13, ఫిబ్రవరి 2014, గురువారం

సమస్యాపూరణం - 1323 (భగవద్గీతయె విషమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్.

28 కామెంట్‌లు:

  1. భగ వంతుడు శ్రీ కృష్ణుడు
    గగనం బునకెగసి పోయె గాలిని కలువన్
    జగ మంతయు మారినతరి
    భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్

    రిప్లయితొలగించండి
  2. జగమంతయు క్రైస్తవమున
    కెగబడుచున్నట్టి వేళ నితిహాసంబుల్
    నిగమంబులు రుచియించునె?
    భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్.

    రిప్లయితొలగించండి
  3. తగిలిన డాలరు కొలువుల
    నెగురుచు దేశమ్ము విడచి నేర్పగు వారల్
    వెగటని తెలుగే మరచిన
    భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్

    రిప్లయితొలగించండి
  4. వెగటగు పరమాన్నమ్మే
    తెగ రోగము గలుగువార్కి, తెలియక విలువన్
    పగ నెంచ హిందువులపయి
    భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్.

    రిప్లయితొలగించండి


  5. పొగిలెడు చెడు సంస్క్సృతిలో
    భగవద్గీతయె విషమ్ము, భారత భూమిన్
    తగు ధర్మ చింతనముతో
    ప్రగతికి సోపాన మదియె పరమార్థ హితా!

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    తెగబడి నృత్యములాటలు
    వెగటుగ స్నేహితులదినపు వేడ్కలు ప్రేమల్
    జగమును వెర్రెక్కించగ
    భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్.

    రిప్లయితొలగించండి
  7. నిగమంబుల విషయంబుల
    సుగమంబుగ జెప్పి మనకు శుభసూచకమై
    తగ, పాపపంకమునకిక
    భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్.

    విషమంటే జలము అనే అర్థము కూడా ఉన్నది కదా గురువుగారూ,
    ( విషస్యార్థే జలం హిస్యాత్ ........... )

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    పొగడిరి విదేశవాసులు
    భగవద్గీతా మృతమ్ముభక్తిని గ్రోలన్
    తగదు యిటుల మృష బల్కగ
    "భగవద్గీత యెవిషమ్ముభారత భూమిన్"



    రిప్లయితొలగించండి
  9. భగవంతుడులేడనుచును
    నగధరుడినినమ్మలేని నాస్తికులకున్
    నిగమము దెలియని వారికి
    భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్

    రిప్లయితొలగించండి
  10. పగఁ బూని నాస్తికత్వపు
    తగని ప్రచారము సలిపెడు తంత్రము లోనన్
    సగమే యెఱిగిన -నందురు
    " భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్ "

    రిప్లయితొలగించండి
  11. తగవే సంస్కృతి మఱచుట ?
    తగులగ పరమతపు గాలి, తలచరు గీతన్
    పగతుర మతమే అమృతము
    భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్

    రిప్లయితొలగించండి
  12. భగవన్ముఖమ్ము తెలిపిన
    జగదోద్ధారక పథమ్ము జన జీవనికిన్
    అగణిత దుర్గుణములకిల
    భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్!

    రిప్లయితొలగించండి
  13. శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    "జగదోద్ధారక" అను ప్రయోగము సాధువు కాదు. జగదుద్ధారక (జగత్ + ఉద్ధారక) అనుట సాధువు. సంగీత కారులు వాడిన పూర్వప్రయోగము కూడా సాధువు కాదు.

    రిప్లయితొలగించండి
  14. తగునే యిటు మాటాడుట
    భగవద్గీ తయె విషమ్ము భారత భూమిన్
    భగవద్గీతను బలువురు
    నిగమముగా దలతు రెపుడు నిజమిది వినుడీ !

    రిప్లయితొలగించండి
  15. పూజ్యగురుదేవులకు ధన్యవాదములతో సవరించిన పద్యం:
    భగవన్ముఖమ్ము తెలిపిన
    జగదుద్ధారక పథమ్ము జన జీవనికిన్
    అగణిత దుర్గుణములకిల
    భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్!

    రిప్లయితొలగించండి
  16. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    అర్థాంతరంతో మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    ‘తగదు + ఇటుల’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. అక్కడ ‘తగ దిట్టుల మృష బల్కగ’ అనండి.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు,
    నా పూరణ పై తమ అమూల్య మై న అభిప్రాయమును ఇవ్వండి. తప్పులుంటే సరి చేయండి.

    రిప్లయితొలగించండి
  18. మరొక పూరణ

    జగదీశ్వరుడు వచించెను
    భగవద్గీతయె ; విషమ్ము భారత భూమిన్
    రగులగ హస్తినను రణము
    మిగిలిరె కౌరవులు మిత్తి మ్రింగిన కతనన్?

    రిప్లయితొలగించండి
  19. అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మన్నించాలి. మీ పూరణను సమీక్షించడం మరిచిపోయాను.
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
    పర మత ప్రచార ప్రభంజనములతో మన సంస్కృతికి గ్లాని ఏర్పడినది అనుట వాస్తవమే. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని గార్కి, పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు. మీ సమీక్షకు, సలహాలకు కృతజ్ఞతలు, తిరుపతి దేవస్తానం వారు ముద్రించిన మహాభారతం పదునెనిమిది పర్వాలు టీకా తాత్పర్యాలతో సహా ఒక సారి చదివాను. భాగవతం టీ కా తాత్పర్యాలతో దొరికితే తెలియజేయండి.

    రిప్లయితొలగించండి
  22. సత్యనారాయణ రెడ్డి గారు,
    తిరుపతి దేవస్థానం వారు పోతన భాగవతాన్ని కూడా తాత్పర్యంతో ముద్రించినారు. ఈమధ్య హార్డ్ బౌండ్ తో ఐదు సంపుటాలుగా తిరిగి కొత్తగా అన్ని స్కందాలనూ ముద్రించినారు. కానీ ప్రతిపదార్థాలైతే లేవు.

    రిప్లయితొలగించండి
  23. లక్ష్మీ దేవి గారికి కృతజ్ఞతలు. ఆ పుస్తకములు చూశాను. నాకు తెలుభాష మీద పట్టు తక్కువగా ఉండటం వలన, ప్రతి పదార్థం ఉన్న పుస్తకములు కోసం చూస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  24. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని గురుదేవులకు నమస్కృతులు......
    దయచేసి భావ, గణదోషములను సవరించ మనవి..

    భగవంతుని మోక్షపదము
    భగవద్గీతయె, విషమ్ము భారత భూమిన్
    ఎగసిపడును దూషించిన
    తగులును పాపమ్ము మిగుల తథ్యము సుమ్మీ.

    రిప్లయితొలగించండి
  25. భగవద్గీతను కొనెదరు
    ధగధగ మనునట్ట తోడ దంభము మీరన్
    తెగబడి చదువుర నీవన
    భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్

    రిప్లయితొలగించండి


  26. సుగుణా! శ్రీకంది కవీ !
    భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్
    జగతిని యనసరి యగునా ;
    పగవారికి గూడ యిట్లు పాఠము వలదోయ్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. ఒకప్పుడు:

    తగవుల భాగ్యపు నగరిని
    వెగటగు పూర్వపు పురమున వేకువ నందున్
    తగులడ టోపీ వారలు
    భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్

    రిప్లయితొలగించండి