26, ఫిబ్రవరి 2014, బుధవారం

దేవీస్తోత్రము

దేవీస్తోత్రము

శ్లో:
యా మామనంతి మునయః ప్రకృతిం పురాణీం
విద్యేతి యాం శ్రుతిరహస్య విదో వదంతి
తామర్థ పల్లవిత శంకర రూప ముద్రాం
దేవీ మనన్య శరణ శ్శరణం ప్రపద్యే.

స్వేఛ్ఛానువాదము
నేమాని రామజోగి సన్యాసి రావు

ఏ తల్లి గూర్చి మునీశ్వరు లందురో
    ప్రకృతి మాతయని పురాణి యనుచు
నే దేవినిన్ గూర్చి వేదసార విదులు
    తెలతురో విద్యాధిదేవి యనుచు
నే జగన్మాత విశ్వేశ్వరు దేహాన
    వామార్థ భాగమై పరగుచుండు
నే పరాదేవత యితరు లీయగలేని
    భద్రత గూర్చును భక్త తతికి
నా మహాదేవి నాది మధ్యాంతరహిత
ప్రణవమూర్తి పరంజ్యోతి పరమఫలద
నఖిల భువనాధిదేవత నాదరమున
దలచి శరణంబు వేడుదు తత్పదముల.

3 కామెంట్‌లు:

  1. ప్రణామములు
    దేవీ స్తుతిని చక్కని శైలిలో అనువదించి మా కందించిన పూజ్య గురువులకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  2. శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో....
    దేవీ స్తుతిని చక్కని చిక్కని తెలుగులో అనువదించి మా కందించిన పూజ్య శ్రీ నేమాని గురుదేవులకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  3. అమ్మ ! శారద !యమ్మల కమ్మ వమ్మ !
    నిన్ను సేవించు మనుజుడు నేగు దివికి
    కాన నేనును సేవింతు కరుణ జూడు
    సకల గుణముల కిరవైన శారదాంబ !

    రిప్లయితొలగించండి