14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

దత్తపది - 37 (సభ-బిల్లు-ప్రతినిధి-తగవు)

కవిమిత్రులారా!
సభ - బిల్లు - ప్రతినిధి - తగవు
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
కౌరవసభలో శ్రీకృష్ణుని హితబోధపై పద్యం వ్రాయండి.

22 కామెంట్‌లు:

 1. సంధి చేయుము కురురాజ! సభకు బిలిచి
  కలుగు సంతసం బిల్లును వెలుగు దాన
  నరయ వలయును ప్రతినిధి విరువురకును
  వలదు తగవిక కౌరవపాండవులకు.

  రిప్లయితొలగించండి
 2. సభను జేరిన క్రుష్ణుని సంతసమున
  చేగొని నడిపించె శాంతనవుడు శోబిల్లు
  సభయందు చక్కగా నిల్చి తా ప్రతినిధిగా
  వచ్చితినంచనె క్రుష్ణుదు తగవు దీర్ప.

  రిప్లయితొలగించండి
 3. సభను జేరిన కృష్ణుడు సాదరముగ
  పాండవులప్రతినిధిగా వచ్చెననుచు
  వలదు తగవిక కౌరవ పాండవులకు
  సంధి చేయగ శోభిల్లు సర్వులకును

  రిప్లయితొలగించండి
 4. సంధిజేయగ వచ్చితి సభకు నేను
  వినగ మాటలు రక్షణంబిల్లు కగును
  వారిప్రతినిధి గాచెప్ప, వాదులాడి
  తగవు నీవని దెప్పగా తగవులేను.  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని గారికి
  పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  వచ్చితి సభకుపాండవ ప్రతినిదిగను
  తగవువలదు సుయోధనా! సగము రాజ్య
  మిచ్చిధర్మము కాపాడు పచ్చ నైన
  ధ్రువను శాంతి శోభిల్లు హితోక్తి వినుము

  రిప్లయితొలగించండి
 6. హరి తగవు గోరి కురుసభ కరుగు నపుడు
  పాండవ సభలోఁ పార్థుల వాంఛ తెలియ
  చనె ప్రతినిధిగ వారికి సంధి చేయ
  దివిన శోభిల్లు సూర్యుని తీరుగాను

  తగవు గోరి: సంధి చేయువాడు
  సభ: గృహము, సమూహము

  రిప్లయితొలగించండి


 7. పాండు సూనుల బంపున బ్రతినిధిగ ను
  సంధి జేయగ వచ్చితి సభకు నేడు
  తగవు లాటలు లేకుండ ధర్మ ముగను
  సంత సంబి ల్లు నట్లుగ సగము నిమ్ము .

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  తగవు దీర్చంగ సంధికై తరలి వచ్చి
  సంతసం బిల్లు వాకిలి సుంత నిలుప
  బలుకు ప్రతినిధి హరిఁ బట్టి బందిసేయ
  సభను బొధించె కౌరవుల్ సమసెదరని

  రిప్లయితొలగించండి
 9. శౌరి శోభిల్లు రూపాన సభకు నేగి
  పాండవుల ప్రతినిధిగతాఁ ప్రకటనిచ్చి
  తగవు తోడను కల్గెడు వగపు తెలిపి
  సభను హితవచనములతో సంస్కరించె
  మాటవిననట్టి కౌరవుల్ మహిన బడిరి

  రిప్లయితొలగించండి
 10. మామా ! నీ సభ జూడనింత సమరోన్మాదమ్ముతో నున్న దే
  లో? మాటల్ తలకెక్కునే యడవి బిల్లుల్ వోలె కాట్లాడగా
  ఏమయ్యెన్ కులధర్మమో ప్రతినిధీ! ఎంతేని నీ చేతి యీ
  గ్రామంబుల్ తులయౌనె? పోవు తగవున్ రారాజు ప్రాణాలకున్!

  రిప్లయితొలగించండి
 11. పాండవులను, రాయబారి కృష్ణుని అవమాన పూర్వకముగా దుర్యోధనుడు మాటలాడగా శ్రీకృష్ణుడు మందలిస్తూ........

  సభను మర్యాద పాటించ జాలలేవె?
  యణగఁ ద్రొక్కినంబిల్లులె యైన యెదురు
  తిరుగునంద్రు; ప్రతినిధి నే ధీరులకని
  మరచి నగుబాటు పాలవంబంతమేల?

  రిప్లయితొలగించండి
 12. తగవు విడువరాదను పంతము (సవరణ):)

  సభను మర్యాద పాటించ జాలలేవె?
  యణగఁ ద్రొక్కినంబిల్లులె యైన యెదురు
  తిరుగునంద్రు; ప్రతినిధి నే ధీరులకని
  మరచి తగవులనాడగంబంతమేల?

  రిప్లయితొలగించండి
 13. కవిమిత్రుల పూరణలు బాగున్నవి...కాని కొందరు బిల్లును భిల్లుగా పొరబడినట్లున్నారు.....

  రిప్లయితొలగించండి
 14. నిండు సభలోన దెలిపెద నిజమువినుడి
  వంశమున నాశనంబిల్లు వైరము విడ
  ప్రతినిధిగఁ జెప్ప నైదూల్లఁ బంచినంత
  తగవు మరచి రాజ్యంబు ధన్యమౌను

  రిప్లయితొలగించండి
 15. సంధిజేయగ వచ్చితి సభకు నేను
  ఇదియ వినకున్న నగుభయంబిల్లు కూలు
  ' పాండు కొమరుల ప్రతినిధి! పలుక వలదు
  తగవు నీవని ' దెప్పగా తగవులేను.

  రిప్లయితొలగించండి
 16. కవిమిత్రులకు నమస్కృతులు.
  రెండు రోజులు మేడారం సమ్మక్క సారలక్క జాతరకు వెళ్ళి రాత్రి తిరిగి వచ్చాను. మొన్న కాసేపు ఒకరి లాప్‍టాప్‍లో బ్లాగును కాసేపు చూచే అవకాశం దొరికింది.
  పూరణలు, పద్యాలను వ్రాసిన
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  రఘుకుమార్ గారికి,
  శైలజ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  సుబ్బారావు గారికి,
  భాగవతుల కృష్ణారావు గారికి,
  ఆదిత్య గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  సహదేవుడు గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. పిన్న తండ్రి బిడ్డలతోడఁ బిల్లులటుల
  తగవు పడుట కౌరవులకు తగదనుచును
  పాండవుల ప్రతినిధి నంచు పలికె శౌరి
  కురుసభయభిప్రాయంబును కోరెనతడు

  రిప్లయితొలగించండి
 18. సభను హితములఁ జెప్పెను శాంతి కొరకు

  రిప్లయితొలగించండి