20, ఫిబ్రవరి 2014, గురువారం

సమస్యాపూరణం - 1329 (రాముని పాదముల వ్రాలె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్.

20 కామెంట్‌లు:

  1. రామునికి స్వాగతమ్మిడ
    గా మౌని యగస్త్యుడంత కైమోడ్పులతో
    నా మునినాథుని సుగుణా
    రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్

    రిప్లయితొలగించండి
  2. రామా లయమున కేగిన
    రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్
    కాముని పున్నమి గావున
    సోముని దర్శించ నెంచె శుభముల నొందన్

    రిప్లయితొలగించండి
  3. రాముడు పశుపతి ధనువును
    సామజముగ సారించినంత యయ్యది విరిగెన్
    యాముని కొపము జెందగ పరశు
    రాముని పాదముల వ్రాలె రాముదు భక్తిన్.

    రిప్లయితొలగించండి
  4. రామనవమినాడా బల
    రాముడు పూజా గృహమున రామార్చనమున్
    నేమముతోడ సలిపి శ్రీ
    రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    అగస్త్యముని విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    రాముడు అనే వ్యక్తి విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రఘుకుమార్ గారు,
    పరశురాముణ్ణి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘విరిగెన్ + ఆముని’ అన్నప్పుడు యడాగమం రాదు. సవరించండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బలరామునిపై మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. రామాలయమునకేగెను
    రామునిపూజించగయభి రాముడు శ్రధ్ధన్
    నీమము తోడన్ సీతా
    రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్

    రిప్లయితొలగించండి
  7. ఏమనిచెప్పుదు నప్పుడు
    రాముడు, రావణుల యుద్ధ రంగంబునకున్
    ప్రేమ నగస్త్యుడు వచ్చెను
    రా, ముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్.

    రిప్లయితొలగించండి
  8. రాముని తనతో రమ్మని
    గోముగ పిలువంగ నెంచి , కోరిక దీర్చన్
    సేమము నీకగు ననుముని
    రా, ముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    సవరణలకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
    =============*============
    రాముడని బిలువ సాగిరి
    గ్రామ జనులు ముదముతోడ,కలియుగ ఖలులన్
    కాముకులను గూల్చ మనుచు
    రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్!

    రిప్లయితొలగించండి
  10. తామసు డే యై న పరశు
    రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్
    రామల పుస్తులు ని లువగ
    రాముడె కాపాడె సామి ! రాజస మొప్పన్

    రిప్లయితొలగించండి
  11. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    లేమిడి విభీషణుడు శ్రీ
    రాముని పాదముల వ్రాలె. రాముడు, భక్తిన్
    ప్రేముడి శరణ మ్మిడి స్వ
    ర్ణామూలాగ్రముగ లంక రాజును జేసెన్

    రిప్లయితొలగించండి
  12. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పూజించగ నభిరాముడు’ అనండి.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మంచి పూరణ రచించారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. రోమాంచితమగురీతిని
    నీమంబుల ధ్యాన జపము నెరవేర్చిన సౌ
    ధామునికి తపోబల సు
    త్రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్

    రిప్లయితొలగించండి
  14. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శంకరయ్య గురుదేవులకు ప్రణామములు. మీరు సవరించిన ప్రకారం పద్యం ఇలా మార్చాను.
    రాముదు పశుపతి ధనువును
    సామజముగ సారించినంత యయ్యది విరిగెన్
    ఆ ముని కొపము జెందగ పరశు
    రాముని పాదముల వ్రాలె రాముదు భక్తిన్.

    మరొక పద్యం వ్రాయలనుకుంటున్నాను. సవరణలు ప్రతిపాదించండి.
    రాముదు భీము లిర్వురును
    తామసులై నటునిటు తిరుగుచు నొకటన్
    రామాలయమున కేగిరంత
    రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్.

    రిప్లయితొలగించండి
  16. సామీరి భక్తితోచని
    రాముని పాదముల వ్రాలె, రాముడు, భక్తిన్,
    ప్రేముడిన, తనను గొలిచెడి,
    ఆమారుతికి,బహుమతులు,నాశీస్సులిచ్చెన్

    రిప్లయితొలగించండి
  17. చివరి పాదములో చిన్న సవరణ "నాశీస్సులిడెన్"


    రిప్లయితొలగించండి
  18. రఘుకుమార్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    రెండు పూరణలలో రెండవ, నాల్గవ పాదాలలో గణదోషం.. రెండవ పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. నా సవరణలతో మీ పద్యాలు.....

    రాముడు పశుపతి ధనువును
    సామజముగ నెక్కుపెట్ట నది విరిగిన న
    య్యో ముని కోపించ పరశు
    రాముని పాదముల వ్రాలె రాముదు భక్తిన్.

    రాముడు భీముం డిర్వురు
    తామసులై తా మటునిటు తచ్చాడుచు శ్రీ
    రామాలయమున కేగిరి
    రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్.
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. దోమలగూడకు వచ్చిన
    పాముల రాముడు భజించి
    పండుగ పూటన్
    స్వామియె నీవని ఎన్. టీ.
    రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్

    రిప్లయితొలగించండి


  20. ఆముని కుమారుని, పరశు
    రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్
    తామస మింతయు లేకన్
    రాముని కౌగిలి గనుచు శరాసనమిచ్చెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి