27, ఫిబ్రవరి 2014, గురువారం

"నమశ్శివాయ"
రచన
నేమాని రామజోగి సన్యాసి రావు

నమశ్శివాయ యంచు బల్కినన్ మనమ్ము శోభిలున్
నమశ్శివాయ యంచు బల్కినన్ జెలంగు వాక్కులున్
నమశ్శివాయ యంచు బల్కినన్ ఫలించు కార్యముల్
నమశ్శివాయ మంత్రమున్ మనమ్మునన్ జపించెదన్

నమశ్శివాయ యంచు బల్కినన్ దొలంగు కష్టముల్
నమశ్శివాయ యంచు బల్కినన్ నశించు పాపముల్
నమశ్శివాయ యంచు బల్కినన్ ఫలించు భాగ్యముల్
నమశ్శివాయ మంత్రమున్ మనమ్మునన్ జపించెదన్

నమశ్శివాయ యంచు బల్కినన్ వరించు యోగముల్
నమశ్శివాయ యంచు బల్కినన్ లభించు సద్గతుల్
నమశ్శివాయ యంచు బల్కినన్ హరించు జన్మముల్
    నమశ్శివాయ మంత్రమున్ మనమ్మునన్ జపించెదన్     

2 కామెంట్‌లు:

 1. సాంబశివా! హరా! యనుచు సన్నుతి జేసిన నార్తి తోడ హే-
  రంబుని తండ్రి మానసము రంజిలి దీన జనాళి బ్రోవ వే-
  గంబుగ నేగుదెంచు, కలికాలములో పరమేశ్వరుండు కా-
  మంబుల దీర్చి మానవుల మాలిమి నేలును తండ్రి రీతిగా.

  రిప్లయితొలగించండి
 2. ఇలయలకా పుర మందున
  నలరిన యా శంభు గొలువ యైదువ తనమున్
  లలనా మణులకు నిచ్చును
  వలపున మఱి నీకు నిత్తు వందనము శివా !

  రిప్లయితొలగించండి