శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..... =============*============= గోన బుద్ధుని వలె తన కొమరుడు కవి గావలె నని,బుద్దు డనుచు కరము బట్టి వ్రాయ నేర్పి,ముద్దుగ బిల్వ,పాడు పనులు జేయుచు,పరగ మూడుడై జెంత నున్న వృద్ధురాలిని వధియించె బుద్ధు డలిగి.!
కవిమిత్రులకు వందనాలు. ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాను. ఈ నాలుగురోజులు నిరంతరప్రయాణాల వల్ల బ్లాగును చూసి, పూరణల పద్యాల సమీక్ష చేయడానికి అవకాశం దొరకలేదు. ఎందుకో ఈ మధ్య మిత్రుల భాగస్వామ్యం తక్కువైనట్లు తోస్తున్నది. ఇన్నిరోజులు పూరణలు, పద్యాలను రచించిన మిత్రులకు, తమ స్తుతిఖండికలతో మనలను అలరిస్తున్న పండిత నేమాని వారికి అభినందనలు, ధన్యవాదాలు. * రఘుకుమార్ గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని సమస్య తేటగీతిలో ఉంటే మీకు కందం వ్రాశారు. సవరించండి. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు. ‘శూన్యధ్యానపు’ అన్నప్పుడు ‘న్య’ గురువై గణదోషం. అక్కడ ‘శూన్యమౌ ధ్యానమార్గమే...’ అనండి.
బుద్ధుడని తలంచి చేరదీసె
రిప్లయితొలగించండిబద్ధురాలగుచు నొక వృద్ధురాలు, వా
డిద్దె యడిగిన దివ్వనంత
వృద్ధురాలిని వధియించె బుద్ధు డలిగి.
శుద్ధ సాత్వికుడయిన ప్రబుధ్ధుపైన
రిప్లయితొలగించండిబుధ్ధుడనువాడు వైరియై క్రుద్ధుడయ్యె
బుద్ధి మరలింప నొక తల్లి సిద్ధమవగ
వృద్ధురాలిని వధియించె బుద్ధుఁ డలిగి
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండి=============*=============
గోన బుద్ధుని వలె తన కొమరుడు కవి
గావలె నని,బుద్దు డనుచు కరము బట్టి
వ్రాయ నేర్పి,ముద్దుగ బిల్వ,పాడు పనులు
జేయుచు,పరగ మూడుడై జెంత నున్న
వృద్ధురాలిని వధియించె బుద్ధు డలిగి.!
కవిమిత్రులకు వందనాలు.
రిప్లయితొలగించండిఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాను. ఈ నాలుగురోజులు నిరంతరప్రయాణాల వల్ల బ్లాగును చూసి, పూరణల పద్యాల సమీక్ష చేయడానికి అవకాశం దొరకలేదు. ఎందుకో ఈ మధ్య మిత్రుల భాగస్వామ్యం తక్కువైనట్లు తోస్తున్నది.
ఇన్నిరోజులు పూరణలు, పద్యాలను రచించిన మిత్రులకు, తమ స్తుతిఖండికలతో మనలను అలరిస్తున్న పండిత నేమాని వారికి అభినందనలు, ధన్యవాదాలు.
*
రఘుకుమార్ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
కాని సమస్య తేటగీతిలో ఉంటే మీకు కందం వ్రాశారు. సవరించండి.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బుద్ధు డనువాడు నీచుడై క్రుద్ధుడవగ
రిప్లయితొలగించండిబుధ్ధి నేర్పగ దలచెను ముదుసలవ్వ
దిద్ది తీర్చగ వానిపై శ్రధ్ద జూప
వృధ్ధురాలిని వధియించె బుధ్ధుడలిగి
బుద్ధి మంతుడనుచు నమ్మి, ముదముతోడ
రిప్లయితొలగించండివృద్ధదంపతులొకనిని వేడ్క బెంచి
బుద్ధుడని పేరుపెట్టిరి ముద్దుగాను
బుద్ది సడలగ నాతని ముఱికి మదిని
ఆస్తి విక్రయించుట వారు అడ్డుకొనగ
వృద్ధు రాలిని వదియించెబుద్ధుడలిగి
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘వారు + అడ్డుకొనగ’ అన్నప్పుడు సంధి జరిగుతుంది. అక్కడ ‘వార లడ్డుకొనగ’ అనండి.
వృద్ధురాలను బిడ్డడా బుద్ధిగ విను
రిప్లయితొలగించండివద్దురా మద్యపానము హద్దుమీరి
నాదు ప్రాణాలు నీపైనె నమ్ము మన్న
వృద్ధురాలిని వధియించె బుద్ధుఁ డలిగి.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు కృతజ్ఞతలు
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండియజ్ఞయాగాది క్రతువుల విజ్ఞత యను
వృద్ధురాలిని వధియించె బుద్ధు డలిగి
శూన్య ధ్యానపు మార్గమే సుగమమనుచు
జ్ఞాన బోధను జేసె శాక్యముని మనకు .
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
‘శూన్యధ్యానపు’ అన్నప్పుడు ‘న్య’ గురువై గణదోషం. అక్కడ ‘శూన్యమౌ ధ్యానమార్గమే...’ అనండి.
పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిమీసవరణకు ధన్యవాదమ్ములు మీఅభినందనకు
కృతజ్ఞతలు
బుద్ధు డను పేరు పెట్టిన బుద్ధి పెరిగి
రిప్లయితొలగించండిగొప్ప వాడగు నని దల్చె నిప్పుడేమొ
బుడ్డి మందుకు సొమ్మమ్మ నడ్డగించ
వృద్ధురాలిని వధియించె బుద్ధుఁ డలిగి.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీధి లోన తిరుగుచును వింత చూచు
రిప్లయితొలగించండిగౌతముడడిగె "చన్న! నెవడు కనమె వాని
వృద్ధురాలిని వధియించె". బుద్ధు డలిగి
నగరి వదలె సాధింపగ తనదు ప్రశ్న