16, ఫిబ్రవరి 2014, ఆదివారం

పద్య రచన – 509

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. పాండురంగని కిది బలుసేవగద రహో!
    భక్తి తోడ బుడుగు పట్టె గొడుగు
    ప్రతిమ యందు కూడ భగవంతునింగని,
    నా కనులు చెమర్చె నవ్వుకొనుచు (కొనగ)!

    రిప్లయితొలగించండి
  2. పాండు రంగ నిగని పసిబాలుడేవచ్చి
    భక్తి తోడ గొడుగు బట్టె గనుడు
    పరమ భక్తి విత్తు పరమాత్మ బొందించు
    రంగ నాధ సేవ రక్ష గాదె

    రిప్లయితొలగించండి
  3. తనకగు దైవము తదిసిన
    తనకెవ్వరింక దిక్కని తపనుండగుచున్
    గొనకొని గొడుగున్ బట్టుచు
    కనిపించెన్ బాలుడొకడు కనుగవ మెరియన్.

    రిప్లయితొలగించండి
  4. చిన్నవాని మదిని చిన్మయుండుండును
    బయటనున్న వాడు బరగ వాడె
    పన్నగంపు గొడుగు నెన్నగా లేదనుచు
    చిట్టి బుడుగు పట్టె చిన్ని గొడుగు.

    రిప్లయితొలగించండి
  5. ఔరా! భువనావనుడగు
    కారుణ్యాత్ముండు ప్రభుడు కమలదళాక్షుం
    డీరీతి యాత్మరక్షణ
    గోరుచు ఛత్రంబు నందె కూరిమి నిండన్.

    మెండుగ వరముల నొసగుచు
    ఖండించుచు కల్మషంబు ఘనతరముగ మా
    కండగ నన్నిట నిల్తువు
    దండం బో పాండురంగ! దయజూపవయా!

    రిప్లయితొలగించండి
  6. ధన్యవాదాలు, అక్కయ్యగారూ. మాస్టారికికూడా నెనరులు, మంచి ఫోటోవేసినందుకు.

    రిప్లయితొలగించండి
  7. చంద్రశేఖర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    రఘుకుమార్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. దానిని ‘తనకెవరిక దిక్కటంచు...’ అనండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పాండురంగని బ్రతిమకు బాలు డొకడు
    పట్టె గొడుగును జూడుడు భక్తి తోడ
    వాని భక్తికి మెచ్చియా భవుడు మఱి ని
    ఇచ్చు గావుత !వరముల నెన్నొ దయను .

    రిప్లయితొలగించండి
  9. గురువుగారూ,ఎక్కడ సంపాదించినారో గానీ భలే బుల్లివాడిని జూపించినారీరోజు.

    కొండను గొడుగుగా గొల్లలఁ గాచెడు
    గోపనికయి బట్టె గొడుగు గనుడు
    తనవోలె బాలుడై ధరణిని నడయాడు
    కృష్ణుని మురిపించు క్రీడ జూపె
    కన్నుల తనివార గాంచెదనంచును
    శ్రద్ధగా దృక్కుల చాచెగనుడు
    భక్తిగా సేవనుఁ బాటించురీతిని
    పెద్దవారలకైన పెరిమిఁ గరిపె

    జయము పాండురంగ! జయము జయము నీకు!
    జయము పండరీశ! జలధిశయన !
    జయము నీకు కలుగ జయము జగములకు!
    జయము బాలుకొసగు చల్లనయ్య!

    రిప్లయితొలగించండి
  10. ప్రజల కోర్కెలు దీర్చెడు పాండు రంగ
    దీక్ష బూనితి నీయొక్క రక్ష జేయ
    గొడుగు బట్టితి నీసేవ కోరినేను
    రక్ష జేయుము దీనుల కక్షరుండ

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ఆ చిత్రాన్ని ఫేస్ బుక్కునుండి సేకరించాను.
    మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. మీ నాన్నా అమ్మేరీ ?
    పోనీలే భయపడొద్దు.
    బోలెడు పే...ద్దోణ్ణే నేను !!
    గొడుగులో లాలా !!
    నిన్నూ వాననుండి లచ్చించేస్తా!

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    ఎటకు పయనమ్ము శౌరి యీ యెoడ లోన?
    కరిని గావగ వలయునా ?కానవాస
    మునక?దనుజుల హతమార్చ ధనువు యేది ?
    జాగుసేయక గొనుము యీ ఛత్ర ఛాయ

    రిప్లయితొలగించండి
  14. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ఒక్కడు + అచ్యుతు’ నన్నప్పుడు సంధి జరుగుతుంది. అక్కడ ‘ఒక్కడా యచ్యుతు...’ అనండి.
    *
    ఆదిత్య గారూ,
    ...? ....!
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కానన వాస’ మని అనవలసింది.

    రిప్లయితొలగించండి
  15. శంకరయ్యగారికి నమస్సులు,
    చిత్రం చూస్తే చాలా ముచ్చటేసింది. ఆ చిన్నపిల్లవాడి ముద్దు ముద్దు మాటలు ... కందంలో పెట్టే ప్రయత్నం చేసా.ఏదో సరదాగా..
    మీ నాన్నా అమ్మేరీ ?
    పోనీలే భయపడొద్దు.బోలెడు పే...ద్దో
    ణ్ణే నేను !!గొడుగులో లా
    లా !!నిన్నూ వాననుండి లచ్చించేస్తా!

    రిప్లయితొలగించండి
  16. ఆదిత్య గారూ,
    చిత్రం చూస్తే మీకు ముచ్చటేసింది... వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలున్నా పద్యం చూస్తే నాకు ముచ్చటేసింది. సంతోషం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. అన్నెము పున్నెము నెరుగని
    కన్నయ్య వనుచు నిన్ను కనికర మందున్
    యెన్నగ తరమే నినుగని
    సన్నుతి జేయంగ వలయు చత్రము బట్టన్

    రిప్లయితొలగించండి
  18. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    కానన వాసమన్నచో గణభంగమగును
    కాన యన్నను కానన మన్నాఅర్ధమొకటేగదా
    కానకగన్న సంతానమ్ముగావున కానకు చన్న
    సంతానమయ్యె

    రిప్లయితొలగించండి
  19. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘కన్నయ్యవె యనుచు...’ అంటే సరి. ‘అందున్ + ఎన్నగ’ అని విసంధిగా వ్రాయరాదు కదా... అక్కడ ‘కారుణ్యములో / నెన్నగ...’ అందాం.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    ‘కాన’ దేశ్యం. దానితో వాస కలిపి సమాసం చేయరాదు. కాననవాస సరియైన ప్రయోగం అన్నాను కాని అక్కడ వ్రాయాలనలేదు. గహనవాస అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  20. కొండను గొడుగుగ బట్టిన
    పండరినాథుడు తడువగ పదుగురిలోనన్
    నుండగలేక బుడుత తా
    నండగ నిలిచె నపరిమిత నమ్మిక తోడన్

    రిప్లయితొలగించండి