21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1330 (కాననివాని నూఁత గొని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాననివాని నూఁత గొని కాననివారలు పొంది రున్నతిన్.

17 కామెంట్‌లు:

 1. మాన ధనమ్మదేల? మద మత్సరముల్ పెనుపొంద నేతయై
  పూనిక తోడ దోచుకొని భూములు సంపదలన్ ధనాఢ్యుడౌ
  వానిని గొల్చి సంపదలు బాగుగ పొందుచు మన్ను మిన్నులన్
  గాననివాని నూతగొని కానని వారలు పొంది రున్నతుల్

  రిప్లయితొలగించండి
 2. ధ్యానము నందు మున్గి పరితాపము నొందుచు పాప కర్మలన్
  మానస మందు దైవనిది మౌనముగా నెల గొల్పి ప్రార్ధ నల్
  కానక పోయినన్ జగతి గాంచెద రెల్లరు భక్తీ మీరగన్
  కానని వాని నూత గొని కానని వారలు పొంది రున్నతిన్


  రిప్లయితొలగించండి
 3. ధ్యానము చేసినన్ పలికి, దైన్యత గూల్చుచు నెల్లవేళలన్
  మానక గాచుచుండెడి రమాధవు, నచ్యుతు, లోకరక్షకున్
  శ్రీనిలయున్, జనార్దనుని, చిన్మయరూపుని, జాతిభేదముల్
  కాననివాని నూతగొని కాననివారలు పొంది రున్నతుల్.

  రిప్లయితొలగించండి
 4. చేనుల మేయు కంచెలట చేతికి చిక్కిన పంటలన్ దినన్
  కానక కన్నుమిన్నులను కాకలు దీరిన నేత లందరున్
  బోనము జేయగా తరిగి పోవని రీతిగ కోట్ల కొట్టముల్
  కానని వాని నూతగొని కానని వారలు పొంది రున్నతిన్

  రిప్లయితొలగించండి
 5. దీనులు హేయమౌ కతన తెన్గుల వృద్ధియు తీరుతె న్నులన్
  గాననివారి నూఁత గొని కాననివారలు పొంది రున్నతిన్
  ఆనక వారలే తిరిగి హైన్యత నొందుట ఖాయ మేలనన్
  వేనుగ గ్రుడ్డివారలొక విక్కముఁ జూచిన రీతిగా భళీ!

  రిప్లయితొలగించండి
 6. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో.
  ================*=================
  మానస మందు స్థాన మిడి మానవు లెల్లరు పొంద గున్నతిన్
  మానస చోర పుత్రుడను,మౌనుల రీతిని నృత్య గానమున్
  ధ్యానము జేసి మండలము,ధార్మిక కేరళ రాజ్యమందునన్
  కాన నివాని నూతగొని,కానని వారలు పొంది రున్నతిన్

  రిప్లయితొలగించండి
 7. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  కాననివాడు లోకముల కారణభూతుడు సర్వవ్యాపియున్
  గాననివాడె గాదె మనకర్మల నన్నియు బాపువాడు యా
  గాననివాడు దీర్చు మన కష్టము లన్నని నమ్మువారిలన్
  గాననివాని నూత గొని కాననివారలుపొందిరున్నతిన్

  రిప్లయితొలగించండి
 8. కానని వాని గాంచితని కానుకలందగ నమ్మజూపుచున్
  ధ్యానము సేతునంచు ధనధాన్యము దోచుకొనంగనిచ్చునే
  కాననివాడు!, విశ్వమును గాచెడువానిని గాంచకుండినన్
  కాననివాని నూఁత గొని కాననివారలు పొంది రున్నతిన్.

  రిప్లయితొలగించండి
 9. శ్రీమూర్తి గారి ప్రేరణతో.........

  ధీనిధిమూర్తులై వసుమతీసురులాదిగ భక్తకోటి గం
  గానది పుణ్యతీర్థములఁ గాంచుచు నీశ్వర పాదసేవనా
  పానములాచరించి నిరపాయునధర్వుని వర్ణబేధముల్
  కాననివాని నూఁత గొని కాననివారలు పొంది రున్నతిన్.

  రిప్లయితొలగించండి
 10. నేటి యువకుల గురించి వ్రాయాలని ప్రయత్నము చేశాను. తప్పులను సరిదిద్ద వలసిందిగా కోరుచున్నాను.

  కానరు లేతప్రాయమున కాంచిన పెద్దల పాటులన్నియున్
  తానునుబిడ్డలున్ తనదు దారయుచాలును,తల్లి దండ్రులన్
  కానరు, దైవమిచ్చెనని కాంచిన పెద్దలు గుడ్డివారలే
  కానని వాని నూతగొని కానని వారలు పొందిరున్నతిన్

  రిప్లయితొలగించండి
 11. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు. దీనిలొ గూడ తప్పు ఉన్న దని తెలుసు. సరిచేయుట నావల్ల కాలేదు. దయయుంచి సరిచేయ వలసిందిగా కోరుచున్నాను.
  కానలు నాశనంబగుట కావలి వారల వల్లనే గదా
  కానుకలన్ సదాగొనుచుకానరు స్మగ్లరు గ్రద్దలన్ అహో
  వానికి నండగా నిలువ పాలకు లెల్లరు తోడు దొంగలై
  కానని వాని నూతగొని కానని వారలు పొందిరున్నతిన్

  రిప్లయితొలగించండి
 12. కానని వాడు వాడు తన కన్నను భేదముఁ జూపడెన్నడున్
  వానినిఁ గన్నులన్ కనగ వశ్యము గాని మనంబు తోడ నీ
  కాననమౌ జగంబునను కష్టమటంచును వేడి నమ్మి యా
  కాననివాని నూఁత గొని కాననివారలు పొంది రున్నతిన్.

  రిప్లయితొలగించండి
 13. మానుగ స్వార్థ చింతనల మాటున పౌరుల మధ్య భేదముల్
  పూనిక బెంచుచున్ ప్రజల మోదము, ఖేదము సుంత యేనియున్
  కాననివాని నూఁత గొని కాననివారలు పొంది రున్నతిన్
  దీనుల జేసి పౌరులను దిగ్గన చీల్చిరి తెన్గు తేజమున్.

  రిప్లయితొలగించండి
 14. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈ రోజు ఉదయమే హైదరాబాదు బయలుదేరి ఒక మిత్రుని కలిసాను. తరువాత రవీంద్ర భారతిలో మాతృభాషా దినోత్సవం సందర్భంగా `ఆంధ్రభారతి" నిర్వాహకులు శేషతల్పశాయి గారికి, నాగభూషణ రావు గారికి జరిగిన సన్మానానికి హాజరయ్యాను. రేపు, ఎల్లుండి హైదరాబాదులోనే ఒక పెళ్ళి, ఒక పెళ్ళి విందు. అందువల్ల ఈ మూడు రోజులూ బ్లాగుకు అందుబాటులో ఉండను. దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 15. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి మిత్రుల పద్యములన్నియును చాల బాగుగ నున్నవి.
  అందరికి అభినందనలు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. వీనుల విందుగా పలికి వేషము మార్చుచు జందెమూనుచున్
  కోనల కోనలందునను కుందెడి రాహులు తోడ నేగెడిన్
  దీనులు కాంగ్రెసోత్తములు దిక్కులు తోచక స్వర్గమార్గమున్
  కాననివాని నూఁత గొని కాననివారలు పొంది రున్నతిన్ :)

  రిప్లయితొలగించండి