25, ఫిబ్రవరి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1334 (పుణ్యకర్ముఁడు నరకమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పుణ్యకర్ముఁడు నరకమ్ముఁ బొంది వగచె.

21 కామెంట్‌లు:

  1. ఆరు లక్షలు సొమ్ముతో నాలయమును
    గట్టి చెరసాలలోన నిక్కట్టులు వడె
    ప్రథిత రామ భక్తుండగు రామదాసు
    పుణ్య కర్ముడు నరకమ్ము బొంది వగచె

    రిప్లయితొలగించండి
  2. పాప కర్మలు జేయంగ పాపు లనుచు
    పుణ్య కర్ముఁడు నరకమ్ముఁ బొంది వగచె
    శివుని లీలలు తెలుపగ నెవరి తరము
    స్వర్గ నరకమ్ము లనెడియా దుర్గ మిదియె

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    నరకప్రాయమైన కారాగారవాసాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాకుంటే అన్వయలోపం ఉన్నట్టుంది.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చిత్రగుప్తుని దోషఫలంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. అతిథి పూజలోన సుతుడె యంతమైన
    కంట నీరు బిగియబట్టి ఘనతఁ బొందు
    భక్త శిరియాళుడా ముక్తి బడయమున్న/బడయుముందు
    పుణ్యకర్ముఁడు నరకమ్ముఁ బొంది వగచె.

    రిప్లయితొలగించండి
  5. గ్రామ దేవతలను గొల్వ సేమమనుచు
    జంతు బలులిచ్చి మెండుగా వింత గతిని
    మూగ జీవుల పరిమార్చి మురిసెనొకడు
    పుణ్యకర్ముఁడు నరకమ్ముఁ బొంది వగచె.

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    అరచి బల్కె "నశ్వత్థామ హతము" ననుచు
    "కుంజరమ్మ"ని మెల్లగా కురునృపుండు
    ధర్మజుడు. పాపముకు శిక్ష బడిన యంత
    పుణ్య కర్ముడు నరకమ్ము బొంది వగచె

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవి గారూ,
    సిరియాళుని ఉద్దేశించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    బలులివ్వడం పుణ్యకర్మమని భావించిన వాని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    ధర్మజుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘హత మటంచు’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. పుణ్య కార్యము లెన్నియో భువిని జేసి
    సత్య వర్తన వీడక సాగి నానె
    పాప పలమేదొ నన్నింక బట్టె ననుచు
    పుణ్య కర్ముడు నరకమ్ము బొంది వగచె

    రిప్లయితొలగించండి
  9. ఆడి దప్పని మహరాజు యాలినమ్మి
    అష్ట కష్టము లన్నియు ననుభవించి
    కాటి కాపరి తానాయె కర్మమునను
    పుణ్య కర్ముడు నరకమ్ము బొంది వగచె

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో.
    ================*==============
    పుణ్య కర్మలు విడనాడి ముక్తి నొంద,జనులు నేడు
    గణ్యు లెల్లరు విడ నాడె కరి వరధుని,పూర్తిగాను
    పుణ్య మూర్తి పదము బట్టి బుధవరుండు,నిగమ నిష్ఠ,
    పుణ్య కర్ముడు నరకమ్ము బొంది వగచె,నయ్య జూడు!

    రిప్లయితొలగించండి
  11. సాహితీ సేవలో వెల్గి సరసుడనగ
    మునిగె శ్రీనాధ కవిరాజు భోగమందు
    నంత్య కాలమ్ము నందున నవని మీద
    పుణ్య కర్ముండు నరకమ్ము బొందె వగచి

    రిప్లయితొలగించండి
  12. శైలజ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    ‘మహరాజు’ గ్రామ్యం.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    జనులు అని క్రియాపదాన్ని విడనాడె అని ఏకవచనాన్ని ప్రయోగించారు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పుణ్య పాప ఫలంబులు పుడమి నుండి
    తోడువచ్చును మనవెంట నీడ వోలె
    అనుభవించక దప్పదు వాని ఫలము
    పుణ్యకర్ముడు నరకమ్ము బొంది వగచె
    పిదప చేరెను స్వర్గమ్ము ముదము తోడ

    రిప్లయితొలగించండి
  14. మర్త్యుడవినీతి పరుడయి మహిని పెక్కు
    పాపములజేసి చాల సంపదను బొందె.
    మంచి కార్యమ్ము విరివిగ మహిని జేయు
    పుణ్య కర్ముడు నరకమ్ము బొంది వగచె.

    రిప్లయితొలగించండి
  15. తల్లిదండ్రుల సేవింపనొల్లడితఁడు
    గురువులను జూచి భక్తిచే గొలువబోడు
    దానధర్మంబులెందున కానడితడ
    పుణ్యకర్ముఁడు నరకమ్ముఁ బొంది వగచె.

    ఇతడు + అపుణ్య = ఇతడపుణ్య

    రిప్లయితొలగించండి
  16. భక్తు డగుతుకా రాముని శక్తి కొలది
    పతన మొందించ నెంచిన పామ రుండు
    పెక్కు యిడుములు గల్పించె నిక్క మనగ
    పుణ్య కర్ముడు నరకమ్ము బొంది వగచె

    క్షమించాలి అన్వయ లోపం ఉన్నట్టు కాదు ఉంది .కానీ మళ్ళీ వ్రాయాలని అది పోస్ట్ చేసాను అంతె క్షమించ గలరు

    రిప్లయితొలగించండి
  17. మర్త్యుడవినీతి పరుడయి మహిని పెక్కు
    పాపములజేసి చాల సంపదను బొందె.
    మంచి కార్యముల్ విరివిగ మహిని జేయు
    పుణ్య కర్ముడు నరకమ్ము బొంది వగచె.

    రిప్లయితొలగించండి
  18. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో యతిదోషం. ‘అనుభవించక తప్ప దా పనుల ఫలము’ అందామా?
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘భక్తుడగు తుకారాముని శక్తికొలది’ అనండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. రాజేశ్వరి అక్కయ్యా,
    నేను వ్యాఖ్యను పోస్ట్ చేసే లోగానే మీరే సవరించారు. సంతోషం!

    రిప్లయితొలగించండి