22, ఫిబ్రవరి 2014, శనివారం

శ్రీమాతృ స్తుతి

శ్రీమాతృ స్తుతి
రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు 


భుజంగప్రయాతము:
మహావారిజాతాటవీ మధ్య సంస్థాం
మహానంద సాంద్రాం మహావిశ్వనేత్రీం
మహాయోగదాత్రీం స్ఫురద్దివ్య గాత్రీం
మహర్షి వ్రజారాధితాం భావయామి    

సహస్రాక్ష ముఖ్యామర స్తూయమానాం
సహస్రాంశు శీతాంశు వహ్ని త్రినేత్రాం
సహస్రాంశు కోటి ప్రభాపూర్ణ గాత్రీం
సహస్రార పద్మాసనస్థాం నమామి

శివాం శ్రీకరీం సింహరాజాధిరూఢాం
భవానీం భవాంబోధి పోతాం శరణ్యాం
వివేకప్రదాం వేద వేదాంతవేద్యాం
నవీనేందు భూషాం త్రినేత్రాం నమామి

చిదగ్నిప్రభూతాం సరోజాత హస్తాం
చిదానంద రూపాం మనోరూప చాపాం
సదా లోక రక్షైక దక్షాం భవానీం
హృదంభోరుహస్థాం మహేశీం నమామి

అకారాది సర్వాక్షరాకార యుక్తాం
త్రికూటాత్మికాం శుద్ధవిద్యా స్వరూపాం
త్రికాలాంచిత జ్ఞాన సంపత్సమృద్ధాం
త్రికోణాంతరస్థాం త్రివర్ణాం నమామి

4 కామెంట్‌లు:

 1. మాతయనగను శారద మాత యెగద
  వంద నంబులు నామెకు వంద లాది
  కరుణ జూపును నిత్యము కఠిను నైన
  సందియంబును నిసుమంత యిందు లేదు

  రిప్లయితొలగించండి
 2. గురువులకు ప్రణామములు
  శ్రీ మాతృస్తుతి అనుదినము స్తుతించు కోగల అదృష్టాన్ని కలిగించి నందులకు కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 3. శ్రీ మాతృస్తుతి చాలా బాగుంది. అన్నయ్య గారికి వందనములు.

  రిప్లయితొలగించండి