రాజేశ్వరి అక్కయ్యా, మీ ప్రయత్నం ప్రశంసనీయం. దృష్టద్యుమ్నుని అన్నప్పుడు ‘ష్ట’ గురువై గణదోషం. అలాగే దృ- ద్రో లకు యతి లేదు. తోడబుట్టు(వులగు) పంచపాండవు లనవలసింది. సవరించి మరో పద్యం వ్రాయండి. మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ‘పత్నియై యలరె’ అనండి. ‘కోడల్లు’ - కోడలుకు టైపాటనుకుంటాను. * పండిత నేమాని వారూ, చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, నాటక పాత్రధారులు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మేలనంగ/ నన్న యని పిల్వ’ అంటే పద్యం మధ్య అచ్చు వచ్చిన దోషం తొలగుతుందని నా సలహా.
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ద్రౌపది కుంతివలన ఐదుగురిని పెళ్ళాడి పాంచాలి కాలేదు. అది సినిమావాళ్ళ (పాంచ్ + ఆలి) చమత్కారం మాత్రమే. పాంచాలదేశపు రాకుమారి కనుక పుట్టుకతోనే పాంచాలి అయింది. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణలోని లాజిక్కు బాగుంది. అభినందనలు. ‘సుతుడు + ఔన్’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘సుతు డగును గాదె కర్ణుడు...’ అంటే సరి. * ఆదిత్య గారూ, మంట పుట్టించిన మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
ఆదిత్య గారూ, పుట్టుమూగ లాగా పుట్టుకతో వచ్చే మంట ఉండదు. నేనెక్కడ ‘పుట్టబోయే మంట’ అన్న అర్థాన్ని గ్రహించాను. * సహదేవుడు గారూ, పరకాంతాసహోదరత్వాన్ని ప్రదర్శించిన కర్ణుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘చేబట్టు మంబుజాక్షి’ అనండి.
గురువుగరికి " చేబట్టు యంబుజాక్షి" అని కృష్ణుడు కర్ణుని తో అన్నాడు.ద్రౌపథి తో అనలేదు. "నంబుజాక్షి అంటే సరిపోతుందా? మంబుజాక్షి అనాలా? దయచేసి తెలియజేయండి.
మిస్సన్న గారూ, రథసప్తమి సందర్భంగా మీ సూర్యస్తుతి బాగున్నది. అభినందనలు. * అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, నిజమే. అక్కడ ‘చేపట్టు నంబుజాక్షి’ అనడం సబబు.
శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు. మీ పూరణ బాగుగ నున్నది. సమస్యలను పూరించుటలో "క్రమాలంకారము"ను ఆశ్రయించుట చిట్ట చివరి ప్రయత్నముగ మాత్రమే చేయదగును - వేరొక మార్గము లేనప్పుడే కదా!
శ్రీమతి సుమలత గారి మొదటి పాదములో వేచి వుండె యను ప్రయోగమును మీరు గమనించి నటుల లేదు. వేచి యుండు అనుట సాధువు కదా.
పండిత నేమాని వారూ, నిజమే. ఈ విషయాన్ని గతంలోను కొన్నిసార్లు ప్రస్తావించారు. నేను కేవలం వైవిధ్యం కోసమే ఆ పూరణను చేశాను. ధన్యవాదాలు. సుమలత గారి పూరణలోని ఆ దోషాన్ని నేను గమనించలేదు. * శైలజ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. విరుపుతో మొదటి పూరణ, క్రమాలంకార పద్ధతిలో రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘పుత్రికకు’ ను ‘పుత్రికి’ అనండి. రెండవ పూరణలో పశుపతి - టైపాటు వలన పసుపతి అయింది.
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని వారికి ధన్యవాదములు. నేను ఇప్పుడిప్పుడే పద్య రచనలో తడబడు అడుగుల నడక నేర్చే బుడతడిని. వడి వడిగా బడాయిగ నడవబోయి పడుచుందును. కాని చాల సంతోషముగానున్నది మీ వంటి పెద్ద వారి వద్ద నేర్చుకొనుట. అవకాశానికి ధన్యవాదములు.
శ్రీ సుదర్శన్ గారు! శుభాశీస్సులు - మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 1వ పాదములో మత్స్య యంత్రాన్నికి బదులుగా మత్స్య యంత్రమున్ అంటే బాగుగ నుండును. స్వస్తి.
దృష్ట ద్యుమ్నుని సోదరి ద్రోవ దనగ
రిప్లయితొలగించండిద్రుపద రాట్పుత్రి , కర్ణుని తోడ బుట్టు
పంచ పాండవు లనుపొందె పడతి కుంతి
భర్త కోరగ దూర్వాసు వరము వలన
యాజ్ఞసేనియు, కృష్ణ భవ్యాభిధేయ
రిప్లయితొలగించండియగు పతివ్రతామణి భార్య యగును గాదె
ద్రుపద రాట్పుత్రి కర్ణుని తోడబుట్టు
వులగు ధర్మరాజ ప్రముఖులకు బళిర!
మత్స్యయంత్రంబు జలములో మాత్రమరసి
రిప్లయితొలగించండియింపు లొలుకంగ నతడు ఛేదించ నపుడు
ద్రుపదరాట్పుత్రి కర్ణుని తోడబుట్టు
వైన క్రీడిని వరియించె నందమొప్ప.
యజ్ఞ కుండము నందుండి యవత రించె
రిప్లయితొలగించండిద్రుపద రాట్పుత్రి , కర్ణుని తోడ బుట్టు
వులగు పాండవ పత్నియై నలరె గాన
పాండు రాజుకు కోడల్లు పరమ సాద్వి
రిప్లయితొలగించండినాటకంబున మేటిగా నటన జేసి
మెప్పువొందిరి జూడగా మేలుగాను
అన్న యనిబిల్వ ప్రేమగానతడు బలికె
ద్రుపదరాట్పుత్రి కర్ణుని తోడబుట్టు.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం.
దృష్టద్యుమ్నుని అన్నప్పుడు ‘ష్ట’ గురువై గణదోషం. అలాగే దృ- ద్రో లకు యతి లేదు. తోడబుట్టు(వులగు) పంచపాండవు లనవలసింది. సవరించి మరో పద్యం వ్రాయండి.
మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘పత్నియై యలరె’ అనండి. ‘కోడల్లు’ - కోడలుకు టైపాటనుకుంటాను.
*
పండిత నేమాని వారూ,
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
నాటక పాత్రధారులు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మేలనంగ/ నన్న యని పిల్వ’ అంటే పద్యం మధ్య అచ్చు వచ్చిన దోషం తొలగుతుందని నా సలహా.
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండితండ్రి పెట్టిన షరతుకై తనయ యైన
ద్రుపదరాట్పుత్రి, కర్ణుని తోడఁబుట్టు
వయిన ఫల్గుణునిగని వివాహమాడ,
నంత పాంచాలి యయ్యెను కుంతికతన
పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
రిప్లయితొలగించండిగారికి వందనములు
యజ్ఞమొనరింప బుట్టెను యాజ్ఞసేని
అగ్నిగుండము నుండియే.యగ్ని గర్భు
సుతుడు యౌగాదె కర్ణుడు. జూడజూడ
ద్రుపద రాట్పు త్రి కర్ణుని తోడ బుట్టు
బంధకి యని యన్న పటు కోపమున పలికె
రిప్లయితొలగించండిద్రుపదరాట్పుత్రి కర్ణుని తోడ( బుట్టు
మంట యీ ద్రౌపది శిఖలనంటుకున్న
ఖలుని నెయ్యమునకు బలి కర్ణుడగును!
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ద్రౌపది కుంతివలన ఐదుగురిని పెళ్ళాడి పాంచాలి కాలేదు. అది సినిమావాళ్ళ (పాంచ్ + ఆలి) చమత్కారం మాత్రమే. పాంచాలదేశపు రాకుమారి కనుక పుట్టుకతోనే పాంచాలి అయింది.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణలోని లాజిక్కు బాగుంది. అభినందనలు.
‘సుతుడు + ఔన్’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘సుతు డగును గాదె కర్ణుడు...’ అంటే సరి.
*
ఆదిత్య గారూ,
మంట పుట్టించిన మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
రిప్లయితొలగించండిపుట్టుమూగ లా పుట్టుమంట అని వేయవచ్చో లేదో అనుమానం కలిగింది. మీ అభినందనలతో శంకతీరింది.
దాన కర్ణుడెరుంగును ధర్మ మేదొ
రిప్లయితొలగించండికృష్ణుడవకాశ మిచ్చిన కోర లేదె
అన్యుల సతి తనకు సోదరనియుఁదల్వ
ద్రుపదరాట్పుత్రి కర్ణుని తోడబుట్టు.
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిమీసూచనకు ధన్యవాదములు
ఆరవ పతిగా చేబట్టు యంబుజాక్షి,
రిప్లయితొలగించండిద్రుపద రాట్పుత్రి కర్ణుని, తోడబుట్టు
లైన పాండవుల జతగా అనియె కృష్ణ
సోదరుండు నచ్చెరువొంద సూర్య సుతుదు
కృష్ణ : ద్రౌపథి
పాండుపుత్రు లేవురకును పత్ని యెవరు?
రిప్లయితొలగించండిభానుని వరమ్ముచేఁ గుంతి పడసె నెవనిఁ?
గౌరవులకు దుస్సల యేమి కావలయును?
ద్రుపపరాట్పుత్రి; కర్ణుని; తోడఁబుట్టు.
ఆదిత్య గారూ,
రిప్లయితొలగించండిపుట్టుమూగ లాగా పుట్టుకతో వచ్చే మంట ఉండదు. నేనెక్కడ ‘పుట్టబోయే మంట’ అన్న అర్థాన్ని గ్రహించాను.
*
సహదేవుడు గారూ,
పరకాంతాసహోదరత్వాన్ని ప్రదర్శించిన కర్ణుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చేబట్టు మంబుజాక్షి’ అనండి.
డ్రౌపదీ స్వయంవరములో.....
రిప్లయితొలగించండివిజయు రాకకై చూచుచు వేచి వుండె
ద్రుపద రాట్పుత్రి. కర్ణుని తోడ, బుట్టు
గుడ్డి ధృతరాష్ట్రు దుష్ట కుమరుల గని
సూత పుత్రు డనర్హుడనుచు ఝుంకరించె
రిప్లయితొలగించండిగణాలు సరిపోలేదని చూశాను. సవరిస్తాను. క్షమించండి.
నేడు రథసప్తమీ పర్వదినము
రిప్లయితొలగించండిహరిత హయముల బూన్చిన యరద మెక్కి
తిమిర తతులను పోద్రోలు దీక్ష బూని
కడలి తరగల పైపైకి కదలుచున్న
వేయి చేతుల రేనికి వేయి నతులు.
హరి దశ్వంబులు లాగు స్యందనము ఫై నాకాశ మార్గంబునన్
పరుగెత్తంగను లేచె భాను డదిగో ప్రాభాత కాలమ్మికన్
సరి మందేహుల స్వామి గెల్చుటకునై సంధ్యార్ఘ్య మీయంగ నో
నరులారా చనుదెంచరే రయము సంజ్ఞానాథు నర్చించరే.
గురువుగరికి " చేబట్టు యంబుజాక్షి" అని కృష్ణుడు కర్ణుని తో అన్నాడు.ద్రౌపథి తో అనలేదు. "నంబుజాక్షి అంటే సరిపోతుందా? మంబుజాక్షి అనాలా? దయచేసి తెలియజేయండి.
రిప్లయితొలగించండిమాజేటి సుమలత గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్వల్ప సవరణలతో మీ పద్యం......
విజయు రాకకై చూచుచు వేచి వుండె
ద్రుపద రాట్పుత్రి. కర్ణుని తోడ, బుట్టు
గుడ్డి ధృతరాష్ట్రుని చెనటి కొమరుల గని
సూత సుతు డనర్హుడనుచు నాతి తెగడె.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిరథసప్తమి సందర్భంగా మీ సూర్యస్తుతి బాగున్నది. అభినందనలు.
*
అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
నిజమే. అక్కడ ‘చేపట్టు నంబుజాక్షి’ అనడం సబబు.
శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుగ నున్నది. సమస్యలను పూరించుటలో "క్రమాలంకారము"ను ఆశ్రయించుట చిట్ట చివరి ప్రయత్నముగ మాత్రమే చేయదగును - వేరొక మార్గము లేనప్పుడే కదా!
