17, ఫిబ్రవరి 2014, సోమవారం

పద్య రచన – 510

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. తల్లివి నీవు నా యెదను దైవమ వీవును కల్పకాఖ్యవౌ
    వల్లివి నీవు విద్యలను బాగుగ నేర్పుచు గూర్చి శ్రేయముల్
    చల్లగ జూచు నీదు పద సారసయుగ్మము సాదరాన నా
    యుల్లము నందు సంతతము నొప్పుగ గొల్చెద ప్రేమరూపిణీ!

    రిప్లయితొలగించండి
  2. Pandita Nemani గారూ మీ పద్యం:
    తల్లివి నీవు నా యెదను దైవమ వీవును కల్పకాఖ్యవౌ
    వల్లివి నీవు విద్యలను బాగుగ నేర్పుచు గూర్చి శ్రేయముల్
    -----------------------
    వావ్

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    మాతృపదసారసయుగ్మము నెదఁ జేర్చి చెప్పిన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ లక్కరాజు గారికి మరియు శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
    మా పద్యము గురించి చక్కగా స్పందించి నందులకు మా సంతోషము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. అక్షర మాలను గూడను
    అక్షరములు ' ఆ ' లు మొదలు ' అ ఆ ' యనగా
    రక్షగ నమ్మాదరణే (అమ్మ + ఆదరణ )
    శిక్షణ నిచ్చును శిశువుల శ్రేయంబిడుచున్.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘అమ్మ + ఆదరణ’ అన్నప్పుడు యడాగమం రావాలి.

    రిప్లయితొలగించండి
  7. నవ్వు నేర్పును, వేలంది నడక నేర్పు
    తినుట నేర్పును, బుద్ధిగా మనుట నేర్పు
    అత్త, తాతలు నేర్పు తాననవరతము
    తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 1.

    మమత బంచును, భావాన సమత బెంచు,
    మంచి చెడుగులు బోధించు మాట నేర్పు,
    తారతమ్యము లెరిగెడి తీరు జూపు
    తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 2.

    కోప మొకయింత యైనను చూపకుండ
    ఉగ్గుపాలను పోయుచు నుర్విలోని
    సంగతులనన్ని వినిపించి శక్తి గూర్చు
    తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 3.

    కథలరూపాన విశ్వంబు కలియదిప్పు
    జ్ఞానదాయిని యెల్లెడ తాన యగుచు
    పలుకు పలుకున సకలంబు తెలియ జెప్పు
    తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 4.

    అలుక నేర్పును, ప్రేమగా పలుక నేర్పు,
    అడుగ నేర్పును, బట్టలు తొడుగ నేర్పు,
    రుచులు నేర్పును, శబ్దసంరచన నేర్పు
    తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 5.

    దయయు, సత్యంబు, ధర్మంబు, భయము నేర్పు,
    యశము లందుటలో గల్గు హాయి నేర్పు
    సర్వవిధముల న్యాయానుసరణ నేర్పు
    తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 6.

    రిప్లయితొలగించండి
  8. తల్లి యొడిలోన గూర్చుండి తనయు డచట
    నేర్చు చుండెను గ "అ ఆ లు " నియతి తోడ
    చూడ ముచ్చట గానుండె సొంపు కలిగి
    తల్లి యొడి యే ను దొలిబడి పిల్ల లకగు .

    రిప్లయితొలగించండి
  9. మిత్రుల పూరణ లలరిస్తున్నాయి. అన్నయ్య గారి పూరణ అద్భుతముగా నున్నది.

    రిప్లయితొలగించండి
  10. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    ‘తల్లియొడి యది తొలిబడి యెల్లరకును’ మకుటంగా మనోహర పద్యసంరచన చేసి అలరింపజేశారు. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘అందరకును + అమ్మ’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ ‘అమ్మయే యఖిలజనుల/ కమ్మ ఋణము...’ అందామా?
    *
    సుబ్బారావు గారూ,
    మంచి పద్యాన్ని రచించారు. అభినందనలు.
    ‘అఆలు’ అన్నప్పుడు ఊనిక వల్ల అ గురువవుతుంది. కనుక ‘నేర్చుచుండెను అఆలు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  11. అమ్మవడి లోన దిద్దితి నక్షరములు
    నన్నుచదివించె స్వయముగా కన్నతల్లి
    అమ్మనేర్పిన పాఠము లక్షయములు
    అమ్మనిజముగా భువినినా కాదిగురువు








    రిప్లయితొలగించండి
  12. ఉగ్గు పాలు బోసి ఉన్నతాశయముల
    తెలుగు పలుకులెల్ల తీర్చిదిద్ది
    నీతి కధలు జెప్పి నియమాలు నేర్పెడు
    తల్లియొడితొలిబడి యెల్లరకును

    పస్తులుండి తల్లి బలుకష్టములకోర్చి
    పెంచి బెద్ద జేయు పేద యైన
    కంటి రెప్ప వోలె గాచును తల్లియె
    తల్లియొడితొలిబడి యెల్లరకును


    అమ్మ కన్న మిన్న ఆదిదైవములేదు
    అమ్మ ప్రేమ తోనె అవని నడచు
    అమ్మ లేని యిల్లు అంధకారమ్మేను
    అమ్మ బ్రహ్మ గాదె అవని లోన


    రిప్లయితొలగించండి
  13. అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
    ‘వడి’ అన్నారు. అక్కడ ‘అమ్మ యొడి’ అనండి.
    *
    శైలజ గారూ,
    మీ పద్యాలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    మీరు సాధ్యమైనంత వరకు పద్యం మధ్య అచ్చులు రాకుండా చూడండి. వాక్యంలో, పద్యంలో మధ్య అచ్చులు వ్రాయడం మన సంప్రదాయం కాదు.


    రిప్లయితొలగించండి
  14. పూజ్యగురు దేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరిచ్చిన సవరణకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  15. మమతను రంగరించి నను మాలిమిఁ జేయుచు విద్య నేర్పెనా
    యమ; ననుఁ గన్న తల్లి మది యందలమందున పూజ జేతు; కూ
    రిమి నిట కన్నబిడ్డకయి హెచ్చుగ నోరిమిఁ బూని నేర్పితిన్
    మమతల నా యొడిన్ శిశువు మక్కువ మీరగఁ జేరినంతనే.

    రిప్లయితొలగించండి
  16. మొదటి బడి తల్లి యొడియే!
    కుదుటఁబడుచు నచ్చు హల్లు కుదురుగ నేర్వన్!
    చదువున్న నిన్ను జగమున
    పదవులు, కొలువులు వరించి పరుగున వచ్చ్చున్!

    రిప్లయితొలగించండి
  17. లక్ష్మీదేవి గారూ,
    తల్లి ప్రేమను పొంది, తల్లి ప్రేమను అందించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  18. పూజ్యగురు దేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.
    ఉల్లమందున బ్రేమపొంగగ నున్నతాశయ సిద్ధికై
    తల్లి యంకము ఆది పీఠము తప్పునొప్పుల నేర్పగన్
    బల్ల్లిదుండు శివాజీ నేతగ పౌష మందు విజేతవన్
    తల్లి జీజయె బీజమంత్రము ధర్మ రక్షణ సేయగా

    రిప్లయితొలగించండి
  19. లక్ష్మీదేవి గారూ
    మమతను రంగరించి నను మాలిమిఁ జేయుచు విద్య నేర్పెనా
    ------------------
    తల్లి గురించి చక్కగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  20. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    తల్లి శిక్షణలో పెరిగిన వాళ్ళలో శివాజీ కథ ప్రసిద్ధం. ఆ విషయాన్ని ప్రస్తావించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘అంకము ఆది’ అని విసంధిగా వ్రాసారు. అక్కడ ‘ఆంకమె యాదిపీఠము’ అనవచ్చుకదా. ‘పౌష’ శబ్దాన్ని మీరు ఏ అర్థంలో వాడారు? ‘విజేతవన్’ ప్రయోగం కూడా యుక్తం కాదు. ‘... అందున గెల్వగా’ అనండి.

    రిప్లయితొలగించండి
  21. మాస్టరుగారూ ! ధన్యవాదములు...
    సవరణతో...


    అక్షర మాలను గూడుచు
    అక్షరములు ' ఆ ' లు మొదలు అమ్మయు చూడన్
    శిక్షణలో మొదలుండును
    రక్షణనిడి బిడ్డలతల వ్రాతకు గురువై.

    రిప్లయితొలగించండి