12, ఫిబ్రవరి 2014, బుధవారం

సమస్యాపూరణం - 1322 (మన మన మన మనమె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మన మన మన మనమె మనమె మన మన మనమే.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

 1. మనువుల నరసడు (మ.న.) నాతని
  మనుమలు మునిమనుమ లచట మనమలరంగా
  మనన మొనర్చిరి పద్దెము
  మన మన మన మనమె మనమె మన మన మనమే

  రిప్లయితొలగించండి
 2. మననము తెలిపెడి నిజమిది
  మనుగడ కొకగరిత మదిగని మననీయంగా
  తనయులు మనుమల మమతలు
  మనమన మనమనమె మనమె మనమన మనమే

  రిప్లయితొలగించండి
 3. "మ,న"యను రెండక్షరములు
  మనమున స్మరియించుచుండి మాన్యుం డొకడున్
  తనవారితోడ బలికెను
  మన మన మన మనమె మనమె మన మన మనమే.

  రిప్లయితొలగించండి
 4. మునుపటి గద్దరి తెలుగో
  డనువా డెవడు? తెలఁగాణ? ఆంధ్రా? ఔరా!
  “మన”మనుట లేదు మనకిక
  మన మన మన మనమె మనమె మన మన మనమే??

  రిప్లయితొలగించండి
 5. మనమున తలచి మంచి పూరణలు చేసిన మన కవి మిత్రులందరికీ అభినందనలు.

  మనమన తెనుగున మనమగు
  మనమనగా సంస్కృతమున మనసందురుగా
  మనభాష సొగసు జూడుడు
  మన మనమన మనమె మనమె మనమన మనమే

  రిప్లయితొలగించండి
 6. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  మనమనమన మనమె మనమె
  --------- ----- -----
  మనమనుమలు మునిమనుమలు మనమే మనమై
  ---------- ----------- ----- ------
  మునిమనుమల మనుమలనగ
  ---------- ---------
  మన మన మన మనమె మనమె మన మన మనమే.

  మనమనమన == మనము మనము అనగా, మనమే మనమే
  మనమనుమలు , మునిమనుమలు కూడా మనమే మనమై
  మునిమనుమలమనుమలనగ == మునిమనుమలమనుమలు కూడా

  రిప్లయితొలగించండి
 7. తనరారె పరుల కొలుచుచు
  తనసుఖమున్ మనసు నెప్డు తలచెనె? థెరిసా
  మనమున పరులను కాంచము
  మనమన మనమన మెమనమె మనమన మనమే

  రిప్లయితొలగించండి
 8. తనరారె పరుల కొలుచుచు
  తనసుఖమున్ మనసు నెప్డు తలచెనె? థెరిసా
  మనమున పరులను కాంచము
  మనమన మనమన మెమనమె మనమన మనమే

  రిప్లయితొలగించండి
 9. విను, ప్రియ సతి ! నా కోరిక
  మన మనవడు మనవరాలు మన సుతు సతియున్
  జనుదము సమ్మక్క జాతర
  మన మన మన మనమె మనమె మన మన మనమే.

  రిప్లయితొలగించండి
 10. అనుచుందురు వివిధనుడుల
  దనయర్థము మారునొకపదమునకు, వరుసన్
  గనుడీ సంస్కృతము, తెనుగు --
  మనమన= మన మనమె; మనమె మనమన= మనమే

  రిప్లయితొలగించండి
 11. అనుచుందురు వివిధనుడుల
  వినువారర్థముల తీరు వేరని; వరుసన్
  గనుడీ సంస్కృతము, తెనుగు --
  మనమన= మన మనమె; మనమె మనమన= మనమే

  రిప్లయితొలగించండి
 12. మొదటి పద్యము రెండవ పాదములో చిన్న సవరణ
  "తనసుఖము మదినెపుడైన తలచెనె థెరిసా?"

  తనమత మేదో తనదే
  మనమతమేమొ సరిపడదు, మనుగడ యెట్లో?
  మనముమనమేయెఱుగుమా
  మనమన మనమన మెమనమె మనమన మనమే

  రిప్లయితొలగించండి
 13. మన సంస్కృతి మన భాషయు
  ఘనమైనవి జగతిలోన కల్లన గలరే?
  మనపదములనాద మిదియె
  మన మన మన మనమె మనమె మన మన మనమే

  రిప్లయితొలగించండి
 14. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  మనమున భారత వాసుల
  మని మరువక భిన్న జాతి మతముల జనముల్
  అనువుగ జీవించినచో
  మన మన మన మనమె మనమె మనమే మనమే

  రిప్లయితొలగించండి
 15. తమ తమ తమమే ( తమము = తమస్సు)
  మన మన మన మనమె మనమె మన మన మనమే
  పర తర తమమే (తమము = తమస్సు)
  తర తమ మన, మనమె (మనసు) విన పరమ, తమ తరమే ,

  రిప్లయితొలగించండి
 16. పండిత నేమాని వారూ,
  మనువుల నరసని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవ పాదంలో గణదోషం. ‘మనుగడకు గరిత మది గని...’ అంటే సరి.
  *
  హరి వేంకట సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  The other గారూ, (చంద్రశేఖర్ గారా? మిస్సన్న గారా?)
  తెలుగువా డెవడంటూ ఆవేదనతో కూడిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  సర్వలఘు కందంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.
  మనవడు, మనవరాలు వ్యావహారికాలు. మనుమడు, మనుమరాలు సరియైనవి.
  మూడవ పాదంలో గణదోషం. ‘సమ్మక జాతర...’ అంటే సరి.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. మాజేటి సుమలత గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసింప దగినది.
  1వ, 3వ పాదాల్లో తమము, తమస్సు ఏది ఉన్నా గణభంగమే.
  3,4 పాదాల్లో ప్రాస తప్పింది.

  రిప్లయితొలగించండి
 18. మనదను తలంపు వీడగ
  తనదను భావనలెగయును తన్నుకు చావన్
  అనగల కారణ మేదన
  మన మన మనమనమె మనమె మన మన మనమే!

  రిప్లయితొలగించండి
 19. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. క్షమించండి. సవరణతో ....

  మన, తన,యనినన్ తమమే
  మన మన మన మనమె మనమె మన మన మనమే
  నెనరున కన, కన, ననయును
  మనమే, "కనకన" మని మనుమా ఓ గరిమా!

  రిప్లయితొలగించండి