27, ఫిబ్రవరి 2014, గురువారం

శివ స్తుతి

శివ స్తుతి
రచన
నాగరాజు రవీందర్
: భుజంగ ప్రయాతం :
చిదానంద రూపం త్రినేత్రాభిరామం
సదా లోకరక్షం పరం వేదసారం
సదాకారమేకం సదానందరూపం
సదా భక్తపాలం హృదా భావయామి

మహేశం గిరీశం సచంద్రావతంసం
మహాశైల వాసం భవానందసారం
మహాదేవ దేవం శివం నాగభూషం
మహా విశ్వనాథం సదా భావయామి

భజే పంచవక్త్రం జటాజూటశీర్షం
భజే వామదేవం పురా ఆదిభిక్షుం
భజే భూతనాథం ధృతం నీలకంఠం
భజే పాపనాశం సదా త్వాం స్మరామి

మనుష్యాది జీవాత్మకం ప్రాణభూతం
మునీంద్రాదిభి: పూజితం త్వాం నటేశం
అనంతం భవంతం భజేహం భజేహం
ధనేశాప్తమిత్రం ధరాధీశవాసం

మదీయాత్మవేద్యం రమాకాంతవంద్యం
సదా సాధురక్షం మహా శూలపాణిం
హృదంతస్థ రూపం మహా వ్యోమకేశం
ఇదానీ మ్యహం శంకరం ప్రార్థయామి

10 కామెంట్‌లు:

 1. అందరికి శివరాత్రి పర్వ దిన శుభాకాంక్షలతో.....

  శ్రీ నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదములతో..శివ స్తోత్రమును స్తుతించి తరించ గల అదృష్టమును మహా శివరాత్రి పర్వ దినాన లభించడం మా పూర్వ జన్మ సుకృతం

  రిప్లయితొలగించండి
 2. శివరాత్రి పర్వ దినమున
  సవినయముగ వేడు కొనుదు సహ కవుల గమిన్
  శివ నామము జపియించుడు
  భవుడే మిము గాచు నెపుడు భవ్యత గలుగన్

  రిప్లయితొలగించండి
 3. శివ రాత్రి పర్వ దినమున
  శివ శివ యని బలుక గలుగు శివ సాయుజ్యం
  భవుడే యిట్లని జెప్పెను
  శివ నామము పలుకుడెపుడు సేమము కొఱకున్

  రిప్లయితొలగించండి
 4. అవును నేమాని పండితులు మహాశివరాత్రిని గూడిన మాఘమాసంలో అపురూపమైన శివస్తోత్రాల నందజేసి అందరినీ తరింప జేస్తున్నారు.

  రిప్లయితొలగించండి
 5. ఆర్యా,

  నా శ్యామలీయం బ్లాగులో కొద్దిసేపటి క్రితమే ప్రకటితమైన శివలింగ స్తుతి (దండకం) కూడా పరిశీలించగలరు.

  రిప్లయితొలగించండి
 6. శ్రీ భుజంగప్రయాతముల్ శివకరములు
  బాగు బాగు రవీందరు నాగరాజు

  రిప్లయితొలగించండి
 7. ఈ పర్వదినాన శంకరాభరణం బ్లాగును శివమయం చేసిన కవిమిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మనోహరమైన శివస్తుతిని అందించారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 8. శివశివ నీ పదాబ్జముల చిత్తము నిల్పగ నే నశక్తుడన్
  భవహర మెట్లు నాకికను? భావ్యమె దీనుని జేయ శోధన-
  మ్మెవరిక నాకు దిక్కిపుడు? హే కరుణాకర! చంద్రశేఖరా!
  చివరకు నీవు దక్క మరి? సేయవె నన్నొక భక్త రేణువున్

  రిప్లయితొలగించండి
 9. నమస్కారములు
  శ్రీ నాగరాజు రవీందర్ గారికి ధన్య వాదములు

  రిప్లయితొలగించండి