12, ఫిబ్రవరి 2014, బుధవారం

ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ
రచన
నేమాని రామజోగి సన్యాసి రావు

ఇంద్రవజ్ర:
ఓంకార వాచ్యాయ నమశ్శివాయ
సత్య స్వరూపాయ నమశ్శివాయ
చైతన్య భావాయ నమశ్శివాయ
ఆనంద సాంద్రాయ నమశ్శివాయ


శైలేంద్రజేశాయ నమశ్శివాయ
శైలాధివాసాయ నమశ్శివాయ
బాలేందుచూడాయ నమశ్శివాయ
త్రైలోక్య నాథాయ నమశ్శివాయ

యోగేశ్వరేశాయ నమశ్శివాయ
నాగేంద్ర హారాయ నమశ్శివాయ
యోగాగ్ని నేత్రాయ నమశ్శివాయ
వాగీశ వంద్యాయ నమశ్శివాయ

శ్రీవిశ్వనాథాయ నమశ్శివాయ
దేవాధిదేవాయ నమశ్శివాయ
భావోద్భవఘ్నాయ నమశ్శివాయ
శ్రీవల్లభాప్తాయ నమశ్శివాయ

ఆద్యాయ నిత్యాయ నమశ్శివాయ
హృద్యాయ దివ్యాయ నమశ్శివాయ
వైద్యాధినాథాయ నమశ్శివాయ 
విద్యాస్వరూపాయ నమశ్శివాయ 

త్ర్యక్షాయ రక్షాయ నమశ్శివాయ
ఉక్షేశ వాహాయ నమశ్శివాయ
దక్షాధ్వరఘ్నాయ నమశ్శివాయ
యక్షేశ్వరాప్తాయ నమశ్శివాయ

రుద్రాయ దేవాయ నమశ్శివాయ

భద్రాయ విశ్వాయ నమశ్శివాయ
అద్రీంద్ర వాసాయ నమశ్శివాయ
అద్రీంద్ర చాపాయ నమశ్శివాయ 

వేదస్వరూపాయ నమశ్శివాయ
వేదాంత వేద్యాయ నమశ్శివాయ
నాద ప్రమోదాయ నమశ్శివాయ

వేదండ హంత్రేచ  నమశ్శివాయ

చేతోబ్జ వాసాయ నమశ్శివాయ
ఖ్యాత ప్రభావాయ నమశ్శివాయ
శీతాంశు భూషాయ నమశ్శివాయ
జ్యోతిస్వరూపాయ నమశ్శివాయ

ఉపేంద్రవజ్ర:

శివాయ సాంబాయ నమశ్శివాయ 
భవాయ శర్వాయ నమశ్శివాయ
గవీశ వాహాయ నమశ్శివాయ
భవప్రణాశాయ నమశ్శివాయ

హరాయ దేవాయ నమశ్శివాయ
పురాసురఘ్నాయ నమశ్శివాయ
కురంగ హస్తాయ నమశ్శివాయ

స్మర ప్రణాశాయ నమశ్శివాయ 

4 కామెంట్‌లు:

 1. పూజ్య గురువులకు ప్రణామములు
  ఓం నమశ్శివాయ చాలా బాగుంది ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 2. మిత్రులారా! శుభాశీస్సులు.
  మా శివస్తుతి శ్లోకములను అభినందించుచు ప్రచురించిన శ్రీ కంది శంకరయ్య గారికి
  అభినందనలను తెలిపిన శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారికి
  శ్రీ మల్లిన నరసింహారావు గారికి
  తమ్ముడు చి. డా. గన్నవరపు నరసింహ మూర్తికి
  శ్రీ కందుల వరప్రసాద్ గారికి
  మా సంతోషమును తెలిజేయుచున్నాను.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు: శుభాశీస్సులు.
  మా శివస్తుతి శ్లోకముల గురించి మీరు నిన్ననే ప్రశంసించినారు. మా
  సంతోషమును ఇందుమూలముగ తెలియజేయుచున్నాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి