23, ఫిబ్రవరి 2014, ఆదివారం

పద్య రచన – 516 (వేరుపడిన సోదరులు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
వేరుపడిన సోదరులు. 

6 కామెంట్‌లు:

 1. సోదరులు వేరు పడుటలు
  చీదరయే గాని పొసగు చిత్తము లేకన్
  మీడట వేరును బడి కన
  నాదరణలు తగ్గకున్న నదియును సుఖమే.

  రిప్లయితొలగించండి
 2. సోదరులు వేరు పడుటలు
  చీదరయే గాని పొసగు చిత్తము లేకన్
  మీదట వేరును బడి కన
  నాదరణలు తగ్గకున్న నదియును సుఖమే.

  రిప్లయితొలగించండి
 3. అన్నదమ్ములు విడిపోవు టున్న నిజము
  కలసి యెదిగిన యిరువురి కలలు పండు
  ద్వేషభావము విడచుట ధీరగుణము
  చేయవలయును త్యాగాలు చేయిగలిపి

  రిప్లయితొలగించండి
 4. కుత్తుకన్ తెగఁ గోయువారిని,క్రూర నీతుల నేతలన్
  మత్తు మున్గిన నన్నదమ్ములు మాదిమాదని పోరుచున్
  జిత్తులందిలు దోచువారిని , చేవతో నెదిరింపగా
  సత్తు జచ్చి యిదో యటంచిటు స్వంత వారల నిట్లహో
  కత్తికిన్ బలి యిచ్చువేళల కంటినీటికి కొంచెమే?

  రిప్లయితొలగించండి
 5. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  నాటి దేశ విభజన చే నేటివరకు
  ద్వేషభావనపోలేదు .తెలిసి కూడ
  బలిమి ఆంధ్రుడు తెలగాణ కలహములను
  పెంచి విభజించి పాలింప నెంచినారు
  జలధి యుప్పుకు తేనెల తెలగనాడు
  గొడ్డు గుంటూరు కారము దొడ్డ సీమ
  కలసి యే రీతి నూత్న యుగాది జరుగు ?
  తెలుగు తల్లి యావేదన దీర్చ తరమె

  రిప్లయితొలగించండి
 6. మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు...
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి