16, జనవరి 2015, శుక్రవారం

న్యస్తాక్షరి - 23

అంశం- గాలిపటము
ఛందస్సు- ఉత్పలమాల
మొదటిపాదం మొదటి అక్షరం ‘గా’
రెండవపాదం ఐదవ అక్షరం ‘లి’
మూడవపాదం పదకొండవ అక్షరం ‘ప’
నాల్గవపాదం పదునాఱవ అక్షరం ‘టం’

14 కామెంట్‌లు:

  1. ‘గా’లులు స్వేచ్ఛగా విసరు కాల మిదే యని పిల్ల లెల్ల దా
    రాలకు మే‘లి’మై వరలు రంగుల కాగితముల్ లయించి దూ
    రాల గమించు రీతిగ సురా‘ప’గహంసలవోలె నాడఁగా
    వీలగురీతితో నెగురవేతురు గాలిప‘టం’బు లెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  2. గాటపు కోర్కె దారమున గట్టి తటాలున వేయ గాలికిన్
    వాటుగ దేలియాడుచును వర్ణము లింపుగ దోప నింగిలో
    పాటవ మొప్ప నాడుగద పాపలు బాబులు పొంగి కేరగా
    కైటభవైరి తేరు, కల కంఠము గాలిపటంపు సాటియే?



    రిప్లయితొలగించండి
  3. గాలుల దిక్కుజూసిపలు గాలిప టమ్ములు చేతబట్టి ఈ
    బాలురు కేలియాడి పలు వైరము జూపుట సందడే సుమా !
    గాలుల దిక్కుజూ సిపలు కాపటి రీతుల మాట మార్చి నో
    వాలును జూసినేత, తన వైఖిరి మార్చుట టంకమే కదా !

    రిప్లయితొలగించండి
  4. గాలము వేయుబాల్యమున ఖంబున రేగుచు కంటికింపుగా
    దేలుచు గాలిలో నవియె తీరుగ బోవగ తోకతోడుతన్
    సోలుచు దారమున్ నెగుర జూరె బాలలు సంబరమ్ముతో
    మేలగు జూడవేడుకగు మిన్నున గాలిపటంబులాటయే!!!

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గారముఁ జూపు పిల్లలకు గాలిపటమ్ములఁ దెచ్చు సాకుతో
    వారల మాలిమిన్ బిలచి వద్దకు చేర్చెడు క్రొత్త వారితో
    నారును మిత్రమా ధరణినాపదలెన్నియొ, భద్రమౌనటుల్
    మీరలు నుండగా తగును, మేలగు మీకునటందు సూటిగా.

    రిప్లయితొలగించండి
  7. గాలులు మేలుగా బెరయు గ్రాహపు సంక్రమణ౦పు వేళలన్
    బాలురు గేలి సేయుచును వాయు పటమ్ముల నాడుచు౦దురా
    సోలిన గ్రద్ద మాదిరిగ చూపరులన్ మురిపి౦చుచున్ సదా
    గాలిపటమ్ముత్రెంచుచును కైపున మోదపు ట౦చునొందుచున్



    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గాలియువెంటనంపకనె?కట్టగసూత్రము|సంబరంబునన్
    జాలిగతేలిపోవుచును|జన్మకుసార్థకమట్లు|"గాలిఫై
    వాలగనాలివోలె|"పసిపాపలదృష్టికిపుష్టినింపుటే|
    మేలగునాటిసంస్కృతినిమేటిగగాలిపటంబుచాటుగా|

    రిప్లయితొలగించండి
  10. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గాలిని తూలియాడుచును గాలిపటంబులు నాకసంబునన్
    వాలము వా"లి"యుండగను పాములు పాకుచు నున్నయట్లుగాన్
    హేలగ సూత్రముల్ గొనియు నిం"ప"గు రీతినినాడ,గ్రద్దలున్
    తూలెడు వానినే గనియు తుళ్ళెడి పాముల"టం"చు చీల్చవే!

    రిప్లయితొలగించండి
  12. గాలిపటమ్ము జేయుటకు కాగితమెంతయు కత్తిరించియున్
    వాలుగ తేలియాడగను వాలము కొంతను జేర్చి దారమున్
    చాలిననుండ దూర్చి నొక చాపము వోలెను రెండున్ పుల్లలన్
    వీలుగవంచి కట్టవలె పేనిన సూత్రమటంచు మధ్యనన్.

    రిప్లయితొలగించండి
  13. గాలిపటమ్ములాడుచును గ్రామము లందు వసించు పెద్దలున్
    బాలురు బాలికల్ ముదము పండుగ రోజున పొందుచుండెడిన్
    కాలము సాగు సంతసముగా పలు పల్లెల, నిశ్చయంబవే
    మేలగు జీవితమ్ము గల మిన్నలు దేశ పటంబునన్ సుమా!

    రిప్లయితొలగించండి
  14. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    గాలిపటాన్ని తయరుచేసే విధానాన్ని చక్కగా వివరించారు మీ పద్యంలో. బాగుంది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి