25, ఫిబ్రవరి 2014, మంగళవారం

పద్య రచన – 518

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. అత్త కొడుకు తోడ నాటాడు చుండగా
  చిన్న పిల్ల మిగుల సిగ్గు లొలుకు
  చుండె వధువు వోలె, నొప్పుగా బావలో
  వరుని రీతి ఠీవి మెరయు చుండె

  రిప్లయితొలగించండి
 2. పట్టు పరికిణి గట్టిన పసిడి సొగసు
  ఎట్ట్ కేలకు వచ్చెను పొట్టి బావ
  మామ జెప్పెను వీడెనీ మంచి మగడు
  చిలుక పలుకుల చిన్నారి సిగ్గు లొలికె

  రిప్లయితొలగించండి
 3. బావా బావా పన్నీర్
  బావను తన్నేరనుచును పాటను పాడన్
  బావయె రాగను రాగము
  హావము భావమ్ము మారె నరెరే ! పాపా !

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని వారూ,
  ముగ్ధభావాల చిత్రానికి ముచ్చటైన మీ పద్యం అలంకారమయింది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మురిపించే పద్యం వ్రాసి అలరించారు. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం. ‘ఏమి యా సిగ్గుదొంతర లేమి హొయలు’ అంటే సరి.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  చిలుక పలుకుల మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  హావ భావ రాగాలను పలికించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. ముద్దు మోమున నునుసిగ్గు ముచ్చటాయె
  బుగ్గ లందున రోజాలు మొగ్గ విచ్చె
  బావ యందించు చేయితా బట్టు కొనక
  పట్టు పావడ బట్టెను పైడి బొమ్మ

  రిప్లయితొలగించండి
 6. పూల దండను ధరియించి బుజ్జి బావ
  చేతి గడియార మీయగ చేర రాగ
  సిగ్గు పూవులై విరియగ చిన్ని భామ
  మురిసి తలదించి నిలిచెను మోము మెరయ

  రిప్లయితొలగించండి
 7. మేన బావను గని మేను పులకరించ
  సిగ్గుపడుచు నుండె చిట్టి తల్లి
  చేయి జాచి బావ చెంత చేరమనగ
  తలను వంచి జూచె తమ్మి కంటి

  రిప్లయితొలగించండి
 8. సహదేవుడు గారూ,
  మంచి పద్యాన్ని రచించారు. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  చక్కగా ఉంది మీ పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి


 9. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  బూరె బుగ్గలబుజ్జికి గారుడంపు
  పట్టు పరికిణీ జాకెట్టు కట్టబెట్టి
  సౌమ్యముల దండ మెరయముస్తాబు చేసి
  తిలకధారణ మరచిరి దిష్టి పోవ

  పనసపండులా నున్నట్టి బాలునకు కు
  లాయి కుప్పసము తల తురాయిబెట్టి
  పూల మాలను వైచిన పొందికమరు
  తెలుగు తనమొప్పుచుండగ వెలయుచుంద్రు
  అన్నచెల్లెలి ప్రేమలు మిన్న యనగ

  రిప్లయితొలగించండి
 10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యాలు వైవిధ్యంగా బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి