26, ఫిబ్రవరి 2014, బుధవారం

సమస్యాపూరణం - 1335 (ఆఁడుకోఁతియై యింటింట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఆఁడుకోఁతియై యింటింట నాడె వాణి.
(‘వానరీ మివ వాగ్దేవీం నర్తయంతి గృహే గృహే’ కు ఆంధ్రీకరణము)

11 కామెంట్‌లు:

  1. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    ఆంధ్రభోజుడై రాయలు అలరు చుండ
    సాహితీపరుల్ సకల శాస్త్రవిదులుండి
    రాడుకోతియై నింటింట నాడె వాణి
    సరస మృదు వాకములను చతురత విరియ

    రిప్లయితొలగించండి
  2. వాణి వాగ్ధాటి చిత్రమై వర్ధిలంగ
    ఘనులు తిరుపతి వేంకట కవుల కవిత
    కొప్పరపు కవుల నుడిని కొంత జూపె
    చిత్ర కవితలకవియె చరిత్ర యనగ
    ఆఁడుకోఁతియై యింటింట నాడె వాణి.

    వాణి, అలివేణి గీర్వాణి రాణి యనెడి
    నామమొందుచునిల సత్యభామ యయ్యె
    తూలి మాటలు భర్తల గేలిచేసి
    ఆఁడుకోఁతియై యింటింట నాడె వాణి.

    రిప్లయితొలగించండి
  3. "కోలవెరికోలవేరిడీ" గోల గోల
    వింటిమానాడు నీ వాణి వెర్రిగాను
    వసుధ చిన్నపెద్దల నోట వదలనంటు
    నాఁడు కోతియై యింటింట నాడె వాణి

    రిప్లయితొలగించండి
  4. హనుమ సూర్యుని వద్దతా నభ్య సించె
    నన్ని విద్యలు నిష్ఠతో నధ్బుతముగ
    భక్తి తోచను మారుతి వాక్కు తోడ
    నాడు కోతియై యింటింట నాడె వాణి


    రిప్లయితొలగించండి
  5. గంతు లేసెను శ్రీ వాణి గట్టు మీద
    యా డు కోతియై యింటింట నాడె వాణి
    నాట్య మందున నేర్పరి నాబ డు టన
    నాట్య కత్తెల నాట్యము లలరు నెపుడు

    రిప్లయితొలగించండి
  6. గురుదేవులు మన్నింప ప్రార్థన!

    "నా బిజిలో" తప్పి పోయినది.

    నా బిజిలో హాస్యము ఈ మధ్య కరువైనది,అందుకు హాస్య ప్రధానముగా నా పూరణ అని యుండ వలెను.కాలేజ్ క్లాస్ బిజిలో అది గమనించ లేదు.
    ============*================
    కోతివేషమ్ము వేసెను కూటి కొరకు
    వాణి మెచ్చ జనులు నామె బాణి,రామ
    దాసు కీర్తన బాడుచు వాసిగాను
    నాడుకోఁతియై యింటింట నాడె వాణి.

    రిప్లయితొలగించండి
  7. నేటి యుగమున పసివారు మాట వినక
    లాపు టాపులు ఐపాడు లందు మునుగి
    చదువు నేర్వగ విసుగంచు సంత సమున
    ఆడు కోతియై యింటింట నాడె వాణి

    క్షమించాలి
    ఆంగ్ల పదాలను వాడి నందుకు
    _____________________________
    వాణి నారాణి యనుచును వీణ మీటి
    గజ్జె లందియ లనుగట్టి గతులు ద్రొక్కి
    లలిత కళలందు నాసక్తి ఫలిత మనగ
    నాడు కోతియై యింటింట నాడె వాణి

    రిప్లయితొలగించండి
  8. రామ రాజ్యాన ధర్మంము రహి వహించె
    భక్తి రాముని పాదాల వద్ద సతము
    నాడు కోఁతియై, యింటింట నాడె వాణి
    ప్రజలు సత్యము దప్పని వార లగుట.

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులకు వందనాలు.
    పనుల ఒత్తిడిలో ఈరోజు పూరణలను సమీక్షించలేకపోయాను. నేమాని వారు దయతో పూరణల గుణదోషాలను పరిశీలించి, తగిన సూచనలు చేశారు. వారికి ధన్యవాదాలు.
    పూరణలు పంపిన మిత్రులు....
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    సహదేవుడు గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    సుబ్బారావు గారికి,
    కందుల వరప్రసాద్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    మిస్సన్న గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. వాడి కవిత లో వాడి లేదనె నొకండు
    వీడి కవిత లో వేడి లేదనె వేరొకండు
    వాని వీని జూచి నా హృదయవాణిట్లనియె
    ఆడు కోతియై ఆడె ఇంటింట నావాణి

    రిప్లయితొలగించండి
  11. పెద్దలు దయచేసి క్షమించాలి...నాకు సమస్యాపూరణం అంటే ఆశక్తి కాని...అందులో ఇసుమంతైనా ప్రవేశం నాస్తి.

    రిప్లయితొలగించండి