శ్రీమతి సుమలత గారి మొదటి పాదములో వేచి వుండె యను ప్రయోగమును మీరు గమనించి నటుల లేదు. వేచి యుండు అనుట సాధువు కదా.
స్వస్తి.
కుంతి భోజుని పుత్రికకు కోడలగును
రిప్లయితొలగించండిద్రుపద రాట్పుత్రి, కర్ణుని తోడ బుట్టు
పంచ పాండవులకుతాను పత్ని గాదె
పసుపతిచ్చిన వరముతో పడతి కృష్ణ
పంచ పతులను వరముగా బలికె నెవరు?
రిప్లయితొలగించండిరాధ బెంచిన దెవరిని రాజసముగ?
మాద్రి శల్యుని కేమగు మహిని చెపుమ?
ద్రుపదరాట్పుత్రి, కర్ణుని, తోడబుట్టు
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండినిజమే. ఈ విషయాన్ని గతంలోను కొన్నిసార్లు ప్రస్తావించారు. నేను కేవలం వైవిధ్యం కోసమే ఆ పూరణను చేశాను. ధన్యవాదాలు.
సుమలత గారి పూరణలోని ఆ దోషాన్ని నేను గమనించలేదు.
*
శైలజ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
విరుపుతో మొదటి పూరణ, క్రమాలంకార పద్ధతిలో రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘పుత్రికకు’ ను ‘పుత్రికి’ అనండి. రెండవ పూరణలో పశుపతి - టైపాటు వలన పసుపతి అయింది.
ఆదిత్య మంబుజాతాప్తం
రిప్లయితొలగించండివేదమూర్తిం ప్రభాకరం
దినేశం జగదాధారం
వందేహం కశ్యపాత్మజం
జ్యోతిర్మయం గ్రహాధీశం
మార్తాండం తిమిరాపహం
ఆరోగ్యదం మహాతేజం
వందేహం పద్మినీవిభుం
సహస్రభాను శోభితం ప్రసన్నమూర్తి మభ్రగం
గ్రహాధినాయకం రవిం సుఖప్రదం దివాకరం
సహస్రపత్రజాత విష్ణు శంకరాత్మజం కవిం
సహస్రపత్ర బాంధవం భజామి లోకసాక్షిణం
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని వారికి ధన్యవాదములు. నేను ఇప్పుడిప్పుడే పద్య రచనలో తడబడు అడుగుల నడక నేర్చే బుడతడిని. వడి వడిగా బడాయిగ నడవబోయి పడుచుందును. కాని చాల సంతోషముగానున్నది మీ వంటి పెద్ద వారి వద్ద నేర్చుకొనుట. అవకాశానికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండినా 3వ శ్లోకము 3వ పాదములో ఒక టైపు పొరపాటు దొరలినది. శంకరాత్మకం అని చదువుకొనవలెను (శంకరాత్మజంకి బదులుగా). స్వస్తి
రిప్లయితొలగించండిపూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిభావ, గణదోషములను సవరించ మనవి..
మత్స్య యంత్రాన్ని గొట్టిన మాన్య వరుడు
రూప వంతుడు ధీరపార్థున్ని వలచె
ద్రుపదరాట్పుత్రి, కర్ణుని తోడబుట్టు
పాండవుల మధ్యముడు ప్రీతి పార్షదుండు.
కుసుమ సుదర్శన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పార్థున్ని వలచె’ అన్నదాన్ని ‘పార్థుని వలచెను’ అనండి.
రిప్లయితొలగించండిపూజ్య గురుదేవులు శంకరయ్య గారికి ధన్యవాదములు.
రెండవ పాదములో యతి సవరణతో
దాన కర్ణుడెరుంగును ధర్మ మేదొ
కృష్ణుడవకాశ మిచ్చిన తృష్ణ పడక
అన్యుల సతి తనకు సోదరనియుఁదల్వ
ద్రుపదరాట్పుత్రి కర్ణుని తోడబుట్టు.
శ్రీ సుదర్శన్ గారు!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు - మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
1వ పాదములో మత్స్య యంత్రాన్నికి బదులుగా మత్స్య యంత్రమున్ అంటే బాగుగ నుండును.
స్వస్తి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు నమస్కృతులు..
రిప్లయితొలగించండిమీరు సూచించిన సలహాలకు, ప్రోత్సాహానికి ధన్యవాదములు