ఎన్నెన్ని రంగులున్నవెమన్నన సేసెదరునిన్న మహిలో జనులేనిన్నిక మించెడు సొగసరి నెన్నడు కాంచంగలేము నీవే ఘనమౌధాత నేర్పు దెలుపు సీతకోకచిలుకఅంద మదియు జూడ నవని లోనసొబగు లీను విరుల సోయగమ్ముకు తానుసాటి యనుచు నిలుచు కీటకమ్ము
భీతిని గలిగించెడు బహురోతౌ గొంగడి పురుగది రూపాంతరమైసీతాకోకచిలుకగనుభూతలమున దైవసృష్టి బొగడగ తరమే
ఆంజనేయ శర్మ గారూ,మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘మన్నన సేసెదరు నిన్ను/నిన్నె’ అని ఉండాలనుకుంటాను.
శశికాంత్ మల్లప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రోతగ గొంగళి పురుగుగ భీతిని గొలుపిన కనులకు ప్రీతిని జేయన్ నీ తపము పూర్తియవగా సీతాకోకగను మారి చెలువొందితివే.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములండి ...గురువుగారూ....సరిచేయగలను
రంగు రంగుల తోడను రమ్య మలరి చూడ ముచ్చట గొల్పును జూప రులకు చెలువు గలదిసీ తాకోక చిలుక యార్య !దశ లు దశలుగ మారును దనర యదియ
సీతాకోకచిలుక కడుప్రీతిని గూర్చును సతతము వీక్షక తతికిన్నాతులచీరెల రంగులతా తిరుగుచు పూలపైన త్రాగుచు తేనెన్ /తో తిరుగుచుపువ్వు నుండి దోచుచు తేనెన్
కమనీయ వర్ణ సముదాయము నన్నలరుచు ఛదద్వ యాకర్షణ విభ్రమ, సీతా కోక చిలుక,సుమ మకరందాశను గన చోద్యంబాయెన్
పత్రమున చిత్రము కడు విచిత్రము గన్నేత్రములకు చిత్తంబునకున్చిత్రానుభూతి నిచ్చి పవిత్రానందము నొసంగె విస్తారముగన్
సీతకోక-చిలుక రీతిగనుండగ?సీతకోకచిలుక-చేర్చి కొనెన?సీత,కోక,చిలుక,సింగారమున్ జూడ?సృష్టి కర్త రచనె పుష్టి మనకు.
.రెక్కలురేపు యూహల నిరీక్షణ జేయక పువ్వునవ్వగా?టక్కునవాలి తేలికగ టక్కరిచే మకరంద మంతయున్మెక్కెడి తొండమున్ నిడుచు”మేటిగ రెక్కలరంగుజూడగాచక్కదనాలచిల్క| ననజాలక కీటకమాయె|మాయగా|3.జన్మ జన్మల బంధంబు జగతియందుకలదటంచు నిరూపణ దెలుపు” సీతకోకచిలుకల దశలు|సంకోచ మేలనన్న భావనగనుపించు వన్నెలందు”.
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
అరె! సీతాకోకచిలుకమరిమరి పలు విరులపైన మధురిమ గ్రోలన్ధరణిని మేలగునది పరపరాగ సంపర్క క్రియకు బాసట యగుచున్!
దశలను దాటిన తదుపరిపసగల రంగులను దాల్చి పరువము తోడన్మిసమిస సీతాకోకయికుసుమముపైవ్రాలి గ్రోలు ఖుసిగా మధువున్!!!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రంగులీను చున్న రమణీయతను జూడఅలరు చుండు మనము నవని యందుచూడచూడ దాని సొబగు హెచ్చుచు నుండుచిన్ని సీతకోక చిలుకయదియెనలువ సృష్ఠిలోని నయగారమునుగాంచదాని హొయలు చూడ తమియు హెచ్చు.తాకినంత తనువు తల్లడిల్లచునుండుకమ్మనైన పులుగు కనుల విందు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
22 కామెంట్లు:
ఎన్నెన్ని రంగులున్నవె
మన్నన సేసెదరునిన్న మహిలో జనులే
నిన్నిక మించెడు సొగసరి
నెన్నడు కాంచంగలేము నీవే ఘనమౌ
ధాత నేర్పు దెలుపు సీతకోకచిలుక
అంద మదియు జూడ నవని లోన
సొబగు లీను విరుల సోయగమ్ముకు తాను
సాటి యనుచు నిలుచు కీటకమ్ము
భీతిని గలిగించెడు బహు
రోతౌ గొంగడి పురుగది రూపాంతరమై
సీతాకోకచిలుకగను
భూతలమున దైవసృష్టి బొగడగ తరమే
ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘మన్నన సేసెదరు నిన్ను/నిన్నె’ అని ఉండాలనుకుంటాను.
శశికాంత్ మల్లప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రోతగ గొంగళి పురుగుగ
భీతిని గొలుపిన కనులకు ప్రీతిని జేయన్
నీ తపము పూర్తియవగా
సీతాకోకగను మారి చెలువొందితివే.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములండి ...గురువుగారూ....సరిచేయగలను
రంగు రంగుల తోడను రమ్య మలరి
చూడ ముచ్చట గొల్పును జూప రులకు
చెలువు గలదిసీ తాకోక చిలుక యార్య !
దశ లు దశలుగ మారును దనర యదియ
సీతాకోకచిలుక కడు
ప్రీతిని గూర్చును సతతము వీక్షక తతికిన్
నాతులచీరెల రంగుల
తా తిరుగుచు పూలపైన త్రాగుచు తేనెన్ /
తో తిరుగుచుపువ్వు నుండి దోచుచు తేనెన్
కమనీయ వర్ణ సముదా
యము నన్నలరుచు ఛదద్వ యాకర్షణ వి
భ్రమ, సీతా కోక చిలుక,
సుమ మకరందాశను గన చోద్యంబాయెన్
పత్రమున చిత్రము కడు వి
చిత్రము గన్నేత్రములకు చిత్తంబునకున్
చిత్రానుభూతి నిచ్చి ప
విత్రానందము నొసంగె విస్తారముగన్
సీతకోక-చిలుక రీతిగనుండగ?
సీతకోకచిలుక-చేర్చి కొనెన?
సీత,కోక,చిలుక,సింగారమున్ జూడ?
సృష్టి కర్త రచనె పుష్టి మనకు.
.రెక్కలురేపు యూహల నిరీక్షణ జేయక పువ్వునవ్వగా?
టక్కునవాలి తేలికగ టక్కరిచే మకరంద మంతయున్
మెక్కెడి తొండమున్ నిడుచు”మేటిగ రెక్కలరంగుజూడగా
చక్కదనాలచిల్క| ననజాలక కీటకమాయె|మాయగా|
3.జన్మ జన్మల బంధంబు జగతియందు
కలదటంచు నిరూపణ దెలుపు” సీత
కోకచిలుకల దశలు|సంకోచ మేల
నన్న భావనగనుపించు వన్నెలందు”.
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
అరె! సీతాకోకచిలుక
మరిమరి పలు విరులపైన మధురిమ గ్రోలన్
ధరణిని మేలగునది పర
పరాగ సంపర్క క్రియకు బాసట యగుచున్!
దశలను దాటిన తదుపరి
పసగల రంగులను దాల్చి పరువము తోడన్
మిసమిస సీతాకోకయి
కుసుమముపైవ్రాలి గ్రోలు ఖుసిగా మధువున్!!!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రంగులీను చున్న రమణీయతను జూడ
అలరు చుండు మనము నవని యందు
చూడచూడ దాని సొబగు హెచ్చుచు నుండు
చిన్ని సీతకోక చిలుకయదియె
నలువ సృష్ఠిలోని నయగారమునుగాంచ
దాని హొయలు చూడ తమియు హెచ్చు.
తాకినంత తనువు తల్లడిల్లచునుండు
కమ్మనైన పులుగు కనుల విందు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి