18, ఫిబ్రవరి 2014, మంగళవారం

జన్మదిన శుభాకాంక్షలు!సహజకవి, సౌమ్యులు, గురుతుల్యులు
శ్రీమాన్ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి
జన్మదిన శుభాకాంక్షలు!
నిజసత్కవితాంచితబు

ద్ధిజీవునకు నేఁడు జన్మదిన శుభకాంక్షల్

సుజనస్తుత పండిత రా

మజోగి సన్యాసి రావు మహితాత్మునకున్.

మిత్రులకు గమనిక
ఆంగ్లకాలమానం ప్రకారం ఈరోజు మాన్యశ్రీ నేమాని వారి పుట్టిన రోజు.
కాని వారు హిందూకాలమానం ప్రకారం
మాఘ బహుళ నవమి (23-2-2014) ఆదివారం నాడు
అమెరికాలోని న్యూజెర్సీలో బంధుమిత్రుల సమక్షంలో
తమ (సప్తతి) జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

15 కామెంట్‌లు:

 1. మా తరుఫు నుండి కూడా
  జన్మదిన శుభాకాంక్షలు అండీ

  రిప్లయితొలగించండి
 2. శ్రీ కంది శంకరయ్య గారికి మరియు శ్రీ వంశీ గారికి కృతజ్ఞతా పూర్వక శుభాశీస్సులు. నా పుట్టిన దినమును (సప్తతి) 23వ తేది ఆదివారము నాడు బంధు మిత్రుల మధ్య అమెరికా లోని న్యూ జెర్సీ రాష్త్రములో తిథుల ప్రకారము మాఘ బహుళ నవమి దినమున జరుపు కొనెదము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. ప్రణామములు
  పూజ్య గురువులు అవధాన సరస్వతి శ్రీ పండిత రామజోగి సన్యాసరావుగారి { దంపతులకు ] జన్మ దిన శుభాభి వందనములు

  రిప్లయితొలగించండి
 4. శ్రీ పండిత నేమాని గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ పండిత నేమాని గారికి జన్మదిన శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 6. శ్రీ పండిత నేమాని గారికి జన్మదిన శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 7. సకల శుభములు గలిగించు శంకరుండు
  ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
  కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
  వరలు గురువులు నేమాని వారి నెపుడు

  రిప్లయితొలగించండి
 8. ప్రణామములు గురువుగారు..జన్మదిన శుభాకాంక్షలు..

  రిప్లయితొలగించండి
 9. గురుతుల్యులు శ్రీ పండిత రామజోగి సన్యాసిరావుగారికి జన్మదినశుభాకాంక్షలు.

  శుభకామనలార్యా! తమ
  కభివాదశతంబు చేతు, నందుడు సతమున్
  విభవంబులు, సన్మానము
  సభలందున పండితార్య! సద్గుణధుర్యా!

  రిప్లయితొలగించండి
 10. శుభాకాంక్షలను తెలిపిన మిత్రులు --
  శ్రీమతి లక్ష్మీ దేవి గారికి
  శ్రీమతి శైలజ గారికి
  శ్రీ నాగరాజు రవీందర్ గారికి, మరియు
  శ్రీ హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి
  మిగిలిన వారందరికి కూడా పేరు పేరునా
  మా కృతజ్ఞతాపూర్వక శుభాభినందనలు మరియు శుభాశీస్సులు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ పండిత నేమాని గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 12. అన్నయ్య గారికి పాదాభివందనములతో ఆంగ్ల మాన జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

  సమస్యల పై సమస్యలతో(కుమారుడు 10వ తరగతి సి బి యస్ సి పరిక్ష,కుటుంబ సమస్యలతో) ఆలస్యముగా జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేయు చుంటిని.నన్ను మన్నించి నా శుభాకాంక్షలు గైకొనగలరు.మీ పాద సేవ దొరకుట నా పూర్వ జన్మ పుణ్య ఫలము. మీకు, మీ కుటుంబసభ్యులకు ఆరోగ్య, సుఖ శాంతులనిమ్మని ఆ భగవంతుని ప్రార్థిస్తూ

  రిప్లయితొలగించండి
 14. మన మలరింపగ జేసిరి
  మన మిత్రులు బ్లాగులోన మనసారగ కా
  మనలను దెలుపుచు బళి! క
  మ్మని దీవెన లిత్తు నివియె మన వారలకున్

  రిప్లయితొలగించండి