21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

పద్య రచన – 514

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. గట్టుపైకి వత్సను జేర్చగా గజంబు
    యత్న మొనరించు చుండెనో యాదిదేవ!
    అటులనే భవ బాధల నన్ని బాపి
    గట్టు నెక్కించుమా నన్ను కరుణ మెరయ

    రిప్లయితొలగించండి
  2. మమత ప్రేమతోడ మత్త వారణము తాఁ
    లొయనుండి శిశువు తీయు చుండె
    మమత సమత మరచి మానవ మృగములు
    లోయలోకి పరుల తోయు చుండ్రి

    రిప్లయితొలగించండి
  3. గోతి యందుండు వత్సను గోము తోడ
    లాగు చుండెను గరాన లలితముగను
    తల్లి యేనుగు, జూడుడు పిల్లను నట
    తల్లి ప్రేమ కు సాటిది ధరను లేదు

    రిప్లయితొలగించండి
  4. కానల తీసిన గోతిన
    కూనయె పడిపోయెనయ్యొ! కుంజరమదివో!
    ప్రాణము విలవిల లాడగ
    పూనికతోలాగుచుండె ముద్దుల పట్టిన్

    రిప్లయితొలగించండి
  5. తనదు బిడ్డను కాపాడు తపన తోడ
    గజము యత్నము జేయుట గాంచి యైన
    భ్రూణ హత్యలు చలిపెడు పాప జనులు
    కాంచి ప్రేమతో పెంచుట గాంచ వలయు

    రిప్లయితొలగించండి
  6. మొదటి పద్యానికి చిన్న సవరణ " లోయ లోకి శిశుల త్రోయు చుండ్రి"

    రిప్లయితొలగించండి
  7. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వంద నములు
    గిరికి భారమ్ము కాబోవు తరువు లన్ని
    పిల్ల భారమ్ము కాబోదు తల్లి కెపుడు
    గుంటలో పడి నట్టి యా గున్న ఏన్గు
    నెటుల పైకెత్తు చున్నదో యిభ్య గనుమ

    రిప్లయితొలగించండి
  8. ఈ విశేషమైన రోజున తెలుగున మొదటి ఛందముగా చెప్పబడు తరువోజ--

    దరిజేర్చి కాపాడు తల్లి గజమున దక్షిణామూర్తి! నీ దాక్షిణ్యముఁ గని
    సరిలేరు నీకంచు సాష్టాంగపడితి! సౌహార్ద్రమునుఁ జూపు సర్వేశ !భువిని
    విరళమ్మటంచని పింగళాక్షుఁ గన ప్రీతి కైలాసము వేంచేయదల్తు!
    కరుణతో ననుఁజూడు గంగాధర! హర! కరుణాలవాల!శ్రీ కంఠ!గిరీశ!

    రిప్లయితొలగించండి
  9. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి మిత్రుల పద్యములన్నియును చాల బాగుగ నున్నవి.
    అందరికి అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి