారములొప్పు శైలజయును
ధవళతరాంగుడై తనరారు హరుడును
....శ్యామలగాత్రియై యలరు నార్య
చర్మవసనుడై చెలువొందు శంకరుండు
పట్టు చీరెను గట్టిన పర్వతసుత
వృషభ సింహాలు సేవింప వేడ్క నొందు
విశ్వగురులకు ప్రణతులు వేనవేలు
బంధించె సగము పార్వతి
రిప్లయితొలగించండిబంధుర ముగచుట్టె మృగము భక్తిని గొలువన్
బంధన ములచిక్కి మరచిన
యంధుడ నైబ్రతుకు చుంటి మన్నించు ప్రభూ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమగువను సగమున దాల్చియు
రిప్లయితొలగించండినగజాతతోజటధారి నగవుచు వచ్చెన్
మృగపతి వృషభము గొలువగ
జగములనేలెడు ప్రభుగని జన్మతరించెన్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఅర్ధనారీశ్వర తత్త్వాన్ని వివరిస్తున్న మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మంచి ప్రయత్నం. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం, నాల్గవ పాదంలో యతిదోషం. ఆ రెండు పాదాలకు నా సవరణ.....
బంధముల జిక్కి మఱచిన
యంధుడనై బ్రతుకుచుంటి నాదుకొను మయా.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో (తతోజ - సరిగణంగా జగణం) గణదోషం. జటాధారి లేదా జడదారి అనవలసింది. ఆ పాదానికి నా సవరణ...
“నగసుతతోడ జడదారి నవ్వుచు వచ్చెన్"
నాగుబాములిచట నగలేమొకలవఛట
రిప్లయితొలగించండితెల్లనొడలిచట నల్లదచట
గట్టిచర్మమిచట పట్టుపుట్టములట
కారుచిచ్చులిచట కరుణయచట
చేరెనెద్దిచ్చట సింగగర్జనలట
భిక్షమిచటనన్న రక్షణచట
అచటనిచటి రెండు నచ్చముగ నొకటాయె
నాదిదంపతులుగ నమరిపోయె
భిన్నమైన జగతి భీతిల్ల పనిలేదు
స్తవముజేయ గలుగు శివము,శక్తి.
నేమాని పండితార్యా! అర్థనారీశ్వరుని అందంగా ఆవిష్కరించారు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యం ఆరు పాదాలుగా ఉన్నది. ఆటవెలదికి ఆ సౌకర్యం లేదు. నేను రెండు పాదాలను చేర్చుతున్నాను. కొన్ని టైపాట్ల సవరణలతో మీ పద్యాలు.....
నాగుబాములిచట నగల తళ్కు లచట
తెల్లని యొడ లిచట నల్లదచట
గట్టిచర్మమిచట పట్టుపుట్ట మచట
కారుచిచ్చులిచట కరుణ యచట.
చేరె నిచట నెద్దు సింగగర్జన లట
భిక్షమిచటనన్న రక్షణ యట
బూదిపూత లిచట పూనూనె లచ్చట
ప్రమథగణము లిచట ప్రమద మచట.
అచటనిచటి రెండు నచ్చము నొకటాయె
నాదిదంపతులుగ నమరిపోయె
భిన్నమైన జగతి భీతిల్ల పనిలేదు
స్తవముజేయ గలుగు శివము, శక్తి.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిఅర్ధనారీశ్వర తత్త్వాన్ని వివరించే చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
గురువులకు నమస్కారము..నాకు పద్యములు రాయుట తెలియదు..కాని నా భావమును క్రింద రాసాను..సరిచేసి పద్యరూపాన పెట్టిన సంతొషించెదను..
రిప్లయితొలగించండిఅనురాగ దాంపత్యము నకునర్ధము అర్ధనారీశ్వరం..
అర్ధము గానక అర్ధము పర్ధము లేని
సంవాదనలతో కీచులాడు జంటలు నేడు
విభజించు కాపురాన సంతులనాధలెయ్యిరి..
శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ ప్రశంసలకు మా సంతోషము.
వాగర్థ స్వరూపులగు ఆది దంపతులను తలచుకొంటే పద్యములే కరవా? అందముగా అవే వస్తాయి. ఇంకా మీ పద్యము రాలేదని చూచుచున్నాను. స్వస్తి.
నేమాని పండితార్యా! లెస్స బలికితిరి. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ ఆశీస్సులతో నా ప్రయత్నం:
నీల గళుం డును నీల కుంతల ధారి
చంద్ర శేఖరుడును చంద్ర వదన
సర్పాభరణుడును సర్వభూషోజ్జ్వల
సర్వ లోకేశుడు సర్వ మాత
అరుణోగ్ర నేత్రుండు కరుణాంతరంగయు
గజచర్మ వసనుండు గజ గమనయు
ఉక్ష వాహనుడు హర్యక్ష వాహనయును
గిరి నిలయుండును గిరివరసుత
శివుడు జగతికి తండ్రియౌ శివయె తల్లి
శివుడు శబ్దంబు నర్థమౌ శివయె దెలియ
శివుడు హర్తయౌ త్రాతయో శివయె సుమ్ము
శివుడు శివకు నభేదమ్ము చింత జేయ.
శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఅద్భుతమైన పద్యమును ఆవిష్కరించేరు. అభినందనలు.
మొదటి పాదములో "నీలకుంతలధారి" .. స్త్రీలింగము కాదు. కొంచెము మార్చవలె ననుకొంటాను. నీల సుందర వేణి అందామా?
స్వస్తి.
శ్రీ వోలేటి వారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీకు పద్యము వ్రాయుట తెలియదన్నారు. తెలుసుకొనవలెనను ఆసక్తి ఉంటే అదే వస్తుంది. మీలాగ అన్న వాళ్ళెందరో మా శంకరయ్య గారి బ్లాగులో చేరి చక్కగా పద్యములు వ్రాయుట నేర్చుకొన్నారు. మీరును మొదలు పెట్టండి. మా సహకారము, సూచనలు ఎప్పుడూ ఉంటాయి. స్వస్తి.
వోలేటి వారూ,
రిప్లయితొలగించండిసంతోషం! పండిత నేమాని వారి సలహాను పాటించండి. స్వస్తి!
మీ భావానికి నాకు సాధ్యమైనంతలో పద్యరూపాన్ని ఇచ్చాను...
అర్ధనారీశ్వరత్వ స్థూలార్థ మెఱుఁగ
లేక యన్యోన్యదాంపత్యమే కఱ వయి
యనవరతము పోట్లాడి విడాకులు గొన
నవసమాజపు పిల్ల లనాథులైరి.
*
మిస్సన్న గారూ,
అద్భుతమైన మీ సీసపద్యం అలరించింది. అభినందనలు, ధన్యవాదాలు.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిసాంబశివునిపై మీ పద్యం బాగుంది. అభినందనలు.
నేమాని పండితార్యా! మీ సూచన సర్వదా శిరోధార్యము. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువుగారూ ధన్యవాదములు.
తప్పు దిద్దిన తర్వాత:
రిప్లయితొలగించండినీలగళుండును నీలకుంతలవేణి
.........చంద్రశేఖరుడును చంద్రవదన
సర్పాభరణుడును సర్వభూషోజ్జ్వల
.........సర్వలోకేశుడు సర్వమాత
అరుణోగ్రనేత్రుండు కరుణాంతరంగయు
.........గజచర్మవసనుండు గజగమనయు
ఉక్షవాహనుడు హర్యక్షవాహనయును
.........గిరినిలయుండును గిరివరసుత
శివుడు జగతికి తండ్రియౌ శివయె తల్లి
శివుడు శబ్దంబు నర్థమౌ శివయె దెలియ
శివుడు హర్తయౌ త్రాతయో శివయె సుమ్ము
శివుడు శివకు నభేదమ్ము చింత జేయ.
శ్రీ వోలేటి వారి భావముతో నాదొక పద్యము:
రిప్లయితొలగించండిసమరస భావముల్ గలిగి శాంతి సుఖమ్ములతో జెలంగుటే
సముచిత మెల్ల జంటలకు సత్య మటంచును దెల్పు రీతిగా
నమరిరి పార్వతీశు లొకరై భువి నవ్విధి గాక దంపతుల్
విముఖులుగా జెలంగుచును వేరగుచో బొనగూరు దుర్గతుల్
శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశివ శక్తులలో ఎవరు శబ్దమో ఎవరు అర్థమో విడదీసి చెప్పలేము. ఇద్దరూ ఇద్దరే. వాక్కు శక్తియే కదా. మరి శక్తిని అర్థము అనగలమా? వారిద్దరును అక్షర స్వరూపులే. అందుకే లలితా సహస్రనామములలో చివర శ్రీ శివా శివ శక్త్యైక రూపిణీ లలితాంబికా అన్నారు. శివ శక్తులది ఒకటే రూపము. ఈ విషయములు మీకు తెలియనివి కావు - ఏదో చాపల్యముచేత చెప్పేను. స్వస్తి.
పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
రిప్లయితొలగించండిగారికి వందనములు
అర్ధ నారీశు తత్వమ్ము ననుసరింప
దంపతుల జీవనముధన్య మింపొసంగ
వృషభ సింహమ్ము లేకమై వెలయుచుండ
శాంతి సౌఖ్యముల్ దనరును జగమునిండ
అందరి పద్యాలు ఎంతో బాగున్నాయి.
రిప్లయితొలగించండిమొదటి పద్యమే చక్కని పోలికలతో అర్ధనారీశ్వర రూప వర్ణన అందంగా అమరింది. శైలజ గారి పద్యము నచ్చినది.
గోలి హనుమచ్చాస్త్రి గారు నలుపు తెలుపు, కారుచిచ్చులు, కరుణ వంటి వర్ణనలను బాగా కూర్చినారు.
మిస్సన్న గారు పండితుల వారి వర్ణనలోని అందాన్ని, శాస్త్రిగారి మెలికల తళుకులను తమ పద్యములో చూపించినారు.
అందరికీ అభినందనలు.
సాంబశివుడనిన చక్కగాఁ దెలిపేటి
చిత్తర్వు గమనించి చిత్తమలర
అభయమ్ము నొకచేత నానందమొకచేత
పసివాండ్రకై జాలి నొసగు వార
మ్రొక్కెదమెల్లరు ముమ్మారు మనసార
నిండార భక్తి మా మదినిఁ జేర
తల్లియు, దండ్రియు దారిజూపమనుచు
దాక్షిణ్య భావమ్ము దండిదనర
గౌరి శివుడు చూడ వేరుకాదయ్యరో!
చేర్చి చూపెనిచట సృజనకర్త!
పేరు వేరుగాదు పేర్మి వేరనరాదు,
ధన్యమౌను జన్మ లన్యమేల?
మాస్టరుగారూ ! ధన్యవాదములు...సీసపద్యము వ్రాయాలని ప్రయత్నం.. ..ఒక పాదం మరచి త్వరగ పోస్ట్ చేశానూ..చక్కని సవరణతో మంచి పద్యములనిచ్చినందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీమతి లక్ష్మీ దేవి గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
తెలిపేటి - అనుట బాగులేదు -- తెల్పెడు అందాము.
నిండార భక్తి మా మదిని జేర - అను పాద భాగములో యతి లేదు.
స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండివోలేటి వారి భావానికి అందమైన పద్యరూపాన్నిచ్చారు. అలాగే మిత్రుల పద్యాలలోని దోషాలను, నివారణామార్గాలను చూపుతున్నారు. ధన్యవాదాలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మిత్రుల పద్యాలను ప్రశంసించినందుకు ధన్యవాదాలు. ఇటువంటి ప్రశంసలే రచనోత్సాహాన్ని పెంపొందింపజేస్తాయి.
మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
నేమాని వారి సూచనలను గమనించారా?
సూచనలను సలహాలను దెలిపిన కవివర్యులిరువురకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసాంబశివుడనిన చక్కగాఁ దెలిపెడు
చిత్తర్వు గమనించి చిత్తమలర
అభయమ్ము నొకచేత నానందమొకచేత
పసివాండ్రకై జాలి నొసగు వార
మ్రొక్కెదమెల్లరు ముమ్మారు మనసార
మాయని భక్తి మా మదిని నిండ
తల్లియు, దండ్రియు దారిజూపమనుచు
దాక్షిణ్య భావమ్ము దండిదనర
నేమాని పండితార్యా! చక్కని జ్ఞానాన్ని ప్రబోధించారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి