గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, అద్భుతమైన విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. ‘ఎంతయు - ఇంత’ ఈ రెండింట ఏదో ఒకటి ఉండడమే సబబు అనిపిస్తున్నైది. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుభాకాంక్షలను తెలియజేసిన శ్రీమతి జిలేబి గారికి శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి శ్రీ అన్నపురెడ్డి సత్యనారయాణ రెడ్డి గారికి, మరియు శ్రీ సుబ్బా రావు గారికి మా కృతజ్ఞతాపూర్వక అభినందనలు - సంతోషము. స్వస్తి.
నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అన్నవరపు సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అఖిల జగదంబ! నీదు రమ్యానన మను
రిప్లయితొలగించండిచంద్ర బింబమ్ములోన భాస్కరుడు వెలిగె
దక్షి ణేక్షణమై జగత్సాక్షి యగుచు
నతడు చైతన్య మొసగు జీవాళి కెల్ల
శాంతమూర్తియౌ శ్రీరామచంద్ర విభుడు
రిప్లయితొలగించండిభార్గవుం డెదురుగ నిల్చి పరుష వాక్య
ములను బల్కగ భయదుడై చెలగుట గన
చంద్ర బింబమ్మునందు భాస్కరుడు వెలిగె
వెలుగు వెన్నెల విరజిమ్మి యలసి పోతి
రిప్లయితొలగించండిమగత నిద్రను మునిగిన మత్తు వీడి
వేగ రమ్మనె తూరుపు వేట గాని
చంద్ర బింబమ్ము లోన భాస్కరుడు వెలిగె
కాంచుఁ డదిగొ మోముఁ గడిగి యెఱ్ఱని కుంకు
రిప్లయితొలగించండిమను ధరించినటుల మానినీ ము
ఖం బనియెడు చంద్రబింబమ్ములోన భా
స్కరుఁడు వెలిగె బొట్టుగా ముదమున.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు. ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒక్కబడిలోన విద్యార్థు లుంచినట్టి
రిప్లయితొలగించండిసౌరపరివార చిత్రాల శాలయందు
దీపములమధ్య నెంతేని దీప్తి బయట
చంద్రబింబమ్ము, లోన భాస్కరుడు వెలిగె.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిప్లానిటోరియం విషయంగా మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు సమస్యను ఆటవెలదిలో మలచి ఉపమాలంకారమును తొడిగి చంద్రముఖి మోములో సూర్యునిగా కుంకుమ బొట్టును తీర్చి దిద్దుట ప్రశంసనీయము. స్వస్తి.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ....
రిప్లయితొలగించండిమున్ను మిత్రుండు ముంచె రామన్న నటులె
యల్లుడైనను మామనే యదను జూచి
పదవి నందుండి కూల్చిన పగిది జూడ
చంద్ర బింబమ్ము లోన భాస్కరుడు వెలిగె!
రిప్లయితొలగించండిఅదిగో రామజోగీ వారు అమెరికా నందున
భారత ప్రచండం రేతిరి అమెరికా అంబుజుడు !
తెలుగు తేజం నవ్య 'జెర్రసేపు',మా చెంత చంద్రబింబమ్ములోన భాస్కరుఁడు వెలిగె.!!
రామజోగి వారికి
శుభాకాంక్షల తో
జిలేబి
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
ధన్యవాదాలు.
కుంతికెంతయు ననుమానమింత గలుగ
రిప్లయితొలగించండిమహిమజూడగ మంత్రమ్ము మదిని దలచె
గదికి బయటను వెలసెను గగనమందు
చంద్ర బింబమ్ము, లోన భాస్కరుడు వెలిగె
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
‘ఎంతయు - ఇంత’ ఈ రెండింట ఏదో ఒకటి ఉండడమే సబబు అనిపిస్తున్నైది.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారూ, చంద్రునికాంతి సూర్యునిదే అని కదా ఆర్యోక్తి.
రిప్లయితొలగించండిఅరయఁ జూడంగ సూర్యుండునఖిలతేజ
యుతుఁడు నఖిలాండలోక సన్నుతుఁడు తనదు
కిరణ సంపత్తి నొసఁగె చందురిని కపుడు
చంద్రబింబములోన భాస్కరుఁడు వెలిగె.
కానబడుచుండు జిరు మచ్చ కంటి కెపుడు
రిప్లయితొలగించండిచంద్ర బింబమ్ము లోన, భాస్కరుడు వెలిగె
చంద్ర కిరణాలు సోకగ సాగరమును
దినకరుండును జంద్రుండు దిరుగు చుండి
యొకరి తదుపరి మఱి యొక రుందు రిలను
శ్రీ శంకరయ్యగారికి నమస్సులు
రిప్లయితొలగించండిలేత చిరునవ్వులే పంచు లేమ తోడ
నాట లాడుచు శృతి మించి పాట పాడ
చంద్రబింబమ్ములోన భాస్కరుఁడు వెలిగె
బ్రతిమ లాడంగ కౌముది పంచె రవియె
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
చిలిపి జాబిలి వలె పతి నలర జేసి
రూక్ష వీక్షణ బరపుచు శిక్ష జేయ
ప్రణయ కోపమీ రీతిని వరలు ననగ
చంద్ర బింబము లోన భాస్కరుడు వెలిగె
అందరి పూరణలూ బాగున్నవి.
రిప్లయితొలగించండిపిట్టలొక రెండు కలహము పెంచుకొనగ
పిల్లి దాని లాభముకయి వృద్ధి చేసె;
కరుణ కరిగెడు మనములు కఠినమవగ
చంద్రబింబమ్ములోన భాస్కరుఁడు వెలిగె.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిశాస్త్రీయకారణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చందురునకు’ అనండి.
*
సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
‘పగలే వెన్నెల’ పాట గుర్తుకొచ్చిందా? మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘లాభముకయి’ అన్నదానిని ‘లాభమునకు’ అనండి.
శుభాకాంక్షలను తెలియజేసిన
రిప్లయితొలగించండిశ్రీమతి జిలేబి గారికి
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
శ్రీ అన్నపురెడ్డి సత్యనారయాణ రెడ్డి గారికి, మరియు
శ్రీ సుబ్బా రావు గారికి
మా కృతజ్ఞతాపూర్వక అభినందనలు - సంతోషము.
స్వస్తి.
కలువ ఱేనికి ప్రతిరోజు కాంతి నొసగి
రిప్లయితొలగించండివేయి కిరణాల భానుండు వెలుగు చుండు
తమ్మి దొరతోడ శోభిల్లు ధాత్రి గాదె
చంద్ర బింబమ్మునందు భాస్కరుడు వెలిగె
వజ్రహారమ్ము దెచ్చిన పతిని జూచి
రిప్లయితొలగించండిఆలి వదనమ్ము కాంతితో వెలిగిపోగ
అనియె పెనిమిటి సతితోడ, నలరుబోడి!
చంద్ర బింబమ్ము లోన భాస్కరుడు వెలిగె
మాస్టరుగారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరణతో నా పూరణ ...
కుంతి కన్నియ కనుమానమింత గలుగ
మహిమజూడగ మంత్రమ్ము మదిని దలచె
గదికి బయటను వెలసెను గగనమందు
చంద్ర బింబమ్ము, లోన భాస్కరుడు వెలిగె
ఎల్ల లోకుల నేలుచు నుల్ల మలర
రిప్లయితొలగించండికరుణ కిరణాల చల్లగా నరయు తల్లి
మహిషు గనినంత భగ్గున మండి పడెను చంద్రబింబమ్ములోన భాస్కరుఁడు వెలిగె
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నవరపు సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.