7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1317 (మేక మెడచన్నుపాలతో)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మేక మెడచన్నుపాలతో మేలు గలుగు.
ఈ సమస్యను పంపిన కొదుమగొండ్ల వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. మేక మెడ చన్ను పాలతో మేలు గలుగు
    నను విధమ్మగు నేతల నాశ్రయింప
    నట్టి దౌర్భాగ్య మేలొకో? అఖిల విశ్వ
    పతిని సేవింప నొదవును భాగ్య రాశి

    రిప్లయితొలగించండి
  2. రాజ కీయపు మంటలు రావణ చితి
    పేద ప్రజలకు బ్రతుకున పిడుగు బాటు
    మేక మెడచన్ను పాలతో మేలు గలుగు
    ననెడి పలుకులు వినగోరు నవ శకమ్ము

    రిప్లయితొలగించండి
  3. ఔషధంబులు గొన్నింటి కవసరమగు
    సత్య మియ్యది నమ్ముడు సర్వజనులు
    పలుకగానేల యీరీతి నలుపటంచు
    మేక,మెడ? చన్నుపాలతో మేలుగలుగు.

    రిప్లయితొలగించండి
  4. “మేక మెడచన్నుపాలతో మేలు గలుగు
    ముక్కు మూసుకొనిన చాలు మోక్షమొచ్చు
    చిటికె వేసిన చాలును సిరులు కురియు
    మాయ మంత్రము లిచ్చును మహిమలెన్నొ”

    కుర్రకారు కివియె చూపు గుడ్డిదారి
    కష్టకాలమందివి కొమ్ముగాయవింక
    నమ్మవలదిటువంటివి వమ్మువోక
    సొంత బుద్ధిని నమ్మరా ఎంతకైన!

    రిప్లయితొలగించండి

  5. మోడీ చాయి కప్పుతో మేలు కలుగు ?
    కాంగీ భాయ్ భజంత్రీ తో మేలు కలుగు ?
    అమ్మ సీపీఎమ్ము మైత్రి తో మేలు కలుగు ?
    మేక మెడచన్నుపాలతో మేలు గలుగు ?


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. జిలేబీ గారి భావానికి నా పద్యరూపము....

    మేటి మోడి టీకప్పుతో మేలు గలుగు,
    మించు కాంగ్రెస్ భజంత్రీల మేలు గలుగు,
    మేడము సిపియం మైత్రితో మేలు గలుగు,
    మేక మెడచన్నుపాలతో మేలు గలుగు.

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మాస్టరు గారూ ! జిలేబిగారి తీయని భావాన్ని చక్కగా తేట(గీతి) పరిచారు ..బాగుంది.

    రిప్లయితొలగించండి
  9. మల్లి తోడను తాజెప్పె మంత్రగాడు
    తెమ్ము వీటిని సాంబ్రాణి తిప్పతీగ
    నల్ల కోడిని, నిమ్మయు, నాగజెముడు
    మేక మెడచన్ను, పాలతో మేలు గలుగు.

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    మీ మంత్రగాడిచ్చిన లిస్ట్ బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. పాము పుట్టలో నుండియే పాలు త్రాగు
    ఇనుప దూలము లన్నియు ఎలుక మ్రింగు
    నన్న సామెతల్ మెండుగా నున్న చోట
    మేక మెడ చన్ను పాలతో మేలు కలుగు

    దున్న యీనెనని తెలుప దూడ యెచట
    నన్న సామెత విన్నట్టి దున్న యొకడు
    వెల్లడించెను క్రిందున్న పొల్లు మాట
    మేక మెడ చన్ను పాలతో మేలు జరుగు

    సృష్టి చేసెను క్రిందున్న సొల్లు మాట
    అనవచ్చా. తెలియ జేయండి.




    రిప్లయితొలగించండి
  12. అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    ‘సృష్టి చేసెను క్రిందున్న సొల్లు మాట’ అన్న పాదంలో యతి తప్పింది. సృ కు సిసీసెసే లతో యతి చెల్లుతుంది.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

    మంచి సమస్యను పంపిన శ్రీ వినోద్ కుమార్ గారికి ధన్యవాదములు.

    అందరి పూరణలు అలరించు చున్నవి.జిలేబి గారి రాజకీయ పద్యము బహుబాగున్నది.

    టివీలో జూపిన విషయము గురుదేవులకు తెలుపుటకు సరదాగా నా పూరణ
    =============*================
    మేక మెడ చన్ను పాలతో మేలు కలుగు
    ననుచు కుర్ర కారు వెదుక నవని యందు
    దొరకె పాలిచ్చు పోతులు, దొరల కెల్ల
    బంచ పాలను దెచ్చితి పట్టు బట్టి!

    ( పోతు= మగ మేక )

    రిప్లయితొలగించండి
  14. వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
    గారికి వందనములు

    అజమునకు తెలుగు భాషలో నర్ధమేమి?
    పామునెచ్చోటధరియించు పరమశివుడు ?
    కండ్ల కలకకు దేనితోకలుగు మేలు ?
    మేక ,మెడ,చన్ను పాలతో మేలు కలుగు .

    రిప్లయితొలగించండి
  16. శాకముల గొనుసాత్విక జంతువయ్యు
    తిరిగి తినులేత చివురుల త్రిప్పి త్రిప్పి
    మేకమెడ,చన్నుపాలతో మేలు గలుగు
    మూలికా మిళితంబగు పాలుగాన!

    రిప్లయితొలగించండి
  17. శాకముల గొనుసాత్విక జంతువయ్యు
    తిరిగి తినులేత చివురుల త్రిప్పి త్రిప్పి
    మేకమెడ,చన్నుపాలతో మేలు గలుగు
    మూలికా మిళితంబగు పాలుగాన!

    రిప్లయితొలగించండి
  18. గురుదేవులకు యితర పెద్దలందరికి వందనములు.ఇప్పుడు నాకు అరువది మూడు యేండ్లు నిండాయి. అరువది రెండవయేట పదవ తరగతి గ్రామరు పుస్తకం కొని, పద్యాలు వ్రాయటానికి ప్రయత్నం మొదలు పెట్టాను.ఈ సంవత్సరము రోజులలో ఆటవెలది, తేటగీతి, సీసపద్యం, కందము నేర్చుకోగలిగాను. ముఖ్య మైన వృత్తాలు ఉత్పలమాల, చంపకమాల ఇప్పుడే మొదలు పెట్టాను. శార్ధూలం, మత్తేభం ఇంకా ప్రయత్నము చేయలెదు.ఘట్టి కృష్ణ మూర్తి గారు, చంద్రశేఖర రెడ్డి గారు, రామ కృష్ణ రావు గారు తగిన సలహాలు యిస్తున్నారు. శంకరాభరణం ద్వారా మీతో కలవటం చాలా సంతోషం గా ఉన్నది. మీ అందరిరచనలు చూస్తూ ఎంతోనేర్చుకుంటున్నాను. గురుదేవులు కంది శంకరయ్య గారు చేస్తున్న తెలుగు భాషా సేవకు చాలా సంతోషంగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  19. మేక మెడ చన్ను పాలతో మేలు గలుగు
    ననెడి మాటలు వినరాదు నవని నెవరు
    వ్యాధి నయముచేయగమంచి వైద్యులుండ
    మూఢ నమ్మకములమూట మోయునేల

    రిప్లయితొలగించండి
  20. మేక మెడచన్నుపాలతో మేలు గలుగు
    రంగు రాళ్లను కొనగనే లైఫు మారు
    చెక్క చెప్పుతో గొట్టిన చెడుగు పోవు
    ననెడి మాటల నెవ్వరూ నమ్మరాదు

    రిప్లయితొలగించండి
  21. శ్రీ శంకరయ్యగారికి నమస్సులు

    మేకకున్నవి చన్నులు మెడకు గాక
    పొట్టలో గూడ పాలీయ పొంకముగను
    పట్ట వీలగు పోట్లాడ గట్టిగాను
    మేక మెడచన్ను; పాలతో మేలు గలుగు

    రిప్లయితొలగించండి
  22. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    సంతోషం! మనమిద్దరం సమవయస్కులమే. పద్యరచన పట్ల మీరు చూపుతున్న ఆసక్తికి ఆనందిస్తున్నాను. నాతోపాటు, పండిత నేమాని వారు, బ్లాగు మిత్రులు మీకు సహకరిస్తారు. మీ రచనా వ్యాసంగాన్ని కొనసాగించండి.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘వినరాదు + అవని’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. కనుక అక్కడ ‘వినగూడ దవని నెవరు’ అనండి.
    రెండవ పూరణలో ‘ఎవరూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘ఎవరు’ అంటే చాలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ప్రశ్నార్థకంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ చంద్రశేఖర్ గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    మోక్షమొచ్చు అనుట సాధువు కాదు. మోక్షమొదవు అందాము.
    స్వస్తి.

    శ్రీ అన్నపురెడ్డి సత్యనారయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యములు బాగుగ నున్నవి. మీకు పద్య రచన యందు ఆసక్తి కలుగుట ముదావహము. సరస్వతీ దేవి యొక్క అనుగ్రహము లేనిదే కవిత్వము అలవడదు. మీరు ఆ తల్లి అనుగ్రహమునకు పాత్రులు అయినవారు. అభినందనలు. మీ పద్య రచనా వ్యాసంగము నిరాటంకముగా సాగవలెనని మా ఆశీస్సులు. మా నుండి మంచి సహకారము ఈ విషయములో మీకు తప్పక లభించగలదు. స్వస్తి.

    శ్రీమతి శైలజ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యములు బాగుగ నున్నవి. ఒక సూచన: లైఫు మారు అనుటకు బదులుగా బ్రతుకు మెరయు అని మార్చండి. చాల బాగుగ నుండును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డిగారి మాతృభాషా మమకారానికి, పద్యరచానోత్సాహానికి ముచ్చటగా నున్నది. విద్యావ్యాసంగమునకు వయసుతో పని లేదు. వారి అభిలాష పరిపూర్ణముగా తీరగలదు. వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. మేక మెడచన్నుపాలతో మేలు గలుగు
    ననుట యెట్టిదో లుబ్ధుని ధనవితరణ
    ఫలము నట్టిదే యందురు పండితాళి
    నిజము గ్రహియించి మెలగుట నీతి యగును.

    రిప్లయితొలగించండి
  26. మిస్సన్న గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. స్ఫోటకము మందు పశులమశూచియగునె ?
    పనులివి విను మజాగళస్తనములన్న
    దీక్షబూని జెన్నరది సాధించి పలికె
    మేక మెడచన్నుపాలతో మేలు గలుగు
    (Edward Jenner cowpox నుండి smallpox కి vaccine తయారుచేసాడు. మొదట్లో చాలామంది దీనిని వ్యతిరేకించారు. హేళన చేసారు. ఇంచుమించు చాలామంది శాస్త్రవేత్తల కథలు ఇలాగే ఉంటాయి.)

    రిప్లయితొలగించండి
  28. 'ప్ర' లఘువు అనుకుంటున్నాను.

    త్రిప్ప, మెడ మీద కాళ్ళుండు తెలివి లేని
    ప్రజలు కొరగాని ఆహార ప్రకట నవిని
    నవ్య పరమౌషదమనుచు నమ్మ నిట్లు
    మేక మెడచన్నుపాలతో మేలు గలుగు

    రిప్లయితొలగించండి
  29. ఆదిత్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మాజేటి సుమలత గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి