కవిమిత్ర్రులకు నమస్కృతులు. అది 1978 సం. అంతవరకు మేడారం జాతర గురించి వినడమే కాని చూడలేదు. మా మిత్రుడు కుటుంబంతో జాతరకు వెళ్తూ నన్ను రమ్మన్నాడు. అప్పటికి నేనొక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తూ, జీతం సరిపోక ఇబ్బందులు పడుతున్నాను. పెళ్ళయి ఆరు సంవత్సరాలైనా సంతానం లేదు. ఆ జాతరలో మా మిత్రుని భార్య నాతో మ్రొక్కించింది. “వచ్చే జాతర వరకు ప్రభుత్వోద్యోగం దొరికి, సంతానం కలిగితే ప్రతియేడూ దర్శనం చేసుకుంటాను" అని. మ్రొక్కుకున్నాను. తరువాతి జాతర (1980) సమయానికి నాకు ప్రభుత్వ సహాయక పాఠశాలలో ఉద్యోగం దొరికింది, కొడుకూ పుట్టాడు. అప్పటినుండి క్రమం తప్పకుండా రెండేళ్లకొకసారి జరిగే జాతరకు వెళ్ళి మ్రొక్కు తీర్చుకుంటున్నాను. రేపు, ఎల్లుండి రెండు రోజులు అక్కడే. ఉదయం నుండి ప్రయాణపు ఏర్పాట్లలో వ్యాస్తుడనై ఉన్నాను. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నవి. అభినందనలు. * పండిత నేమాని వారూ, మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. * శైలజ గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘ఈప్సితములు + ఇంతులు’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘ఈడేర్చులె నీప్సితముల నింతులు గొలువన్’ అనండి. * పరుచూరి వంశీ గారూ, ‘పద్యరచన’ శీర్షిక మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు. * లక్ష్మీదేవి గారూ, పద్యంలో మీరు వెలిబుచ్చిన సందేహం అర్థం కాలేదు. ‘నిలిచి + ఇరువురు’ అన్నప్పుడు నుగాగమం రాదు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. మూడవ పాదాన్ని ‘ఆడ మగ యనుచు జూడక’ అనండి. * అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘వనమున నమ్మల’ అనండి. నాల్గవ పాదంలో ‘తీరును’ అన్నప్పుడు గణదోషం. ఆ పాదాన్ని ‘మనముల కోరికలు తీరు...’ అనండి. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మేడారాన్ని గురించిన మీ ఖండిక నాకు మహదానందాన్ని కలిగించింది. ధన్యవాదాలు. * సహదేవుడు గారూ, మంచి కోరికతో మంచి పద్యాన్ని రచించారు. అభినందనలు.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. *
* భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, అర్థాంతరంతో మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, బాగున్నది మీ పూరణ. అభినందనలు. ‘తగదు + ఇటుల’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. అక్కడ ‘తగ దిట్టుల మృష బల్కగ’ అనండి. * శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, బాగున్నది మీ పూరణ. అభినందనలు. * సుబ్బారావు గారూ, బాగున్నది మీ పూరణ. అభినందనలు.
పద్యమును సరి చేసి నందులకు కృతజ్ఞతలు. తప్పులను సవరించి మరల పద్యమును తయారు చేసి పంపుచున్నాను. క: ఘన మేడారం జాతర కనులకు కమనీయ మౌను, కాంచుడు మేలున్ వనమున నమ్మల మ్రొక్కిన మనముల కోరికలు తీరు, మహిమను కనుడీ
నిలిచి రిరువురు గా గమనించగలరు. టైపాటు కు మన్నింప గోరుతున్నాను. పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా సమ్మక్క, సారలమ్మల వలె పోరాట యోధులేనంటారు. వారిని గద్దెపై కూర్చుండ బెడతారు. అయినా సమ్మక్క సారలమ్మ జాతర అనే పేరులో వారికి ప్రాధాన్యత ఎందుకు లేదా అని నా సందేహము.
మేడారము జాతర యది
రిప్లయితొలగించండివేడుకగా జరుగు నంట వేయి విధమ్ముల్
ఈడేరును కోరికలవి
చూడగ పోయెదము రండు శుభమే గలుగున్
శ్రీమతి రాజేశ్వరి గారు: శుభాశీస్సులు. మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండిగురువులకు ప్రణామములు
రిప్లయితొలగించండిముందేరాసాను కదా ఎలాఉందో అని భయ పడుతున్నాను ధన్య వాదములు
సారమ్మకు సమ్మక్కకు
రిప్లయితొలగించండిసారమ్మగు భక్తి తోడ సలుపగ నా మే
డారమ్మున జాతర కన
రారే పండువుల భక్తి రసమును గ్రోలన్
సమముగ ధర జనుల సమ్మక్క జూచును
రిప్లయితొలగించండిసరళమైన రీతి సారలమ్మ
భక్తి తోడ గొలిచి బంగరు బెల్లమ్ము
మ్రొక్కు దీర్చి గొలుచు భువిని నరులు.
తోడుగ పోదము రారే
రిప్లయితొలగించండిమేడారముజాతరంట మేలుగ జరుగున్
వేడగ సమ్మక్కనచట
నీడేరునునీప్సితములు ఇంతులు గొలువన్
మేడరపు జాతరలో
రిప్లయితొలగించండితేడాలేలేవు కలసి తిరుగును భక్తుల్
చూడగ సమ్మక్కయు తా
గూడుచు సారక్క తోడ గోడుల దీర్చున్.
ధన్యవాదములండీ .. మళ్ళీ పద్య రచన కు అంశాలిస్తున్నందుకు
రిప్లయితొలగించండిపురుషులును తోడుగ నిలిచి
రిప్లయితొలగించండినిరువురు; పేరున మరి యిటులేమొకొ, భేదం?
బరయగ విజ్ఞులు సుంత వి
వరములఁ దెలుపంగ విన్నపములిడుచుంటిన్.
మేడారం జాతరయన
రిప్లయితొలగించండివేడుకగా బోవుచుండ్రు వేలుగ జనముల్
ఆడా మగ యని జూడక
యీ డేర్చును వారివారి యీ ప్సిత శతముల్
ఘన మేడారం జాతర
రిప్లయితొలగించండికనులకు కమనీయ మౌను, కాంచుడు మేలున్
వనమున యమ్మల మ్రొక్కిన
మనముల కోర్కెలు తీరును, మహిమను కనుడీ
సమ్మక్కకు సారక్కకు
రిప్లయితొలగించండిసమ్మతముగ గిరిజనాళి శ్రద్ధాన్వితులై
అమ్మా! రక్షణ చేయగ
రమ్మని ప్రణమిల్లు విధము రమ్యం బచటన్. 1.
ఏకశిలానగరంబది
యాకరమై వెలుగుచుండు నాంధ్రావనిలో
శ్రీకరమౌ శిల్పాఢ్యత
కేకాలము తత్సమీప మీమేడరమున్. 2.
కానలలో మేడారము,
మానితముగ నచట జరుగు మహనీయంబౌ
నానందదమగు జాతర
దానిని వర్ణింప దరమె ధరవారలకున్. 3.
గిరిజనులు చేయు జాతర
పురవాసులకైన గాని భోగదమగుటన్
నరసాగర మగుపించును
సురుచిరమగు సంబరంబు చూచుటకొఱకున్. 4.
తెలగాణా సంస్కృతినట
పలురకముల గాంచవచ్చు పరమప్రీతిన్
తులలేని హర్ష మొదవును
నిలిచిన నొకయింతసేపు నిష్ఠాగరిమన్. 5.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమ్మక్క సారలమ్మల
రిప్లయితొలగించండినెమ్మనమున బూజ సేయ నీమము తోడన్
క్రమ్మిన చీకట్లు తొలగి
సమ్మదపడు రాష్ట్రమెల్ల సమ్మిళితముగన్!
