9, ఫిబ్రవరి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1319 (నరసింహునిఁ బిలువ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నరసింహునిఁ బిలువఁ బలుకు నరకాసురుఁడే.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

 1. నరసింహ నామధేయుడు
  నరకాసుర లక్షణుండు నరకంటకుడున్
  దురితముల పుట్ట వానిని
  నరసింహుని బిలువ బలుకు నరకాసురుడే

  రిప్లయితొలగించండి
 2. అరమరిక లేని దైవము
  నరులను కాపాడు చుండు నవవిధ భక్తిన్
  సరిగొను యోచన యసురులు
  నరసిం హునిబిలువ బలుకు నరకాసురుడే

  రిప్లయితొలగించండి
 3. పండిత నేమాని వారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘యోచన నసురులు’ అనండి.

  రిప్లయితొలగించండి
 4. నరసింహ యనెడు వాడట
  నరకాసుర వేషమందు నడచుచునుండెన్
  హరివేషధారి రమ్మని
  నరసింహుని బిలువ బలుకు నరకాసురుడే

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  నటుల వ్యాజంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  నరసింహ నామధేయుడు
  నరకాసురు డగుచునుండు నమవసనిశిలో
  పొరపాటున నట్టి నిశిని
  నరసింహునిఁ బిలువఁ బలుకు నరకాసురుఁడే.

  రిప్లయితొలగించండి
 7. భాగవతుల కృష్ణారావు గారూ,
  చీకట్లో పొరపాటుగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. నిన్నటి సమస్యకు నా పూరణ.

  దిక్కులు, సూర్య చంద్రులును దృష్టి మరల్చగ లేని రూపుతో
  మిక్కిలి యందమైన సతి మేని సువర్ణపు కాంతులీనగా
  చక్కని చుక్క నేవిధము సన్నుతి జేసిన తక్కువంచు తా
  నిక్కుచు మర్దితో బలికె నిక్కముగా గలరే యనంచు నీ
  యక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్?

  రిప్లయితొలగించండి
 10. సురనాధా! కరుణించియు
  'నరసింహుని' బిలువ బలుకు, నరకాసురుడే
  మరలను బుట్టెను భువిలో
  బెరిగెను దిర్నీతి, హింస విచ్చల విడిగా .

  రిప్లయితొలగించండి
 11. నరసిం హుడు నరకుడుగా
  హరి మీదకు దూకు నప్పుడాహా యనుచున్
  పరిహాసముతో భళి! యని
  నరసిం హునిఁ బిలువఁ బలుకు నరకాసురుడే!
  (నరసిం హుడు = నటుడు)

  రిప్లయితొలగించండి
 12. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ విరుపుతో చాలా బాగున్నది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. ఏపేరు బెట్టి యైనను
  నరసింహునిబిలువ బలుకు,నరకాసురుడే
  యీలోకమున్ విడిచితా
  అమరావతి చనఁ మురహరిఁఅనికిన్ పిలచెన్

  రిప్లయితొలగించండి
 14. మురారిఁ అని వ్రాయ బోయి మురహరి అని వ్రాసాను.

  రిప్లయితొలగించండి
 15. అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మురారి - మురహరి రెండూ సరియైనవే. మీ చివరి పాదాన్ని ఇలా అందాం. “తా/ నమరావతి చనఁ మురారి యనికిన్ పిలచెన్”

  రిప్లయితొలగించండి
 16. కరుణించమనుచు భక్తులు
  నరసింహుని బిలువ బలుకు, నరకాసురుడే
  పరులను హింసించుఖలుడు
  మురహరినెదిరించితాను ముక్తిని బొందెన్

  రిప్లయితొలగించండి
 17. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డి గారూ: శుభాశీస్సులు.
  మీరు కందపద్యమును వ్రాసేరు. కాని ప్రాస ఉండాలి అనే విషయమును గమనించ లేదు. 4 పాదములలో సరియగు ప్రాసను వేయుచు మరల పద్యమును వ్రాయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. శైలజ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. పండిత నేమాని వారూ,
  నిజమే. నేను గమనించలేదు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 20. నర సింహ శతక కర్తయె
  నర సింహుని బిలువ బలుకు; నరకాసురుడే
  సురల విరోధము వలనను
  మురారిచే చంపబడియు మోక్షము నొందెన్.

  రిప్లయితొలగించండి
 21. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. నాగరాజు రవీందర్ గారూ,
  మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
  నరకుడు భూసుతడనీ, తల్లి కారణంగా తప్ప మరెవరి వల్ల చావు లేకుండా వరం పొందాడనీ, భూదేవి సత్యభామ అయిందని ఐతిహ్యం కదా.
  మీ పూరణను ఇలా సవరిస్తే ఎలా ఉంటుంది?
  .... సత్య నెదిరి
  ధరణియె యవతార మొందె దామోదరుతోన్.

  రిప్లయితొలగించండి
 23. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
  గారికి వందనములు

  “నరసింహునిబిలువ బలుకు”
  “నరకాసురుడే""తురుష్క నాయకుడై" మ౦
  దిరమును ముట్టడి సేయగ
  తరుమడె తుమ్మెదల బంపి ద౦దడి బారన్

  రిప్లయితొలగించండి
 24. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
  ==========*====================
  ధరణి భరము ద్రుంచిన యా
  పురందరుడు, కరివదుడు, పురుషోత్తముడున్,
  నరసింహుని బిలువ బలుకు
  నరకాసురుడే నసురుడు నంశుడు ధరణిన్!
  ( నంశుడు= హానికరమైనవాడు)

  రిప్లయితొలగించండి
 25. సురవైరి సుతుడు ధన్యుడు,
  నరసింహునిఁ బిలువఁ బలుకు; నరకాసురుఁడే
  ధరనెల్లర హింసింపగ
  ధరియిత్రి నిలిచె రణమున తనయుని జంపెన్.

  రిప్లయితొలగించండి
 26. అరమరయే లేక అల్లారుముద్దుగ
  గరపబోయినాను బుద్ధులెన్నో, గర్విష్టియైనట్టి
  నరసింహుని నే బిలిచితి
  నరసింహుని బిలువ బలుకు నరకాసురుడే.

  రిప్లయితొలగించండి
 27. పండిత నేమాని గారికి నమస్సులు. ప్రాస చూడ కుండా కందము పంపినందుకు క్షమించండి.మళ్ళీ ప్రయత్నము చేశాను. పరీక్షించి చివరి పాదమును సరిచేయండి.

  ఏరీతినైన భక్తులు
  నరసింహునిబిలువ బలుకు, నరకాసురుడే
  మరణమును కోరి, గ్రచ్చఱ
  యరుగన్ స్వర్గమునకు హరిఁ యనికిన్ పిలిచెన్

  రిప్లయితొలగించండి
 28. పండిత నేమాని గారికి నమస్సులు. ప్రాస చూడ కుండా కందము పంపినందుకు క్షమించండి.మళ్ళీ ప్రయత్నము చేశాను. పరీక్షించి చివరి పాదమును సరిచేయండి.

  ఏరీతినైన భక్తులు
  నరసింహునిబిలువ బలుకు, నరకాసురుడే
  మరణమును కోరి, గ్రచ్చఱ
  యరుగన్ స్వర్గమునకు హరిఁ యనికిన్ పిలిచెన్

  రిప్లయితొలగించండి
 29. శ్రీ సత్యనారాయణ రెడ్డి గారికి శుభాశీస్సులు.
  మీరు ప్రాస నియమమును బాగుగ అధ్యయనము చేయండి. పాదములో 2వ అక్షరము ప్రాసాక్షరము అగును. మొదటి అక్షరమునకు కూడా కొన్ని నియమములు కలవు. తొలి పాదములో తొలి అక్షరము హ్రస్వము అయితే అన్ని పాదములలో హ్రస్వమే యుండవలెను - దీర్ఘమయితే అన్ని పాదములలోను దీర్ఘమే యుండవలెను. ప్రాసాక్షరము ద్విత్త్వమైనా, సంయుక్తమైనా, బిందుపూర్వకమైనా ప్రాసాక్షరములన్నియును అదే విధముగా నుండవలెను. మీరు పూర్వ కవుల పద్యములలో యీ నియమములను జాగ్రత్తగా పరిశీలించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 30. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  పురందరుడు అంటే ఇంద్రుడు కదా! ఆ పదానికి అన్వయం? కరివరదుడు టైపాటు వలన కరివదుడు అయింది. నరకాసురుడే నసురుడు...?
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రఘుకుమార్ గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసింపదగినది.
  మొదటి రెండు పాదాలకు నా సవరణలు....
  అరమరయె లేక ముద్దుగ
  గరప గడగి బుద్ధులెన్నొ, గర్విష్ఠుడనై
  *
  అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  సవరించిన పూరణ బాగున్నా, మొదటి పాదంలో ప్రాస తప్పింది. దానిని ‘పరిపరివిధముల భక్తులు..." అనండి.

  రిప్లయితొలగించండి
 31. పండిత నేమాని గార్కి గురువర్యులు కంది శంకరయ్య గారికి తమరు చెప్పిన సలహాలకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను.

  గుప్పున పంపితి కందము
  చెప్పక పొందక మదీయ శ్రీమతి మెప్పున్
  తప్పులను వ్రాసి పంపితి
  తిప్పలు తప్పునె సహచరి తీరుపు లేకన్

  రిప్లయితొలగించండి
 32. తరుముచు కొట్టగ సోనియ
  పరిపరి విధముల నతనిని, పాడెను గూడన్,
  కొరగాని కొడుకు పీ.వీ.
  నరసింహునిఁ బిలువఁ బలుకు నరకాసురుఁడే!

  రిప్లయితొలగించండి
 33. కొరగాని సోనియమ్మట
  నరసింహుని తాడు తెంచి నరకగ నపుడో
  వెరచుచు కలలో నిపుడా
  నరసింహునిఁ బిలువఁ బలుకు నరకాసురుఁడే

  రిప్లయితొలగించండి