శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..... సవరణలకు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో..
గురుదేవులు మన్నింప ప్రార్థన !
నిన్నటి చిత్రము జూచిన వెంటనే వేణు మాధవ్ కు బ్రహ్మ ప్రత్యక్షమైన సన్నివేషము గుర్తుకు వచ్చినది. =============*============== ఎలమి నిచ్చు నమ్మ నలువ రేడుకు భార్య సిరుల నిచ్చు నమ్మ హరికి భార్య పర్వ తాత్మజ యుమ పరమ శివుని భార్య ముగ్గురమ్మలకును మ్రొక్కు చుంటి!
మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు! * పండిత నేమాని వారూ, ముగ్గురమ్మలను ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, పద్యం వరకైతే చాలా బాగుంది. కాని సమస్య పరిష్కారం కాలేదు. హరి శబ్దానికి చాలా అర్థాలున్న శివుడు మాత్రం కాదు. * నాగరాజు రవీందర్ గారూ, దేవీత్రయాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. మొదటి పాదంలో యతి తప్పింది. * రఘుకుమార్ గారూ, మీ ప్రయత్నం ప్రశంసింపదగినది. ‘పర్వతాత్మజ యుమ’ అని ఉంటే మీరు ‘పర్వతాత్మజయును’ అన్నారు. ఛందోదోషాలున్నాయి. వీలైతే తరువాత సవరిస్తాను. * శైలజ గారూ, విరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘భిక్షువునకు’ అనండి. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు. * కందుల వరప్రసాద్ గారూ, ముగ్గురమ్మలకు మ్రొక్కిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. కాని అన్వయం కుదిరినట్టు అనిపించడం లేదు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్షీరసాగరసుత సిరులకు బెన్నిక్క
రిప్లయితొలగించండిహరికి భార్య; పర్వతాత్మజ యుమ
చంద్రశేఖరునికి సహధర్మచారిణి;
శారదాంబ జలజసంభవు సతి
తండ్రి పైన పగను తల్లడిల్లిన సతి
రిప్లయితొలగించండినగ్ని లోన కలసి హతము నొందె
హైమ గాను వెలసి హిమవంతు పుత్రికై
హరికి భార్య పర్వ తాత్మజు యుమ
హరికి భార్యయు, పర్వతాత్మజుయును
రిప్లయితొలగించండితోడికోడంద్రయినను సుంతకూద
మత్సరములు లేకను కలిసి మెలసి
పూజించిరా శివుని చక్కగాను.
సిరులను కురిపించు శ్రీమహా లక్ష్మియే
రిప్లయితొలగించండిహరికి భార్య ,పర్వతాత్మజ యుమ
సాంబశివునికామె సహధర్మచారిణి
అఖిల జగము నేలు యాది శక్తి
పాలకడలి పట్టి పాలేటిరాచూలి
రిప్లయితొలగించండిహరికి భార్య, పర్వతాత్మజయుమ
ఆది బిక్షువునికి యర్ధాంగి తానగు
పద్మభవుని భార్య వాణిగాదె
పాలకడలి పట్టి పాలేటిరాచూలి
రిప్లయితొలగించండిహరికి భార్య, పర్వతాత్మజయుమ
ఆది బిక్షువునికి యర్ధాంగి తానగు
పద్మభవుని భార్య వాణిగాదె
రిప్లయితొలగించండిహరుడు సతిని గూడి హరి జూడ వెడలెను
వెండి కొండ జూడ రండననుచు
పిలిచె బొట్టు వెట్టి ప్రీతిగా హరిమనో
హరికి, భార్య పర్వతాత్మజ యుమ.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిసవరణలకు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో..
గురుదేవులు మన్నింప ప్రార్థన !
నిన్నటి చిత్రము జూచిన వెంటనే వేణు మాధవ్ కు బ్రహ్మ ప్రత్యక్షమైన సన్నివేషము గుర్తుకు వచ్చినది.
=============*==============
ఎలమి నిచ్చు నమ్మ నలువ రేడుకు భార్య
సిరుల నిచ్చు నమ్మ హరికి భార్య
పర్వ తాత్మజ యుమ పరమ శివుని భార్య
ముగ్గురమ్మలకును మ్రొక్కు చుంటి!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితలపు చూలు తల్లి కలుముల జవరాలు
రిప్లయితొలగించండిహరికి భార్య, పర్వతాత్మజ యుమ
పరమ శివుని భార్య, గరుడధ్వజుని చెల్లి
భవ్య వేలుపులను భక్తి గొలుతు
శివరాత్రి పర్వ దినమున
రిప్లయితొలగించండిసవినయముగ వేడు కొనుదు సహ కవుల గమిన్
శివ నామము జపియించుడు
భవుడే మిము గాచు నెపుడు భవ్యత గలుగన్
హరిని మెడను దాల్చి యభిషేకమున పొంగి
రిప్లయితొలగించండివరము లిచ్చు వాడె వరుడవంగ
ఘోర తపమొనర్చి కొంగున ముడి వేసె
హరికి భార్య పర్వతాత్మజ యుమ.
కడలి రాజ పుత్రి క యగు నా లక్ష్మియే
రిప్లయితొలగించండిహరికి భార్య, పర్వతాత్మజ యుమ
శివుని ధర్మ పత్ని భవబంధ నాశిని
లోక మాత మఱియు మాకు భగిని
మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండి*
పండిత నేమాని వారూ,
ముగ్గురమ్మలను ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
పద్యం వరకైతే చాలా బాగుంది. కాని సమస్య పరిష్కారం కాలేదు. హరి శబ్దానికి చాలా అర్థాలున్న శివుడు మాత్రం కాదు.
*
నాగరాజు రవీందర్ గారూ,
దేవీత్రయాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది.
*
రఘుకుమార్ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసింపదగినది.
‘పర్వతాత్మజ యుమ’ అని ఉంటే మీరు ‘పర్వతాత్మజయును’ అన్నారు. ఛందోదోషాలున్నాయి. వీలైతే తరువాత సవరిస్తాను.
*
శైలజ గారూ,
విరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘భిక్షువునకు’ అనండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
*
కందుల వరప్రసాద్ గారూ,
ముగ్గురమ్మలకు మ్రొక్కిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని అన్వయం కుదిరినట్టు అనిపించడం లేదు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శరణు శరణు దేవ సంకటహర యన
రిప్లయితొలగించండినభయ మిచ్చు తండ్రి హరుడు నట్టి
హరికి భార్య పర్వతాత్మజ యుమ యీమె
తల్లి వోలె నేలు నెల్ల జగతి.
నంది వాహనుడట నడిదారిలో జాడ
రిప్లయితొలగించండిసింహ వాహిని యిక సెలవటంచు
హరికి, భార్య పర్వతాత్మజ యుమ చేరి
పరమ శివుని వెంట పయనమందె
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండివాణి యొప్పె నలువ రాణి,పాలకడలి
ముద్దు పట్టి లక్ష్మి పుష్కరాక్షు
హరికిభార్య పర్వతాత్మజ యుమయీశు
వామభాగ మందు వాసి యగుచు
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.