కవిమిత్ర్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఅది 1978 సం. అంతవరకు మేడారం జాతర గురించి వినడమే కాని చూడలేదు. మా మిత్రుడు కుటుంబంతో జాతరకు వెళ్తూ నన్ను రమ్మన్నాడు. అప్పటికి నేనొక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తూ, జీతం సరిపోక ఇబ్బందులు పడుతున్నాను. పెళ్ళయి ఆరు సంవత్సరాలైనా సంతానం లేదు. ఆ జాతరలో మా మిత్రుని భార్య నాతో మ్రొక్కించింది. “వచ్చే జాతర వరకు ప్రభుత్వోద్యోగం దొరికి, సంతానం కలిగితే ప్రతియేడూ దర్శనం చేసుకుంటాను" అని. మ్రొక్కుకున్నాను. తరువాతి జాతర (1980) సమయానికి నాకు ప్రభుత్వ సహాయక పాఠశాలలో ఉద్యోగం దొరికింది, కొడుకూ పుట్టాడు. అప్పటినుండి క్రమం తప్పకుండా రెండేళ్లకొకసారి జరిగే జాతరకు వెళ్ళి మ్రొక్కు తీర్చుకుంటున్నాను.
రేపు, ఎల్లుండి రెండు రోజులు అక్కడే. ఉదయం నుండి ప్రయాణపు ఏర్పాట్లలో వ్యాస్తుడనై ఉన్నాను.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నవి. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
శైలజ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘ఈప్సితములు + ఇంతులు’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘ఈడేర్చులె నీప్సితముల నింతులు గొలువన్’ అనండి.
*
పరుచూరి వంశీ గారూ,
‘పద్యరచన’ శీర్షిక మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు.
*
లక్ష్మీదేవి గారూ,
పద్యంలో మీరు వెలిబుచ్చిన సందేహం అర్థం కాలేదు.
‘నిలిచి + ఇరువురు’ అన్నప్పుడు నుగాగమం రాదు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
మూడవ పాదాన్ని ‘ఆడ మగ యనుచు జూడక’ అనండి.
*
అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వనమున నమ్మల’ అనండి. నాల్గవ పాదంలో ‘తీరును’ అన్నప్పుడు గణదోషం. ఆ పాదాన్ని ‘మనముల కోరికలు తీరు...’ అనండి.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మేడారాన్ని గురించిన మీ ఖండిక నాకు మహదానందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
*
సహదేవుడు గారూ,
మంచి కోరికతో మంచి పద్యాన్ని రచించారు. అభినందనలు.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
అర్థాంతరంతో మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
‘తగదు + ఇటుల’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. అక్కడ ‘తగ దిట్టుల మృష బల్కగ’ అనండి.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
పద్యమును సరి చేసి నందులకు కృతజ్ఞతలు. తప్పులను సవరించి మరల పద్యమును తయారు చేసి పంపుచున్నాను.
రిప్లయితొలగించండిక: ఘన మేడారం జాతర
కనులకు కమనీయ మౌను, కాంచుడు మేలున్
వనమున నమ్మల మ్రొక్కిన
మనముల కోరికలు తీరు, మహిమను కనుడీ
నమస్కారములు
రిప్లయితొలగించండిఆ దేవతల అనుగ్రహంతో మీ స్వాను భవం ప్రసంస నీయం
నిలిచి రిరువురు గా గమనించగలరు. టైపాటు కు మన్నింప గోరుతున్నాను.
రిప్లయితొలగించండిపగిడిద్దరాజు, గోవిందరాజు కూడా సమ్మక్క, సారలమ్మల వలె పోరాట యోధులేనంటారు. వారిని గద్దెపై కూర్చుండ బెడతారు. అయినా సమ్మక్క సారలమ్మ జాతర అనే పేరులో వారికి ప్రాధాన్యత ఎందుకు లేదా అని నా సందేహము.
మా బండి ఆలస్యంగా నడుస్తోంది.
రిప్లయితొలగించండిలెక్కకు మిక్కిలై జనులు రేబవలుల్ తిరునాళ్ళ గొల్వ స-
మ్మక్క ! కృపామయీ! నతులు మాత యటంచును, భక్తి మీర సా-
ర్లక్క ! దయాంబు రాశి ! మము రక్షణ సేయరె యంచు, నేలరే
మక్కువ తల్లులై సతము, మాలిమి బిడ్డల నేలు రీతిగా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి