22, ఫిబ్రవరి 2014, శనివారం

పద్య రచన – 515

కవిమిత్రులారా,

పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

 1. కలదు చిన్న సీతాకోక చిలుక చూడు
  చెన్నొదవుచున్న నొక యాకు చివర జేరి
  రంగు రంగుల రెక్కలు క్రాలుచుండ
  చూపరుల కనువిందుగా చోద్య మెసగ

  రిప్లయితొలగించండి
 2. శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 4వ పాదము చివర యిచట అని యడాగమము కంటె నిచట అని నుగాగమము చేస్తే అన్వయము బాగుగ నుండును కదా. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. ఆర్యా! ధన్యవాదములు,
  మారుస్తున్నాను.

  రంగురంగుల దేహంబు రమ్యగతియు
  స్వేచ్ఛ యిద్దాని సొంతంబు, చీకు చింత
  లేక విహరించి వినువీధి, నాకుపైన
  చేరె కనుడు సీతాకోక చిలుక నిచట.

  రిప్లయితొలగించండి
 4. వన్నె చిన్నెలసొగసులు చెన్ను గాను
  మధువు లేదని తెలియని మధుప మొకటి
  కనుల విందును జేసెడి కాంతి మెరయ
  వచ్చి వ్రాలెను పత్రము పైన గనుడు

  రిప్లయితొలగించండి
 5. చిత్ర మందుసీ తాకోక చిలుక జూడ
  రంగు రంగులు వెదజల్లి రమ్య మగుచు
  చూడ ముచ్చట గానుండు చూప రులకు
  చూసి మీరును ననుభూతి జూర గొనుడు

  రిప్లయితొలగించండి
 6. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  హరిత పత్రముపైవ్రాల సరఘ నీకు
  తేనెదొరక దటంచు నే తెలియ జేయ
  పూలకన్నెల మధువు నే గ్రోలి యిచట
  విశ్రమించగ వచ్చితి పిచ్చివాడ

  రిప్లయితొలగించండి
 7. పూవు పూవున వ్రాలుచు పులకరించి
  తీయ తేనియ మధువుకై తిరుగు నీవు
  హరిత పత్రముపై నిదియేల చేరినావు
  చెపుమ చిన్నిసీతాకోక చిలుక నీవు

  రిప్లయితొలగించండి
 8. కవిమిత్రులకు నమస్కృతులు.
  ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నాను. ఈ రోజు ఒక పెళ్ళి, రేపు విందు. ఎల్లుండి బ్లాగుకు అందుబాటులో ఉంటాను.
  చక్కని పూరణలను, పద్యాలను రచిస్తున్న మిత్రులందరికి అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. చిన్ని జీవి సీతాకోక చిలుకఁ గనుడు
  ముదము తోడను సుమములఁ మధువు గ్రోలి
  ఆకుపై కూరుచుండెను అందముగను
  పంచ రంగులు చిందించు ప్రతిమవోలె

  రిప్లయితొలగించండి
 10. ఆకా యేమనుకోకుమ
  ఆకటికిని కొరికినాను యప్పటి జన్మన్
  నీ కరుణయె చిలుకగ మరి
  శ్రీకరముగ తపసుజేసి చిలుకగనైతిన్.

  రిప్లయితొలగించండి