సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘చాలున్ + అగు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చెండినచోఁ జా/ లగు నతనికి...’ అనండి. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, సిగలో రత్నంగా ఉదయం కేవలం ఒక పద్యంతో సరిపెట్టారనుకున్నాను. కాని ఇప్పుడు సర్వాంగసుందరమైన మీ ఖండిక చదివి పులకించిపోయాను. చిత్రం యొక్క పూర్వపరాలను చక్కని పద్యాలలో వివరించారు. అభినందనలు, ధన్యవాదాలు. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘ఎట్టు లోర్తు’ను ‘ఎట్టు లోర్చు’ అంటే అన్వయం కుదురుతుంది. * అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
బాలు రనక నిర్దయ నుపపాండవులను
రిప్లయితొలగించండిగొంతులను కోసి చంపుట క్రూరకృత్య
మే, గురుసుతుండు బ్రాహ్మణుఁ డితనిఁ జంప
వల దనుచును వారించె ద్రోవది పతులను.
సిగలో రత్నముఁ దరుగుట
రిప్లయితొలగించండియగునిక సరియైన శిక్ష యర్జున! ద్రౌణిన్
తెగటార్చ వలదు విప్రుం
డగుటను వినుమంచు బలికె నచ్యుతు డపుడున్.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
గురుపుత్రుండును బ్రాహ్మణుం డగుటచే గోపమ్మునున్ వీడుమా
రిప్లయితొలగించండినరసింహా! విడుమింక ద్రోణతనయున్ బాపాత్మునిన్ గ్రూరునిన్
బరిహారంబుగ గోసి వీని సిగలో భాసిల్లు రత్నమ్ము స
త్వరమీవే గొను టొప్పటంచు బలికెన్ బద్మేక్షణుం డయ్యెడన్
(నరసింహా : నరులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా!)
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమత్తేభంలో నరసింహుని సంబోధిస్తూ అద్భుతమైన పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
గురుపుత్రుండితఁడార్యులార పగలన్ కోపమ్ములన్ వీడి స
రిప్లయితొలగించండిత్వరమే బంధవిముక్తుజేసి కరుణా వారాశియుప్పొంగ బం
ధురమై యొప్పుచునున్న రత్నకళికాద్యోతమ్మునున్ ద్రుంచుటే
సరియౌ దండనమంచు నమ్మితిని శిక్షల్ వీనికేమిత్తురో.
తెగనరకవలదు ద్రౌణిన్
రిప్లయితొలగించండిసిగలో దీపించుమణిని చెండిన జాలున్
యగునతనికితగుదండన
వగవలదనిద్రోవదెలిపి వారించెపతిన్
"గురుసుతుడవదెట్టుల మా
రిప్లయితొలగించండికురువంశాంకురముల పయి క్రోధముఁ జూపం
గరుణను విడచితివోయీ?
త్వరపడితివ"నుచును పత్ని తల్లడిలంగా
"ఖండించెద నీ కుత్తుక!
పండెను నీ పాపమం"చు ఫల్గుణుడుఱికెన్,
"ముండనముఁ జేయ శిరమును
దండన యదె భూసురునకు" దైత్యారి యనెన్.
బాపడీతడు మార్చగ రూపమితని
రిప్లయితొలగించండిశిరము నందలి రత్నము ఛే ద నంబు
జేయుడని పతుల ను గూర్చి చేతులెత్తి
వేడు కొనియెను ద్రోవది వివశత నన
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చాలున్ + అగు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చెండినచోఁ జా/ లగు నతనికి...’ అనండి.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిద్రౌపది యశ్వత్థామను
రిప్లయితొలగించండిపాపివి నీవంచు చూచి బహువిధములుగా
కోపోద్రేకభవంబగు
తాపంబున పలికెనిట్లు తానా వేళన్. 1.
చిన్నవారల నిద్రనున్నట్టివారలన్
..........సంహరించుట నీకు సముచితంబె?
నీవిరోధులుగారు, నిందింపగా రారు
..........వారి జంపుట కేమి కారణంబు?
గురుపుత్రుడవు నీవు కరుణ యించుక లేక
..........పుత్రతుల్యుల నెట్లు పొడిచినావు?
ద్రోణపుత్రుడవౌచు దురితమిట్లొనరించ
..........చేతులెట్లాడెనో ఆతతాయి?
శస్త్ర ధరులు కారు, సమరంబు నొనరింప
దలచి రమ్మటంచు బిలువబోరు
భద్రమూర్తులౌచు పవళించి యున్నట్టి
వారి జంపి యేమి బడసినావు? 2.
అని ద్రౌపది పలుకంగా
విని, పార్థుని యత్నమరసి వెన్నుం డనియెన్
ఘనతరమగు దురితంబును
చెనటితనంబును వహించి చేసె నితండున్. 4.
క్షమియింపరానట్టి కలుషమీతడు చేసె
..........హంతవ్యు డనుమాన మింతలేదు,
శిశులజంపుట జేసి పశుసమానుండయ్యె
..........బాపడా యీతండు పాపిగాని,
దుర్మార్గుడైన యీ ద్రోణపుత్రుని జంప
..........నుద్యమించుట పార్థ! యుచితమయ్యు
బ్రాహ్మణుండై యుంట ప్రాణాపహరణంబు
..........తగని దీతనిపట్ల దాన నిపుడు
పొగ రణంగు నట్లు తగురీతి యోచించి
వీని పనికి తగినదాని నరసి
రాక్షసాత్ము నితని శిక్షింపవలె గాన
వీరవర్య! యిద్ది వినుము విజయ! 5.
శిరముపైన వెలుగు శ్రేష్ఠమౌరత్నంబు
పెఱకివేసి శిఖను తఱుగు పనియె
అర్హమైన దట్టి యవమానభారంబె
చాలు నితని కిపుడు సవ్యసాచి! 6.
నిదుర బోయిన పసివారి నేల జంపె
రిప్లయితొలగించండితల్ల డిల్లగ యెదకోత వెల్లువ గను
నిట్టి బాధను గురుపత్ని యెట్టు లోర్తు
పాడి గాదని పాంచాలి వేడె పతుల
పార్థ గురుపుత్రుఁ జంపుట పాడి గాదు
రిప్లయితొలగించండిమానవతి కృష్ణ మాటలు మానితములు
శిశులజంపిన వీనికి చేటు మూడు
అనియనునయించెను విజయు నచ్యుతుండు
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిసిగలో రత్నంగా ఉదయం కేవలం ఒక పద్యంతో సరిపెట్టారనుకున్నాను. కాని ఇప్పుడు సర్వాంగసుందరమైన మీ ఖండిక చదివి పులకించిపోయాను. చిత్రం యొక్క పూర్వపరాలను చక్కని పద్యాలలో వివరించారు. అభినందనలు, ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘ఎట్టు లోర్తు’ను ‘ఎట్టు లోర్చు’ అంటే అన్వయం కుదురుతుంది.
*
అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ద్రోణ పుత్రుని బంధించి దోషి వీడు
రిప్లయితొలగించండిబాల పాండవ హంతకు డేల జాలి
ఆనతీయుము ఖండింతు వీని శిరము
ననిన భీముని గని పల్కె నంత కృష్ణ.
కన్న బిడ్డల జంపెను కరుణ మాలి
వీని జంపుద మందురా? వీని తల్లి
కడుపు మండదే? తల్లినై కన్న కడుపు
చిచ్చు రగిలించ భావ్యమే చెప్పు నాథ!
వీడు హంతకు డైనను వీని తండ్రి
మీకు గురువైన కతమున మేలు గాదు
ప్రాణముల దీయ, శిరమున భాసిలు మణి
పెరికి విడువుడు చాలనె హరి యది విని.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమంచి పద్యాలను వ్రాశారు. అభినందనలు.